Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

డా|| సతీశ్ ధవన్ - satish dhawan biography in telugu

డా|| సతీశ్ ధవన్ చకారభద్రం అస్యభ్యమ్ ఆత్మనే తపంతసః మా కోసం, తన కోసం మేలు చేసే వాడే తపస్వి.. తపస్సు అంటే ముక్కు మూసుకొని జపం చేయడం అ...

డా|| సతీశ్ ధవన్


చకారభద్రం అస్యభ్యమ్ ఆత్మనే తపంతసః
మా కోసం, తన కోసం మేలు చేసే వాడే తపస్వి.. తపస్సు అంటే ముక్కు మూసుకొని జపం చేయడం అంటే అది పొరపాటే. దేశ హితం కోసం నిర్విరామంగా, నిస్వార్ధంగా చేసిన సేవను మించిన తపస్సు లేదు. డా. సతీశ్ ధవన్ గారికి ఈ సూక్తి సర్వవిధాలా సరిపోతుంది, 1920 సెప్టెంబర్ 2న కశ్మీర్ లోని శ్రీనగర్లో జన్మించిన సతీశ్ ధవన్ అంతరిక్ష విజ్ఞానశాస్త్రంలో చాలా పేరు ప్రఖ్యాతలు గడించిన వ్యక్తి. ఆయన సేవాకాలంలోనే భారతదేశం ఎస్. ఎల్.వి. అంతరిక్షనౌకలను ప్రయోగించింది. నేడు భారతదేశం ఈ రంగంలో అయిదవ స్థానంలో ఉందంటే కారణం డా|ధవన్ అని నాసాతో సహితంగా ఉన్న అన్ని దేశాల అంతరిక్ష కేంద్రాలు ఏక కంఠంతో ఉన్నాయి.
ధవన్ లాహోరలోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు. అప్పుడు భారతదేశం బ్రిటిషు పాలనలో ఉండేది. అప్పటికింకా పాకిస్తాన్ ఏర్పడలేదు. లాహోర్లోనే మెకానికల్ ఇంజనీరింగు చదివి (1947) ఇంగ్లీషు లిటరేచరులో మాస్టరు ఆఫ్ ఆర్ట్ డిగ్రీ చేశాడు. అయినా ఆయన విద్యాపిపాస చల్లారలేదు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసాటా నుంచి ఎయిర్ స్పేస్ అంశంలో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ చదివాడు. అప్పటికీ ఆయన తృప్తి పడలేదు. చదువు చాలించలేదు. కాలిఫోర్నియా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో ఏరో నాటికి ఇంజనీరింగు డిగ్రీ చదివాడు.
తదనంతరం డా.హన్స్ డబ్ల్యూ లోపమేన్ సలహాతో, ఆయన పర్యవేక్షణలోనే రెండు పిహెచ్డిలు (మేథమేటిక్స్, ఎయిర్ స్పేస్ ఇంజీనిరింగు) చేసి డాక్టరేటు పట్టా పొందాడు. అదే యూనివర్సిటీలో కొంతకాలం పనిచేశాడు. తర్వాత భారతదేశంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నేషనల్ ఎయిర్ స్టేస్ లేబరేటరీస్లో పనిచేయడమే కాక, సేన్ కమీషన్ చైర్మన్గా, ఇసో సెక్రటరీగా కొంతకాలం పనిచేశాడు. 1972లో ఇస్రో ఛైర్మన్ పదవీ బాధ్యతలను స్వీకరించాడు. ఆయన ఇస్రోలో చైర్మన్ గా పనిచేస్తున్న కాలంలోనే ప్రఖ్యాత శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి డా||ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ ఇస్రోలో డైరెక్టరుగా పనిచేసేవాడు. 1975లో డు. ఆయన ఇస్రోలో చైర్మన్ గా పనిచేస్తున్న కాలంలోనే ప్రఖ్యాత శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి డా. కలామ్ డైరెక్టరుగా ఉన్న సమయంలో ఎన్. ఎల్.వి. మిషన్లో భాగంగా అంతరిక్ష కక్ష్యలోకి ప్రయోగించిన ఉపగ్రహం విఫలమైంది.
ఉపగ్రహం తిన్నగా బంగాళాఖాతంలో పడింది. పత్రికా విలేకరులకు ఆ విషయం చెప్పీవలసి వచ్చింది. డా||కలామ్ ఖిన్నుడయ్యాడు. డా|| ధవన్ పత్రికా విలేకర్లను కలసి “మా ప్రయోగం విఫలమైంది. ఉపగ్రహంలోని ఇంధసం కారిపోయింది. ఎక్కువ ఇంధనం ఉంది. కొంత కారిపోయినా ప్రమాదం లేదనుకున్నాము". డు. ఆయన ఇస్రోలో చైర్మన్ గా పనిచేస్తున్న కాలంలోనే ప్రఖ్యాత శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి డా| కలామ్ అతని సహచరులు ఆ పొరపాటుకు బాధ్యులు. ఆయినా దావన్ ఆ బాధ్యతను తన మీద వేసుకున్నాడు. “ఈ పర్యాయం మేం విజయం సాధించలేకపోయాం. నాకు నా టీమ్ మీద పూర్తి విశ్వాసం ఉంది, మళ్ళీ ప్రయత్నంలో తప్పక విజయం సాధిస్తాం" అని ధైర్యంగా చెప్పాడు.
అదే విధంగా 1980లోని ప్రయోగం సఫలమై భారతదేశం అంతరిక్ష క్షేత్రంలో కాలు మోపింది. మళ్ళీ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటైంది. ఈ పర్యాయం ధవన్ తెరపరుగున ఉండిడు. ఆయన ఇస్రోలో చైర్మన్ గా పనిచేస్తున్న కాలంలోనే ప్రఖ్యాత శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి డా! కలామ్ అతని సహచరులు సఫలమైన ప్రయోగం గురించి మీడియాకు తెలియజేశారు. దావన్ ఔదార్యం చూసి డాIIకలామ్ అతని సహచరులు ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన దావన్లో నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయని తెలియజేస్తుంది.
తదనంతర కాలంలో డా||కలామ్ స్వయంగా ఆ విషయాలను చెప్పి ఆయన మంచి తనానికి జోహార్లు అర్పించాడు. ఎయిర్ స్పేస్ రంగంలో ధవన్ అకుంఠిత దీక్షతో పని చేసారు. ఆయన చేసిన ముఖ్యమైన పరిశోధనల పత్రాల విషయాలు బౌండరీ లేయర్ థీరీ అనే పుస్తకంలో చోటు చేసుకున్నాయి. డు. ఆయన ఇస్రోలో చైర్మన్ గా పనిచేస్తున్న కాలంలోనే ప్రఖ్యాత శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి డా! సతీశ్ ధవన్ ఏ కార్యం చేసినా అది సమాజ మేలుకోరి చేసినదే. అందుకే ఆయనొక తపస్వి, 81 సంవత్సరాల వయసులో 2002, జనవరి 3 న ఈ యోద్ద అసువులు బాసాడు. ఆయన అమరుడు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

2 comments

  1. He is master of doctor appointment abdhul Kalam sir... Salute this nation's builders

    ReplyDelete