Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

పశ్చిమ బెంగాల్ మనతో ఉండటానికి కారకులెవరు?

భారత దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడంతో పాటు అఖండ భారతావనిని చీల్చి పాకిస్తాన్ ఏర్పాటు చేశారు బ్రిటిష్ వారు.. కానీ ఆ పాకిస్తాన్ ఇంకా పుట్టక ముం...

భారత దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడంతో పాటు అఖండ భారతావనిని చీల్చి పాకిస్తాన్ ఏర్పాటు చేశారు బ్రిటిష్ వారు.. కానీ ఆ పాకిస్తాన్ ఇంకా పుట్టక ముందే దాన్ని చీల్చేందుకు కారణమయ్యాడో నాయకుడు.. బెంగాల్ ఏకమొత్తంగా తూర్పు పాకిస్తాన్ లో కలవకుండా ఉందంటే ఆ మహనీయుని పుణ్యమే.. ఈనాడు పశ్చిమ బెంగాల్ మన దేశంలో కొనసాగడానికి కారణం డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ..
నా శరీరాన్ని ముక్కలు చేయండి.. కానీ దేశ విభజన అంగీకరించబోనని మహాత్మా గాంధీ చెప్పేవారు. యుద్దమైనా చేస్తాం కానీ దేశాన్ని ముక్కలు కానివ్వయబోమని సర్దార్ పటేల్ ధృడంగా పలికేవారు. కానీ జవహర్లాల్ నెహ్రూ పదవీకాంక్ష రాజకీయాల కారణంగా కాంగ్రెస్ పార్టీ దేశ విభజన విషయంలో రాజీపడింది. పాకిస్తాన్ విషయంలో ముస్లింలీగ్ నాయకుడు మహ్మద్ అలీ జిన్నాతో రాజీపడొద్దని హిందూ మహాసభ నాయకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కాంగ్రెస్ నాయకుల చెవికి ఎక్కలేదు.. చివరకు అంతా ఉహించినట్లే దేశ విభజన అనివార్యంగా మారింది.
1946లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ రాష్ట్రంలో ముస్లిం లీగ్ అధికారంలోకి వచ్చింది. కలకత్తా నగరం సహా బెంగాల్ మొత్తాన్ని పాకిస్తాన్ లో కలపాలంటూ ఆ పార్టీ బ్రిటిస్ వారిపై వత్తిడి తెచ్చింది. ప్రత్యక్ష చర్య పేరుతో బెంగాల్ అంతటా పెద్ద ఎత్తున మారణకాండ సాగించింది. ఒక్క కలకత్తా నగరంలోనే 10 వేల మంది హిందువులను ఊచకోత కోశారు. కలకత్తా వీధులు శవాలతో నిండిపోయాయి. మహిళలపై అత్యాచారాలు, లూఠీలు, గృహ దహనాలు పెద్ద ఎత్తున సాగాయి.. 
బెంగాల్ పై ముస్లింలకు ఎంత హక్కు ఉందో హిందువులకూ అంతే హక్కు ఉంది. ఈ రాష్ట్రం మొత్తాన్ని ఏకపక్షంగా పాకిస్తాన్ లో కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు శ్యామప్రసాద్ ముఖర్జీ.. ఇలా చేస్తే భవిష్యత్తులో ఆ దేశ భవిష్యత్తు ప్రశ్నార్ధకం అవుతుందని హెచ్చరించారు ముఖర్జీ. పెద్ద సంఖ్యలో ఉన్న హిందువులు ఉద్యమించి తూర్పు పాకిస్తాన్ (బెంగాల్)ను తిరిగి భారత దేశంలో కలుపుతారని స్పష్టం చేశారు. అసలు పాకిస్తాన్ లో బెంగాల్ అనుగడ అసాధ్యమని అని చెప్పేవారు ముఖర్జీ.. బెంగాల్ లో హిందూ ఆధిక్యత ఉన్న ప్రాంతాలను భారత దేశంలోనే కొనసాగించాలని వత్తిడి తెస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని లేవదీశారు. హిందూ మహాసభ, బెంగాల్ హిందూ సభ మద్దతుతో శ్యామప్రసాద్ ముఖర్జీ సాగించిన ఈ తిరుగుబాటును చూసి ముస్లింలీగ్, కాంగ్రెస్ పార్టీలతో పాటు బ్రిటిష్ వరు భయపడిపోయారు. తాను విభజన వాది అంటూ చేసిన ఆరోపణలను సమర్ధవంతంగా తిప్పి కొట్టారు ముఖర్జీ..
Image may contain: 1 person, text

నిజానికి బెంగాల్ విభజన అనే ఆలోచననే సాధారణ బెంగాలీలు భరించలేరు. 1905లో లార్డ్ కర్జన్ ఈ ప్రయత్నం చేసి. వందేమాతరం ఉద్యమంతో చేతులు కాల్చుకున్నాడు. కానీ పాకిస్తాన్ ఏర్పాటవుతున్న నేపథ్యంలో బెంగాల్ విభజన అనివార్యంగా మారింది. బెంగాల్ లోని హిందూ ఆధిక్య ప్రాంతాలను ఇండియన్ యూనియన్ లోనే కొనసాగించాలనే డిమాండ్ తో ముఖర్జీ చేపట్టిన ఉద్యమం బ్రిటిష్ ప్రభుత్వంపై వత్తిడి పెరిగింది. పట్టు విడుపులు లేకపోతే పాకిస్తాన్ కలకు ఎసరు వస్తుందని భావించిన ముస్లింలీగ్ బెంగాల్ విభజనకు అంగీకరించక తప్పలేదు. కేవలం ముస్లిం ఆధిక్య ప్రాంతాలు మాత్రమే పాకిస్తాన్ (తూర్పు) పరిధిలోకి వెళ్లాయి. ముఖర్జీ చేపట్టిన ఉద్యమ ప్రభావంతో అటు పంజాబ్ ను కూడా ఏక మొత్తంగా పాకిస్తాన్ లో కలపలేదు.. సిక్కు, హిందూ ఆధిక్యత ఉన్న తూర్పు పంజాబ్ ను భారత దేశంలోనే కొనసాగించాలని నిర్ణయించారు. 
మొత్తనికి ఇలా బ్రిటిష్ వారు ఇండియాను చీల్చి పాకిస్తాన్ ఏర్పాటు చేస్తే, పుట్టక ముందు పాకిస్తాన్ ను చీల్చేశారు ముఖర్జీ.. స్వతంత్ర భారత తొలి కేంద్ర క్యాబినెట్ లో శ్యామప్రసాద్ ముఖర్జీ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నెహ్రూతో ముఖర్జీ అనేవారు.. ‘ మీరు భారత దేశాన్ని ముక్కలు చేశారు. నేను పాకిస్తాన్ ను ముక్కలు చేశాను..’ అని..
శ్యామ ప్రసాద్ ముఖర్జీ అన్నట్లే జరిగింది.. తదనంతర కాలంలో తూర్పు పాకిస్తాన్ (తూర్పు బెంగాల్)పై పశ్చిమ పాకిస్తాన్ నాయకుల పెత్తనం భరించరానిదిగా మారింది. బెంగాల్ భాషా సంస్కృతులు కాలరాయడంతో పాటు ఇక్కడి నాయకులను అణచివేయడం మొదలైంది. చివరకు తూర్పు బెంగాల భారత దేశ సహకారంతో పాకిస్తాన్ తో యుద్దం చేసి ‘బంగ్లాదేశ్’ గా ఆవిర్భవించింది..- క్రాంతి దేవ్ మిత్ర

No comments