Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

రాజుగారి గుండె జారిపోయింది ఎందుకో తెలుసా?

కోట శత్రుదుర్భేద్యమైనదే. కానీ లోపల రాజు, మంత్రి, ఒకరిద్దరు సైనికులు మాత్రమే ఉన్నారు. కోట చుట్టూ వేలాదిమంది శత్రుసైనికులు... రాజుగారి గుండె ...

కోట శత్రుదుర్భేద్యమైనదే.
కానీ లోపల రాజు, మంత్రి, ఒకరిద్దరు సైనికులు మాత్రమే ఉన్నారు.
కోట చుట్టూ వేలాదిమంది శత్రుసైనికులు...
రాజుగారి గుండె జారిపోయింది.



"మనం ఇక ఏం చేయగలం... ఇక మన చావు ఖాయం" అని వలవల ఏడ్చాడు.
మంత్రి మాత్రం ధైర్యం కోల్పోలేదు.
"మహారాజా... మన కోటలోని అత్యంత ఇరుకైన మార్గాన్ని తెరుద్దాం. అందులోనుంచి ఒక సమయంలో ఒకే శత్రువు దూరి రాగలడు. వచ్చినవాడిని వచ్చినట్టే కత్తికొక కండగా చేసేద్దాం."
రాజుగారు నమ్మకం లేనట్టు మంత్రి వైపు చూశాడు.
"అందరినీ ఒక్కసారే ఎదుర్కోవడం కష్టం మహారాజా! ఒక్కొక్కడూ వచ్చేలా చేయగలిగితే ఎంతమందినైనా చంపేయగలం." అన్నాడు మంత్రి.

No comments