పద్మ శ్రీ నానమ్మాళ్ - v nanammal life

0

వి. నానమ్మాళ్ 98ఏళ్ళ వయసు వచ్చినా ఇంతవరకు ఒక్కసారైనా ఆసుపత్రి ముఖం చూడకపోవటాన్ని తీవ్ర
అనారోగ్య సమస్యల బారిన పడకపోవటాన్ని ఊహించగలరా? పవిత్రమైన శక్తిపూర్ణమైన జీవితాన్ని పొందటానికై ప్రజలకు తోడ్పడటమే ధ్యేయంగా పెట్టుకున్న 99 ఏళ్ళ నానామ్మాళ్ ఘనత అదే.
ఈనాటికీ అమె తెల్లవారుజామున 5 గం||లకే నిద్రలేచి శరీరాన్ని పూర్తిగా వంచే ఆసనాలతో యోగా చేస్తుంటుంది. ఆమె తన దేహాన్ని తన భుజాలపై మోసే సర్వాంగాసన భంగిమతో నిశ్చలంగా నిలుపగలదు. యోగమూలాలు భారతదేశంలో లోతుగా పాతుకొని ఉన్నాయి. ఆరోగ్యకరమైన జీవితంకోసం యోగ అందించే అద్భుతమైన ప్రయోజనాలకు ఆమెను సజీవ ఉదాహరణగా చెప్పవచ్చు.
ఇప్పటిదాకా ఆమె 10 లక్షలమందికి పైగా వ్యక్తులకు యోగలో శిక్షణనిచ్చింది, వారిలో 10 వేల మంది వివిధ ప్రదేశాలలో యోగ శిక్షకులుగా ఉన్నారు, అంతర్జాతీయ యోగా ఛాంపియన్షిప్ పోటీలలో ఆమె శిష్యులు ఎన్నో స్వర్ణపతకాలు చేజిక్కించుకున్నారు. ఇది మానవజాతికి ఆమె అందించిన అద్భుతమైన కానుక కాదా? ఆరోగ్యకరమైన, రోగముక్తమైన జీవనాన్ని గడిపేందుకు ఇదొక గొప్పవిధానం కాదా? 99 ఏళ్ళ వయస్సులోనూ అమె కోయంబత్తూరులోని తన యోగా కేంద్రంలో రోజూ 100 మందికి పైగా శిక్షణార్థులకు శిక్షణ జరుపుతున్నది.
యోగా, ఆరోగ్య ప్రదాయకమైన ఆహారం అనేవి రెండు ఆమె చైతన్యమయమైన జీవితానికి దోహదకారులుగా ఉన్నాయి. ఆమే కాఫీ, టీల జోలికిపోదు. సహజపానీయాలనే తీసుకుంటుంది. ఆమెలాగా సరళమైన, తేజోవంతమైన జీవితం పొందాలంటే మనం యోగా మరియు ఔషధమయమైన స్వచ్ఛమైన ఆహార ప్రాముఖ్యతను అర్ధం చేసుకోవలసిందే. ఆమె చేసిన సేవలకు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం నానమ్మళ్ కు 2018 లో పద్మశ్రీ అవార్డుని ప్రదానం చేసింది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top