అశోక చక్ర నాజీర్ అహ్మద్ వని - Ashoka Chakra Nazir Ahmad Vani

0

ఒక ఉగ్రవాది భారత సైన్యంలో స్థానం సంపాదించాడు. భారతదేశం కోసం ప్రాణాలను సైతం అర్పించాడు. అతడికి అశోక చక్ర పురస్కారం లభించింది. అతడి పేరు నాజిర్ అహ్మద్ వనీ. అతడు 2004కు ముందు వరకూ ఉగ్రవాదిగా ఉన్నాడు. కొందరి తప్పుడు మాటలు విని టెర్రరిస్టుగా మారిపోయిన నాజిర్ అహ్మద్ వనీ అప్పట్లో భారతదేశాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. తాను చేస్తోంది తప్పని అనుకున్నాడు. భారతమాత గొప్పతనాన్ని తెలుసుకున్నాడు.
2004 లో భారత ఆర్మీకి లొంగిపోయి చేసిన తప్పును సరిదిద్దుకోవాలని భావించాడు. కౌంటర్- ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ లో భాగమయ్యాడు. అతనికి  ఆర్మీ 162వ బెటాలియన్ లో స్థానం కల్పించారు. కుల్గాంకు చెందిన వనీ, సైనికుడిగా రెండు సార్లు సేనా మెడల్ పురస్కారాన్ని అందుకున్నాడు.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

లాన్స్ నాయక్ హోదాలో పనిచేస్తూ, ఉగ్రవాదులను ఏరి పారేయడంలో తన వంతు పాత్రను పోషించాడు. 2018 నవంబర్ 23న టెర్రరిస్టులను పట్టుకోడానికి వెళ్లిన నాజిర్ అహ్మద్ వనీ ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించాడు. ఇద్దరు ఉగ్రవాదులను మట్టు బెట్టేందుకు వెళ్లి, వారి నుంచి తన సహచరులను రక్షించే క్రమంలో తన ప్రాణాలను వదిలాడు. అతని సేవలకు గుర్తుగా, సైనికులకు ఇచ్చే అవార్డుల్లో ప్రతిష్ఠాత్మకమైన అశోక చక్రను కేంద్రం ప్రకటించింది. 26న జరిగే రిపబ్లిక్ దినోత్సవ వేడుకల్లో ఆయన కుటుంబీకులకు అవార్డును అందించనున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top