అమరవీరుల మనోవ్యధ రామ్ ప్రసాద్ బిస్మిల్ సుధీర్గ కవిత - ram prasad birmil poem

megaminds
0
ఇదిగో హృదయం, ఇదిగో మనసని అర్పిస్తాం
మా సర్వస్వాన్నీ తల్లికి కాన్కగా
ఇల్లు గుల్లైన మాకీక ఇల్లు ఎక్కడో చూపుడీ మరి సంతసింపుడు దేశ ప్రజలారా! ప్రస్థానం మేము సాగిస్తామిక పోయి ఏదో నిర్జనాన్నే మాదిగా చేసేసుకుంటాం
మేము సైతం ఇంటిపట్టున హాయిగా ఉండగలిగేవారమే, మమ్ముకూడా తల్లిదండ్రులు ఇడుములోడ్చియే పెంచిరీ చెంపపై జారి ఒడిలో కన్నీళ్ళే పడినప్పుడు
వాటినే మీ పిల్లలని భావించి మీ మనసులు
శాంత పరచుకొండని చెప్పవైనా లేకపోతిమి వీడ్కోలు వేళ
నవ యువకులారా! మనసు చెదరిన వేళనైనా
కాక ఏదో అదనునైనా గుర్తు తెచ్చుకోండి మమ్ముల
మీ శరీరాంలు తునాతునకలై చెదిరిపోయినా
తల్లి హృదయం పగిలి నూరు ముక్కలై సమసినా
మీ ధీర ప్రశాంత ముఖ ముద్రను చెదరనీకండిరవంతయినా
చింత లేదు మా గురించి మాకు, కానీ బాధపడతాం
తల్లి భరతమాత విపత్తులు తలచుకున్నప్పుడల్లా
దేశ స్వాతంత్య ఘడియలు ఎప్పుడో చూచేది మేమిక
జాతి దుస్థితి కలత పెడుతుంది మమ్ముల మాటిమాటికి మా మనుగడలను మట్టిలో కలిపేందుకే ఇకఎదురుచూస్తాం
నొప్పి తెలిసిన వారినడుగు - ఆపదల తీపేమిటో, ప్రాణాలర్పించే వారినడుగు - ఆత్మాహుతి వలన సుఖమేమిటో
నిరీక్షించే కళ్ళ నడుగు - దర్శనాభిలాష ఎట్టిదో
కాలి నశించే మిడతనడుగు - తాపమంటే ఏమిటో


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top