శ్రీనివాస రామానుజం -srinivasa ramanujan biography in telugu

0

శ్రీనివాస రామానుజం : గొప్ప గణితశాస్త్రవేత్త. గణితమే జీవితంగా గడిపాడు. తమిళనాడులో తంజావూరు జిల్లాలోని కుంభకోణంలో జన్మించాడు. క్రీ.శ. 1887 నుండి 1920 వరకు జీవించి ఉన్నాడు. ఒక నిరుపేద కుటుంబంలో జన్మించినప్పటికీ స్వాభిమానధనుడు, నాలుగవ తరగతి చదువుతున్నప్పుడే (Trigonometry)కి సంబంధించిన విషయాలను గురించి చాలా ఆసక్తికరంగా మాట్లాడేవాడు.
విద్యార్థి దశలోనే స్వయంకృషితో గణితశాస్త్ర సంబంధమైన అనేక కొత్త కొత్త సూత్రాలను కనిపెట్టి తెలియజెప్పేవాడు. 15 ఏండ్ల వయసులో జార్జ్ స్కూచ్ నిడ్జ్ కార్ రూపొందించిన 6000 గణిత సిద్ధాంతాలను తులనాత్మకంగా పరిశీలించాడు. గణితశాస్త్రంలో ఈయనకు గల ప్రజ్ఞను చూసి మద్రాసు విశ్వవిద్యాలయం ఈయనకు ఏ డిగ్రీ లేకపోయినాగాని నెలకు 75 రూపాయలు ఫెలోషిప్ మంజూరు చేసింది. అప్పుడే రామానుజన్ 120 గణిత సిద్ధాంతాలను కొత్తగా పొందుపరచి కేంబ్రిడ్జ్ విశ్వవిధ్యాలయం కి చెందిన ప్రొఫెసర్ జి.హచ్.హార్డీకి పంపాడు. ఆ ప్రతిభను చూసి ముగ్ధుడైన హార్టీ రామానుజంనుఇంగ్లండుకు ఆహ్వానించాడు.
1918 ఫిబ్రవరి 18న రామానుజంను ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీగా ఎన్నుకున్నారు. ఆ సంవత్సరమే రామానుజంను చాలా అరుదైన “ఫెలో ఆఫ్ ది ట్రినిటీ కాలేజ్” గా కూడా ఎన్నుకున్నారు. బీజగణితంలో ఈయన సాధించిన సమీకరణాలు ప్రపంచ ప్రఖ్యాతిని పొందాయి. ఆచార సంపన్నమైన కుటుంబంలో జన్మించిన రామానుజానికి ఇంగ్లండులో సరియైన సదుపాయాలు లేక ఆరోగ్యం దెబ్బతిని క్షయ వ్యాధిసోకి 1920లో మరణించాడు. గణితంలో ఎప్పటికప్పుడు చిత్రవిచిత్రమైన అంశాలను ఆవిష్కరిస్తూ ఉండేవాడు.ఈయనకు ఎనలేని దైవభక్తి ఉండేది. సైంటిస్ట్ అంటే నాస్తికుడే అయి ఉండాలనుకునే వారికి వీరి జీవితం కనువిప్పు కలిగిస్తుంది. గణితశాస్త్రంలో సంఖ్యా సిద్ధాంతం, అంకెల విభజన సిద్ధాంతము, భిన్నముల సిద్ధాంతమును రామానుజమే రూపొందించాడు.
మరణించే సమయంలో కూడ ఆయన బుద్ధి గణితశాస్త్ర విషయంలో కూడా చాలా చురుకుగా పనిచేసిందని చెప్పడానికి ఈ ఉదంతం తార్కాణంగా కనిపిస్తుంది. తానెక్కిన 1729 నెంబరుగల కారు పనికి మాలినదని చాలా నెమ్మదిగా నడిచిందని ఎవరో గుర్తు చేస్తే కారు ఎలాంటిదైనా, ఆ సంఖ్య చాలా మంచిది. రెండు ఘనముల మొత్తంగా ఈ సంఖ్య రెండు రకాలుగా ఏర్పడుతుంది. ఇటువంటి సంఖ్యలో ఇదే చిన్నదని (101+91) మరియు (12*417) అనే సమీకరణాన్ని సూచించాడు. ఈయన గౌరవార్థం మద్రాసు విశ్వవిద్యాలయమువారు వారి పేరుతో ఒక అవార్డును, రామానుజం ఇనిస్టిట్యూట్ ను నెలకొల్పారు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top