Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

republic day speech - భారతమాత ను ఎందుకు పూజించాలి

గణతంత్ర మరియు స్వాతంత్ర్య  దినోత్సవం నాడు ప్రతి పౌరుడూ కనీసం కొన్ని మనదేశం కు సంబందించిన పూర్వపరాలు తెలుసుకొని దేశసేవకు అంకితమవ్వాలనే మా ...

గణతంత్ర మరియు స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రతి పౌరుడూ కనీసం కొన్ని మనదేశం కు సంబందించిన పూర్వపరాలు తెలుసుకొని దేశసేవకు అంకితమవ్వాలనే మా ఈ ప్రయత్నం.

ఏ మనిషికైనా తను ఏ తల్లి గర్భంలో జన్మించాలి మరియు ఈ భూమిపైన ఏ దేశంలో జన్మించాలి అనే ఈ రెండువిషయాలు దైవ నిర్ణయాలు. కావున మన అదృష్టం వల్ల మనం ఈ పవిత్ర భూమి అయిన భారతమాత ఒడిలో జన్మించాము,అదీ ఒక హిందువుగా, అట్టి మన మాతృభూమి యొక్క విశిష్టతను తెలుసుకొందాం.

హిందూ సంస్కృతిలో మనకు అడగకుండానే అన్నీ ఇచ్చే, ఎంతో మేలు చేసే వాటిని తల్లి గా పూజించే పద్ధతి ఉంది. అందుకే కన్నతల్లి, భూమితల్లి-భూమాత, గోమాత, గంగామాత, తులసీమాత, గీతామాత అంటాము.

నిజంగా ఈ భూమి మనకు తల్లే ఎలా? కన్నతల్లి నవమాసాలు మోస్తే ఈ తల్లి కడవరకూ, కట్టే కాలేవరకూ మోస్తుంది,అంతే కాదు ఆఖరికి తనలోనే కలిపేసుకొంటుంది. అంత గొప్పది. ఈ భూమి మనకు ఒక ప్రాణం లేని జడపదార్ధం ఎన్నటికీకాదు; కేవలం మట్టే కాదు, పాలిచ్చి పెంచిన కన్న తల్లి లాగా ఈమె మన జీవనానికి కావలసిన సర్వం నీరు, ఆహారం, స్థలం,బట్టలు, అన్నీ ఇచ్చి పోషించి పెంచుతుంది. ప్రతిఫలంగా ఏమీ ఆశించదు. తన పుత్రులలో గొప్పవాడైన వాని పేరుతో ఒకతల్లిని పిలిచినట్లు, శ్రేషుడైన భరతుడనే రాజు పరిపాలించన దేశం, కావున ఇది భారతదేశం, భారతమాత అని పిలిపించుకొంటున్నది.అంతేకాదు, శత్రు దుర్భేద్యమైన గొప్పగొప్ప పర్వతాలతో మనకు తండ్రిలాగా ఈ భూమియే రక్షణ కల్పించింది. ఇదియే మనకుఆధ్యాత్మ గురువుగా కూడా పనిచేసింది. తల్లి, తండ్రి, గురువు ఈ మూడు రూపాలు ఒకే ఆకృతి దాల్సి వచ్చిన దివ్యమూర్తి మనమాతృభూమి, ప్రియతమ భారతమాత.
ఈ భూమి, ఈ దేశం దేవభూమి. ఇది దైవ నిర్మితం. నాలుగు దిక్కులో వున్న ఎల్లలు 3 సముద్రాలు, హిమాలయాలు సహజమైనవి.ఇవి మానవ నిర్మితాలు కాడు. హిమాలయాలు అమ్మ తల పైన కీరీటములాగా, 3 సముద్రాలు కలిసి అమ్మ పాదాలు కడుగుతూ,శ్రీలంక అనే ఒక పుష్పాన్ని ఆమె పాదాల చెంత ఉంచినట్లుగా ఉంటుంది.
రత్నాకరా ధౌతపదాం హిమాలయ కిరీటినీమ్ బ్రహ్మరాజర్షి రత్నాడ్యాం వందే భారతమాతరం
(ఇక్కడ వేరే దేశాల గురించి, వాటి సరిహద్దుల గురించి ఉదా! చైనా గోడ)
ఇది హిందూదేశం: దీనికి హిందుస్థానం అని పేరు. అందుకే మనం హిందువులమైనాము.
హిమాలయం సమారభ్యo యావదిందుసరోవరం తం దేవనిర్మితం దేశం హిందూస్తానమ్ ప్రచక్ష్యతే
(బార్హస్పత్య పురాణం) అనగా హిమాలయాల నుండిహిందూమహాసముద్రం వరకు ఉన్న దేవతల ద్వారా నిర్మింపబడిన ఈభూమి హిందూస్తానమ్ అనే పేరుతో ప్రసిద్ధి గాంచినది.
మాన మాతృభూమి గొప్పతనం గురించి దేవతలు కూడా గానం చేశారు.
గాయంతి దేవాః కిల గీతకాని, ధన్యాస్తు తే భారత భూమి భాగే స్వర్గాపవర్గా స్పద హేతుభూత, భవర్తి భూయాః పురుషాః సురత్వాత్
(విష్ణుపురాణం) అనగా దేవగణాలు ఇలాగానం చేస్తాయి. మా దేవతలకంటే కూడా ఇక్కడి ప్రజలు ఎంతో ధన్యులు. ఎందుకంటే వారు స్వర్గానికి, మోక్షానికి సాధనాస్థలమయిన భారతభూమిలో జన్మించారు. పరమేశ్వరుడిని వెతుక్కుంటూ వెళ్ళే ప్రతి ఒక్క ఆత్మకు చిట్టచివరిగా ఆశ్రయం ఇచ్చేదిఏదైనా ఉన్నదంటే, అది భారతదేశమే అని వివేకానంద స్వామి పేర్కొన్నారు. గంగానదిలో ఆత్మార్పణ చేసుకొన్న ఒక జర్మన్దేశస్థుని ఉదాహరణ చెప్పుకోవాలి.
మనకు ఈ మొత్తం భూమి తపోభూమి. పూర్వము- పృధ్వీతలంలో సత్ఫలాన్నిచ్చే, తపమాచరించటానికి, యజ్ఞాలు చేయటానికి అనువైన, మంగళదాయిని, పుణ్యభూమి అని పిలువబడే ప్రదేశం ఏదైనా ఉన్నదా? అన్న ప్రశ్నకు కృష్ణసార మృగం (ఒక ప్రత్యేకమైనజాతికి చెందిన ఒక లేడి) సంచరించేదే దానికి తగిన స్థలం అని సమాధానం వచ్చింది. యావత్ ప్రపంచంలో అట్టి భూమి మన భారతదేశం మాత్రమే. అంత పరమ పవిత్రమైనది ఈ భూమి.

ఇక్కడి నదులు గంగా, యమున, గోదావరి, సరస్వతి, సింధు, కృష్ణ, కావేరీ, తుంగభద్ర, తపతి, నర్మదా, మహానది, గండకి. ఇక్కడి పర్వతాలు హిమాలయ, మహేంద్ర, మలయ, సహ్యాద్రి, రైవతకాద్రి, ఆరావళీ, వింధ్యా. ఇక్కడి పుణ్యక్షేత్రాలు అయోధ్య,శబరిమల, బదరీనాథ్, మధుర, అమర్ నాథ్, తిరుమల, కేదార్ నాథ్, పూరి, ప్రయాగ, మానస సరోవరం, ద్వారిక, హరిద్వర్,కంచీ, గయా. 54 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు, 108 వైష్ణవ క్షేత్రాలు, చతుర్దామాలు, కుంభమేళా జరిగేస్థలాలు, ఆది శంకరాచార్యుల ద్వారా స్థాపించబడి దేశ నలుదిశలా రక్షణార్థమై నిలిచినట్లున్న నాలుగు అడ్వైత ఆలయాలు.ఇంకా ఎన్నోచారిత్రక ప్రాముఖ్యత కలిగిన దర్శనీయ స్థలాలతో ఈ భూమి మనకు అత్యంత పవిత్రమైనదిగా, పుణ్యప్రదమైనదిగా భాసిల్లుతున్నది శ్రీరాముడు అయోధ్యనుండి రామేశ్వరం వరకు, శ్రీకృష్ణుడు ద్వారకా నుండి ప్రాగ్ జ్యోతివపురం (అస్సాం) వరకు నడయాడినఈ భూమిలో ప్రతి గ్రామము. ప్రతి ప్రదేశం మనకు శ్రద్యకేంద్రాలే.
మన ఇతిహాసాలు, పురాణాలు కూడా మన మాతృభూమి ఎంతటి వైశాల్యం కలిగినదో ప్రకటించాయి. నేటి ఆఫ్ఘనిస్తాన్ ఒకనాటి మన ఉపగణస్థానము. మహాభారతంలో శల్యుని స్థానం ఇదే. నేటి కాబూల్ కాందహార్లు ఒకనాటి గాంధారదేశం. ఇచటనే కౌరవులతల్లియైన గాంధారి జన్మించినది. చివరకు నేటి ఇరాను కూడ వాస్తవానికి ఒకనాటి ఆర్య దేశము. ఆ దేశపు చివరిరాజైన రెలకాషోపహమ్ఇ స్లాము మతము కన్న ఎక్కువగా ఆర్యుల యొక్క విలువలనే ఆదర్శంగా స్వీకరించి అనుసరించినాడు. పార్శీల పవిత్ర గ్రంధమైన జెండ్ వేసా చాలావరకు అధర్వణ వేదమే. ఇంక తూర్పు దేశాలు పరిశీలిస్తే నేటి బర్మా ఒకనాటి బ్రహ్మదేశం. నేటి 'ఐరావది లోయ 'ఇదావత్' అనే పేరున ఆనాటి కురుక్షేత్ర మహాసంగ్రామంలో పాల్గొన్నట్లు మహాభారతం చెపుతుంది, తూర్పున ఉన్న నేటి సింగపూర్ ఒకనాటి శృంగపురం. ఇలా మన మాతృభూమి ఒక మహోజ్వలమైన రూపం కలిగినది.

విశ్వానికంతకు దివ్యజనని అయిన ఆదిపరాశక్తియొక్క సజీవ రూపంగా ఈ భూమిని అరవింద మహాయోగి సాక్షాత్కరించుకున్నారు, మనం కనులారా తనను చూసేందుకు, ఆరాధించేందుకు అనువుగా మూర్తిరూపం దాల్సి వచ్చిన జగన్మాత, ఆదిశక్తి, మహామాయ, మహాదుర్గ ఈ భూమి అని తత్త్వవేత్త అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ స్తుతించారు. మాతృభూమి స్వాతంత్ర్యం కోసం చిరునవ్వుతోఉరికంబాలనెక్కిన వేలాది హృదయాలను ఉర్రూతలూగించిన అమరమైన వందేమాతరం గీతంలో త్వం హి దుర్గా దశ ప్రహరణధారిణి (పది ఆయుధములతో కూడిన దుర్గవు నీవు) అని బంకించంద్రుడు వందనం చేసినాడు.
ఇది భగవంతునికి ప్రియమైన భూమి. అందుకే దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ధర్మస్థాపన అనే తన కార్యాన్ని సిద్ధింప చేయడంకొరకు భగవంతుడు ప్రతియుగంలో స్వయంగా ఇక్కడే (ప్రపంచంలో మరెక్కడా కాకుండా ఇక్కడే) అవతరిస్తాడు. అటువంటిగొప్ప భూమి ఇది. ఇతర దేశాలలో మహా అయితే ఒక దైవకుమారుడో, ఒక ప్రవక్తయో జన్మించారు.
ఈ భూమి స్వర్గం కంటే మిన్న అయినది. రావణ సంహారం తరువాత స్వర్ణ రత్నాదులతో శోభిల్లుతున్న లంకను చూసి ఇష్టపడినలక్ష్మణునితో ప్రభు శ్రీరామచంద్రుడు “అపీ స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే - జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి"అన్నాడు. అంటే జన్మనిచ్చిన తల్లికి మరియు జన్మభూమికి స్వర్గం కూడా సాటి రాదని అర్ధము.
ఈ భూమికంటే పవిత్రమైనది మనకు వేరే ఏదీ ఉండబోదు. ఈ భూమిలోని ప్రతి ధూళికణం. సజీవ నిర్జీవ వస్తుజాలములోనిప్రతి ఒక్కటి, ప్రతిరాయి రప్పా ప్రతిచెట్టూ పుట్టా, మనకు పవిత్రమైనవే. ఈ భూమికి సంతానమయిన ప్రతిఒక్కని హృదయంలోనూ,ఇట్టి ప్రగాఢ భక్తిని, నిత్యనూతనంగా ఉంచేందుకుగాను, గతంలో ఇచ్చట అనేక పద్ధతులు, సంప్రదాయాలు రూపొందిస్తాయి,తనస్థానం ఈ సువిశాల భరత వర్షంలో ఎక్కడున్నదో సవివరంగా జంబూద్వీపే, భరతవర్షే భరతఖండే అంటూ సంకల్పంలోతప్పక చెప్పబడుతూ ఉంటుంది. ముఖ్యమయిన మన ధార్మిక ఉత్సావాలన్నీ భూమిపూజతోనే ప్రారంభమవుతాయి. ఉదయాననిద్రమేల్మోనగానే, భూమాతను క్షమాపణ కోరే ఆచారం మనకున్నది. రోజంతా ఆ మాతృదేవిని, తన పాదాలతో స్పృశించకుండాఉండటం ఎవనికీ సాధ్యంకాదుగదా. అందుకనే భారతీయులు సముద్రవసనే దేవి పర్వతస్తనమండలే - విష్ణుపత్ని సమస్తుభ్యంపాదస్పర్శం క్షమస్వమే అంటూ వేడుకొంటారు.

వివేకానంద స్వామి తన పర్యటనలో భోగభూములైన విదేశాలలో హిందూ విజయ దుందుభులు మ్రోగించి తిరిగి భారతదేశానికి ప్రయాణమైనప్పుడు ఈ భూమి యొక్క ప్రతి కణకణము నాకు ఒక తీర్థక్షేత్రమని అన్న మాటలను మరియు తనను గొప్పగాస్వాగతించేందుకు నిలిచియున్న రాజులను, వేలాది ప్రజలను కాదని, ఈ గడ్డపై కాలుమోపగానే ఇక్కడి మట్టితో స్నానం చేసి,తనను తాను పునీతుని చేసుకొన్న ఘటనను మనమందరం ప్రతిక్షణము గుర్తించుకొని, ఈ తల్లిని పూజిస్తూ, కాపాడుకొంటూమన జీవితాలను ధన్యం చేసుకొందాం.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments