Type Here to Get Search Results !

హిందూజాతిని కాపాడిన స్వామి దయానంద సరస్వతి - About Swami dayaanda in teluguస్వామి దయానంద సరస్వతి ఆర్యసమాజ స్థాపకుడు. హిందూ ధర్మసంస్కృతుల పునరుద్దారకుడు. వైదిక ధర్మప్రచారకుడు. ఆధునిక సంస్కర్తలలో ప్రముఖుడు. హిందూ సమాజానికి నూతన యౌవనాన్ని తెచ్చి వైదిక కాలంనాటి గౌరవాన్ని పునరుజ్జీవింపజేయడానికి కృషి చేసిన మహామనీషి. దయానందుడు సౌరాష్ట్ర (గుజరాతు)లో 1824వ సంవత్సరంలో మోరబీ గ్రామంలో జన్మించాడని కొందరు, జీవపురం అనే గ్రామంలో జన్మించాడని కొందరుచేపుంటారు. ఇతని తండ్రి అంబాశంకర్గా ప్రసిద్ది చెందిన కర్మన్ జీలాల్జీ తివారి, చిన్ననాటి ఇతని దయాశంకర్, జయమూలశంకర్ అనే పేర్లతో పిలిచేవారు.
బాల్యం నుండే గొప్ప ప్రజ్ఞ, చురుకైన బుద్ది, అద్భుత జ్ఞాపకశక్తి కలిగి ఉండేవాడు. శివరాత్రి రోజున శివలింగంపై ఎలుకలు తిరుగుతూ ప్రసాదాన్ని భక్షిస్తుండడం చూసీ 14వ యేటనే విగ్రహారాధనను నిరసిస్తూ తిరుగుబాటు చేశాడు. 19వ యేట ఇంటిని విడిచి పెట్టి బ్రహ్మచర్యదీక్షను పొందాడు. 15 సంవత్సరాలపాటు అడవులలో, హిమా లయాలలో, తీరక్షేత్రా స్థలాలలో సంచరించి సాధువులతో చర్చలు జరిపి జ్ఞానాన్ని సముపార్జించాడు. శంకరాచార్య ప్రవేశ పెట్టిన దశనామీ సంప్రదాయానుసారం సన్యాసదీక్షను పొంది దయానంద సరస్వతిగా పేరు పొందాడు. వేదాధ్యయనంలో వ్యాకరణం యొక్క స్థానం మిక్కుటంగా ఉండటంతో 1859లో మధురలో ఉన్న స్వామి విరజానందుని వద్ద శిష్యునిగా చేరి వ్యాకరణ శాస్త్రాధ్యయనాన్ని పూర్తి చేశాడు.
గురువుగారికిష్టమని అర్థశేరు లవంగాలు దక్షిణగా సమర్పిస్తే విరజానందస్వామి. దయానందునితో నేను సంపదను గురుదక్షిణగా కోరను. నీ జీవితాన్నే గురుదక్షిణగా కోరుతున్నాను. జీవించినంత కాలం అనార్యసాహిత్యాన్ని ఖండిస్తూ ఆర్యగ్రంథ మహిమను ప్రతిష్టాపిస్తూ వైదిక ధర్మరక్షణకు జీవితాన్ని సమర్పించు అదే గురుదక్షిణ అని అడిగాడు. ఆనాటి నుండి దయానందుడు సమాజ కార్యానికి అంకితమైనాడు. అనేకమంది మతప్రచారకులతో ముస్లిం మౌల్వీలతో క్రైస్తవ ఫాదరీలతో జీవుడు జన్మ పునర్జన్మల గురించి చర్చించి వీధర్మీయులను ఓడించి వైదిక ధర్మశ్రేష్టతను నిరూపించాడు.
విగ్రహారాధనను ఖండించాడు. హిందూ ధర్మంలోని దోషాలను, అంధ విశ్వాసాలను విమర్శించి నిర్మూలించే ప్రయత్నం చేశాడు, జ్ఞానభాండాగారాలైన వేదాలకుభాష్యం రాసి వైదిక ధర్మానికి అద్దం పట్టే సత్యార్ధప్రకాశిక అనే గ్రంథాన్ని వ్రాశాడు. సంస్కార విధి అనే గ్రంథాన్ని కూడ వ్రాశాడు. 1857 ఏప్రియల్ 10వ తేదీన ఆర్యసమాజాన్ని స్థాపించడం వారు చేసిన మహత్కార్యాలలో ముఖ్యమైనది. జనరంజకంగా వైదిక ధర్మాన్ని ప్రచారం చేయడం ఆర్యసమాజం యొక్క ముఖ్యోద్దేశ్యం.
ఆర్యసమాజానికి మార్గదర్శక సూత్రాలుగా దయానందుడు 10 సిద్ధాంతాలను రూపొందించాడు. స్త్రీలు కూడా యజ్ఞాలు చేయవచ్చు. గాయత్రీ మంత్రోపదేశం పొందవచ్చు అని అన్నారు. గుణకర్మలనుబట్టి వర్ణ వ్యవస్థ ఉండాలన్నారు. ఒక భాష, ఒక మతం, ఒక లక్ష్యం ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని దయానందుని దృఢవిశ్వాసం. హిందూ మతాచార్యుల పొరపాటువల్ల కోట్లాది హిందువులు ముస్లింలుగా, క్రైస్తవులుగ మారిపోయారు, మారిపోతున్నారు. దీనిని మనం అడ్డుకోవాలి. మూర్ఖమైన ఆచారాలను, సంప్రదాయాలను విడిచి పెట్టాలి. మతం మారిన హిందువులను తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకురావాలి అని చెప్పి శుద్ది కార్యక్రమాన్ని ప్రారంభించాడు.
అనాథల పట్ల బీదల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలని బోధించాడు. అంటరానితనం నిర్మూలించాలని చెప్పాడు. దయానందుడు భారతీయులలో తమ దేశం పట్ల, తమ ఆర్యధర్మం పట్ల, ఆరగ్రంథాల పట్ల భక్తిగౌరవాలను కలిగిస్తూ హిందూజాతిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో మహత్తరమైన కృషి సాగించాడు. ఆర్యధర్మం తిరిగి ధగద్ధగాయమానమైన కాంతులతో వెలుగొందడం చూచి సహించలేని దుర్మార్గుల కుట్ర ఫలితంగా విషప్రభావానికి గురియై 1883లో దయానందస్వామి పరమపదించాడు.
భారతజాతి పాశ్చాత్యుల పాలనతో బానిసతనంలో ఉన్నప్పుడు జాతీయ ధర్మాన్ని వేదసంప్రదాయాన్ని పునరుద్ధరించి హిందూజాతిని కాపాడిన మహాపురుషుడు దయానందసరస్వతి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
  1. ఒక భాష, ఒక మతం, ఒకే లక్ష్యం ఉంటేనే అభివృద్ధి.
    ఇది సత్యం.

    ReplyDelete

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..