Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

వాలెంటైన్స్ డే జరుపకండి- అది ఉత్సవం కాదు, ఉన్మాదం- valentine day story-megaminds

సోదరీ, సోదరులారా వాలెంటైన్స్ డే పేరుతో యువతీ యువకులు విశృంఖలంగా, విచ్చల విడిగా అక్రమ శృంగార కలాపాలు సాగించడం సామాజిక నేరం. ఈ లైంగిక ...


సోదరీ, సోదరులారా
వాలెంటైన్స్ డే పేరుతో యువతీ యువకులు విశృంఖలంగా, విచ్చల విడిగా అక్రమ శృంగార కలాపాలు సాగించడం సామాజిక నేరం. ఈ లైంగిక బీభత్సం, ధర్మానికి విరుద్దం, మానవత్వానికి కళంకం, హైందవ జాతీయ జీవన మూల్యాలకు విఘూతకరం. విద్యాలయాలలో చదువుకొని సంస్కారవంతులు కావలసిన సమయంలో విద్యార్థినీ విద్యార్థులు కామ కలాపాలకు ఒడిగట్టడం దేశద్రోహం కళాశాల చదువు నేర్పే పవిత్ర ప్రాంగణం, బడి సంస్కారాల భరతమాత ఒడి.
బడులు, కళాశాలలు కామ కేళీశాలలుగా మారిపోవడానికి విదేశాలనుంచి వచ్చిపడిన అనేక వికృతులు దోహదం చేస్తున్నాయి. అలాంటి వికృతులలో అత్యంత హీనమైనది వాలెంటైన్స్ డే పెళ్ళి అయిన తరువాత భార్య భర్తలు సాగించవలసిన శృంగార కలాపాలను పెళ్ళి కాని బాలబాలికలు, యువతీ, యువకులు సాగించడానికి వాలెంటైన్స్ డే దోహదం చేస్తుంది.
అందువల్ల వాలెంటైన్స్ డే ఉత్సవం కాదు. అది ఒక ఉన్మాదం. హిందూ జాతీయ జీవనంలో అనేక మంచి సంప్రదాయాలు భాగం, ఈ సంప్రదాయాలు వ్యక్తిగత సుఖాన్ని, ఆనందాన్ని మాత్రమే కాక సమాజ సమష్టి హితాన్ని, ప్రయోజాన్ని సాధించడానికి దోహదం చేస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం వ్యక్తిగత జీవనం సమాజ జీవనంలో భాగమన్న జాతీయ ధర్మం, హిందువుల పెళ్ళి, ప్రేమ, కుటుంబం, సంతానం, సౌశీల్యం, ఆర్థిక ప్రగతి, ఆధ్మాత్మిక సుగతి ఇవన్నీ ఈ జాతీయ ధర్మం ప్రాతిపదికగా అనాదిగా వికసించాయి అందువల్ల ప్రేమ గురించి, పెళ్ళి గురించి హిందు దేశీయులకు, సనాతన జాతీయులకు, ఇతర దేశాల వారు పాఠాలు చెప్పవలసిన పనిలేదు. పెళ్ళి చేయడానికి మన్మథుడు ఉన్నాడు, ప్రేమను పెంచడానికి వసంతుడు ఉన్నాడు. ఈ ప్రేమ, పెళ్ళి, ధర్మబద్దమైనవి, హైందవ సంస్కృతి నిబద్ధమైనవి. అనాదిగా కాముని పున్నమ పండుగ జరుగుతోంది.
వసంత ఉత్సవాలు జరుగుతున్నాయి. మంచి భర్త కావాలి అనే కన్యలు, బాలికలు జరుపుకున్నే ఉత్సవాలు ఉన్నాయి. సృష్టి ఆదిలో అత్యంత సౌందర్యమూర్తి అయిన పార్వతీదేవి పతి ప్రణయం కోసం తపించింది. పరమేశ్వరుని భర్తగా పొందింది. పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు, ఈ ప్రణవ మూర్తులు ఆనాది ప్రణయ మూర్తులు. అనాదిగా మనకు అనేక మంది ఆదర్శ ప్రణయ మూర్తులు ఉన్నారు. సీతారాములు, రుక్మిణీ కృష్ణులు, శకుంతలా దుష్యంతులు, నల దమయంతులు. ఇలాంటి అనేక అనేక భారతీయ దంపతులు నేటి యువజనుల ప్రేమకు పెళ్ళికి ఆదర్శదాయకం కావాలి. ప్రణయానికి పర్యవసానం పెళ్ళి, పెళ్ళి వల్ల వధూవరులు ధర్మ శృంగార బద్దులువులుతున్నారు.
అంతే కానీ విద్యార్థినీ, విద్యార్థులు చదువుకు నామం పెట్టి వీధుల వెంట తిరగడం, పార్కులలోను, మైదానాలలోను అసభ్యకరమైన అశ్లీలకరమైన శృంగార భంగిమలను ప్రదర్శించడం హిందు సంస్కృతికి విరుద్దం, చదువు పూర్తి అయిన తరువాత లేదా చదువు మానివేసిన తరువాతనే యువతీ యువకులు ప్రేమించాలి. పెళ్ళి చేసుకోని ధర్మబద్దంగా దాంపత్యం నెరపాలి. ఇది భారతీయ పద్దతి. వాలెంటైన్ అనే క్రైస్తవ మతగురువు రోమ్లో క్రీస్తు శకం మూడవ శతాబ్దిలో ప్రేమికులకు పెళ్ళిళ్ళు చేశాడు. చేస్తే చేశాడు. భారతీయులకు వాలెంటైన్ పెళ్ళిళ్ళు చేయలేదు. మనకు పెళ్ళి చేయడానికి ఆనాదిగా మన్మధుడు అనే దేవుడు ఉన్నాడు. మనకు వాలెంటైన్స్ డే అక్కర లేదు, మన్మథుడు ధర్మబద్దమైన పెళ్ళికి ప్రతీక. వాలెంటైన్ వీదేశీయ భావదాస్యానికి, శృంగార వికృతికి చిహ్నం.

వాలెంటైన్స్ డే మాత్రమే కాదు. ముద్దుల దినం, కిస్సింగ్ డే, కౌగిలంతల దినం, హగ్గింగ్ డే వంటివీ కూడ విదేశాల నుండి దిగుమతి అవుతున్నాయి. హిందు యువతీ యువకులను తప్పుదారి పట్టించి మన జాతీయతను, సంస్కృతిని, సౌశీల్యాన్ని, మన అస్తిత్వాన్ని, చెరిపి వేస్తున్నాయి. అందువల్ల వాలెంటైన్స్ డే ని ఇతర విదేశీయ వికృతలను బహిష్కరించాలి. మనదైన పద్ధతిలో మనం పండుగలను జరుపుకోవాలని, హిందువులు హిందువులుగా జీవించాలి.

No comments