రాజేంద్రనాథ్ లాహిడీ కారోరీ కుట్ర కేసులో రామ్ ప్రసాద్ బిస్మిల్, రాజేంద్రనాథ్ లాహిడీ. రోశన్ సింగ్, అశ్ఫాక్ ఉల్లా ఖా...
రాజేంద్రనాథ్ లాహిడీ
కారోరీ కుట్ర కేసులో రామ్ ప్రసాద్ బిస్మిల్, రాజేంద్రనాథ్ లాహిడీ. రోశన్ సింగ్, అశ్ఫాక్ ఉల్లా ఖాన్ వీరు నలుగురికి మరణ దండన విధించబడింది.
వీరిలో రాజేంద్రనాథ్ లాహిడీ ఎమ్.ఏ. విద్యార్థి. బనారస్ హిందూ విశ్వ విద్యాలయంలో చదువుకునే వాడు. ఆయన 1925లో పట్టుబడ్డాడు. ఆయన తరఫు నుండి అప్పీలు, క్షమాభిక్ష పత్రం (మెర్సీ పిటిషన్) పంపడం జరిగింది. కానీ, అవన్నీ తిరస్కరింపబడ్డాయి.
రాజేంద్రనాథ్ లాహిడీ తన అన్నకు రాసిన ఒక ఉత్తరంలో ఇలా రాశాడు:
ప్రియమైన అన్నకు,
నా క్షమాభిక్ష వినతి పత్రాన్ని వైస్రాయ్ తిరస్కరించాడని సూపరింటెండెంట్ ఈ రోజు చెప్పాడు. జైలు నిబంధనల ప్రకారం నన్ను ఒక వారం రోజుల్లో ఉరి తీస్తారు. నీవు నా కోసం బాధ పడనవసరం లేదు. ఎందుకంటే నేను నా పాత శరీరం వదలి పెట్టి కొత్త జన్మనెత్తబోతున్నాను. నన్ను కలుసుకోవడానికి మీరెవరూ ఇక్కడికి రానవసరం లేదు. ఎందుచేతనంటే కొద్ది రోజుల క్రిందటే నన్ను కలుసుకుని వెళ్లారు కాబట్టి. నేను లక్నోలో ఉన్నప్పుడు అక్క రెండు సార్లు వచ్చి నన్ను కలుసుకుంది. అందరికి నా నమస్కారాలు తెలపండి. పిల్లలకు ప్రేమాశీస్సులు.
మీ ప్రయమైన తమ్ముడు
రాజేంద్రనాథ్ లాహిరి
రాజేంద్రనాథ్ లాహిరి

No comments
Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..