Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

వైదిక శాస్త్రాల ఆధారంగా విమానాల రూపకల్పన - Megamindsindia

భారతీయ వైదిక శాస్త్రాల మీదున్న నమ్మకంతోనే.– అంతరిక్ష రంగంలో కొత్త ఒరవడులు సృష్టిస్తున్న కావ్య వైదిక శాస్త్రాల ఆధారంగా విమానాల రూపకల్ప...

భారతీయ వైదిక శాస్త్రాల మీదున్న నమ్మకంతోనే.– అంతరిక్ష రంగంలో కొత్త ఒరవడులు సృష్టిస్తున్న కావ్య
వైదిక శాస్త్రాల ఆధారంగా విమానాల రూపకల్పన
– ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలందుకుంటున్న తెలుగు మహిళ
నేటి తరం యువత పురాణాలు, ఇతిహాసాలను కల్పితాలుగా భావిస్తోంది. వాటిని అద్భుతమైన ఊహలుగా పేర్కొంటోంది. యువతలో ఆధ్యాత్మిక చింత కొరవడుతున్న నేటి సమాజంలో పురాతన భారతీయ శాస్త్రాలను ఆధారం చేసుకొని విమానాలను రూపొందించేందుకు ప్రయత్నిస్తోంది ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన కావ్య వడ్డాది.
భారతీయ వైమానిక శాస్త్రాన్ని ఆధారం చేసుకొని కావ్య తన పరిశోధనలను కొనసాగిస్తోంది. నేటి సాంకేతిక పరిజ్ఞానం కారణంగా పర్యావరణం దెబ్బతింటోందని, భూ ఉపరితలం చెత్తతో నిండిపోతోందని, అలాంటి వాటిని నిర్మూలించేం దుకు భారతీయ విమాన శాస్త్రం ఉపయోగపడు తుందని ఆమె ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతోంది.
వైమానిక రంగంలో తన పరిశోధనలతో భారతీయ శాస్త్ర వైశిష్ట్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతోంది కావ్య వడ్డాది. సైన్స్‌తో భారతీయ శాస్త్రాలను పోల్చడం అవమానంగా భావించే ఆధునిక శాస్త్రవేత్తల నోరు వెళ్లబెట్టేలా చేస్తోంది. ఋషులు భారతీయుల కోసం రూపొందించిన జ్ఞాన సంపద గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు కషి చేస్తోంది. తనకు ఇష్టమైన అంతరిక్ష రంగంలో కొత్త ఒరవడులను సష్టించేందుకు ఉల్లాసంగా ముందుకు వెళ్తోంది.
శ్రీకాకుళం జిల్లాలో నవంబరు 21, 1992లో కావ్య ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది. కావ్య తాతయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి. వైద్యుడు, ఉపాధ్యాయుడు, గాయకుడు, నాటక రంగ కళాకారుడు, జ్యోతిష్కుడు కూడా. తాతయ్య వద్ద జ్యోతిష్య శాస్త్ర విషయాలను తెలుసుకుంటూ ఆమె పెరిగింది. రామాయణంలో పుష్పక విమానం గురించి విని ఆశ్చర్యపోయింది. అంతేకాకుండా పురాణేతిహాసాల్లోని అంశాలను తెలుసుకుంటూ వాటి పట్ల ఆసక్తిని పెంచుకుంది. ఎప్పటికైనా అంతరిక్షం లోకి అడుగుపెట్టాలని కలలు కన్నది. తన ఆసక్తికి అనుగుణమైన అంశాల పట్ల అవగాహన పెంచు కుంటూ వచ్చింది. ఆ ఆసక్తే ఇంజనీరింగ్‌లో ఏరోనాటికల్‌ స్పేస్‌ సబ్జెక్టును ఎంచుకునేలా చేసింది.
2014లో కావ్య బి.టెక్‌ పూర్తి చేసింది. వైదిక విమానాల పట్ల ఆమెకున్న ఆసక్తిని గమనించిన కళాశాల అధ్యాపకులు కావ్యను ప్రోత్సహించారు. అయితే ఆధునిక వేదికలపై వైదికమైన అంశాలకు చోటు లేదని కావ్యకు ముందే తెలుసు. అయినప్పటికీ తన ఆసక్తిని, పరిశోధనా అంశాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. ఎలాగైనా భారతీయ వైదిక శాస్త్రాల ఆధారంగా విమానాలను రూపొందించాలని ధడ నిశ్చయంతో ముందడుగు వేసింది. తన లక్ష్యాల వైపు ప్రయాణం మొదలుపెట్టింది.
అంతర్జాతీయ వేదికపై జరిగిన ఓ సమావేశంలో ‘రుక్మా విమానాలపై పరిశోధన’ పేరుతో ఓ నివేదికను కావ్య ప్రదర్శించింది. అందుకు భారతీయ విమాన శాస్త్ర నిపుణులు శివకర్‌ బాపూజీ తల్పడే నుంచి స్ఫూర్తి పొందింది. అలా తన పరిశోధనల ద్వారా చిన్న, పెద్ద తరహా విమాన నమూనాలను తయారు చేయడంలో విజయం సాధించింది. అదే తన మొదటి విజయం. అనంతరం విమాన శాస్త్రం ఆంగ్ల అనువాదాన్ని చదివింది. అందులో పొందుపరచిన అంశాలను ఆమె పరిశీలించింది. అవి కేవలం ఏ ఒక్క గ్రంథానికో పరిమితమైన అంశాలు కాదని కావ్య గుర్తించింది. వాటిని ఎలాగైనా వెలికి తీయాలని సంకల్పించింది. ‘రివర్స్‌ ఇంజనీరింగ్‌’ అనే కాన్సెప్ట్‌తో తొలి అడుగు వేసింది. భారతీయ శాస్త్రాలు, పురాణేతిహాసాల్లో విమానాల గురించి ఉన్న అంశాల గురించి క్షుణ్ణంగా పరిశోధించడం ప్రారంభించింది. విమాన శాస్త్రాలతో పాటు రోదసి సాంకేతికతకు సంబంధించిన ఎన్నో అంశాలు భారత ఆక్రమణ దారుల దాడుల్లో కాలగర్భంలో కలిసిపోయినట్లు ఆమె అభిప్రాయ పడుతోంది. అయినప్పటికీ వాటిని వెలికితీసేందుకు మార్గాలను అన్వేషిస్తూ ముందుకు సాగుతోంది కావ్య.
తన పరిశోధనల్లో భాగంగా తల్పడే రూపొందిం చిన విమానాల నమూనాలకు ఆధారాలను అన్వేషించడం మొదలుపెట్టింది. ఆ ఋజువులను బయటపెట్టేందుకు కషి చేస్తున్న వ్యక్తుల గురించి తెలుసుకొని వారిని కలిసింది. వారి వద్ద నుంచి సమాచారాన్ని సేకరించింది. తనకు అందిన వివరాల్లో బ్రిటీషర్ల ద్వారా రైట్‌ సోదరులకు తల్పడే విమాన నమూనాలు లభించినట్లు కావ్య తెలుసుకుంది. ఆంగ్లేయులు నమూనాలలో చిన్నపాటి మార్పులు, చేర్పులు చేసి నేటి విమానాలను రూపొందించినట్లు కావ్య చెబుతోంది. మనదేశంలోని పురాతన శాస్త్రాలన్ని విదేశీ గ్రంథాలయాలకు చేరాయని, నేడు మనం వాడుతున్న సాంకేతిక పరిజ్ఞానం గురించి వైదిక శాస్త్రాల్లో పొందుపరిచారని కావ్య స్పష్టం చేస్తోంది. అయితే వాటిని అర్థం చేసుకునే సామర్థ్యం ప్రస్తుత తరానికి చాలా తక్కువని ఆమె అభిప్రాయం వ్యక్తంచేస్తోంది.
విమాన శాస్త్రాన్ని అవపోసన పట్టిన కావ్య అందులోని సమాచారం సహకారంతో 3డి మోడలింగ్‌ సాఫ్ట్‌వేర్‌లో నమూనాలను తయారు చేయడంలో విజయం సాధించింది. అనంతరం వైదిక శాస్త్రాల ఆధారంగా కంప్యూటేషనల్‌ ఫ్లూయిడ్స్‌ డైనమిక్స్‌ను రూపొందించింది. విమానాల సామర్థ్యాన్ని, ఉష్ణ నిరోధకతను తను రూపొందించిన విధానంలో విశ్లేషించడంలో సఫలత పొందింది. తన పరిశోధనల ద్వారా వైదిక విమానాలు అత్యంత అధునాతనమైనవిగా కావ్య నిరూపించింది. ఆధునిక భారతీయ శాస్త్రవేత్తలు, ఆచార్యులు, ప్రాచీన, వైమానిక శాస్త్రాల నుంచి రూపొందించిన పరికరాల ఆధారంగా విమానశాస్త్రంలో పేర్కొన్న వాటిని పునర్నిర్మించవచ్చని కావ్య నిశ్చయించుకుని తన పరిశోధనలను మరింత వేగవంతం చేసింది.
నేటి ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం పర్యావరణాన్ని దెబ్బతీస్తోందని కావ్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నివారణకు వైదిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో సహకరిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రస్తుత సాంకేతికత భూమిని, భూ ఉపరితల పర్యావరణాన్ని చెత్తకుండీలా మార్చేస్తోందని కావ్య భావిస్తోంది. అదే వైదిక శాస్త్ర ప్రమాణాలతో రూపొందే విమానాలు, పరికరాలు పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నివారణకు దోహదం చేస్తాయని తన వాదనను ఆధారాలతో బలపరచుకుంటోంది. పరిష్కారం మన దగ్గరే ఉన్నప్పుడు ఊరంతా వెతకడం ఎందుకని కావ్య ప్రశ్నిస్తోంది. వైదిక గ్రంథాల్లోని జ్ఞానాన్ని లోక కళ్యాణానికి వినియోగించాలని ఆమె తాపత్రయ పడుతోంది.
సంస్కత శ్లోకాల్లోని భావాలను ఏరోనాటికల్‌ సాంకేతికతకు అన్వయించుకుంటూ కావ్య పరిశోధనలు సాగుతున్నాయి. వాటిలో చాలా వరకు తానూ అన్వయించుకొని అవగాహన పొందింది. దేవ భాష అయిన సంస్కతంలో ఒకే పదానికి నానా అర్థాలుంటాయి. వాటిని మనం అర్థం చేసుకోగలిగి నప్పుడు వాటిల్లో దాగి ఉన్న నిగూఢ రహస్యాలను ఛేదింగలమని కావ్య చెబుతోంది. ప్రాచీన కావ్యాలలో విమాన చోదకుల గురించి, వాటి తయారీ గురించి విస్తారమైన అంశాలున్నాయని కావ్య పరిశోధనల్లో తేలింది. వాటిలోని రహస్యాలను ఛేదించి వాటి ఫలాలను దేశ అభివద్ధికి అందించేందుకు పట్టు వదలని విక్రమార్కుడిలా ఆమె పనిచేస్తోంది. ఇప్పటికే ఎన్నో విజయాలను సాధించి విమర్శకులు ముక్కున వేలేసుకునేలా చేస్తోంది ఈ తెలుగు బిడ్డ.
Image result for kavya vaddadi
ఇప్పటికే పురాతన గ్రంథాల్లోని శ్లోకాల అన్వయం ద్వారా విమానాల 3డి నమూనాలను రూపొందించింది. అంతేకాకుండా డిఆర్‌డిఒ, నాసా మాజీ శాస్త్రవేత్తల సహకారం కూడా కావ్యకు లభిస్తోంది. తను అనువదించుకున్న శ్లోకాల ద్వారా వైదిక కాలంలోని విమానాల తయారీ, గగనతల రక్షణ వ్యవస్థ, యూఎఫ్‌ఒలు, గ్రహాంతరవాసులు, ఏరోడైనమిక్స్‌, ప్రోపల్షన్‌, వాయుగతిక శాస్త్రం, యాంటీగ్రావిటీ టెక్నాలజీ వంటి అంశాలను తెలుసుకుంది. వాటి ఆధారంగా ‘రివర్స్‌ ఇంజనీరింగ్‌ వేదిక్‌ విమానాస్‌’ అనే పుస్తకాన్ని రచించింది. అందులో తన పరిశోధనల్లో శోధించి, సాధించిన అంశాలను లోతుగా వివరించింది కావ్య.
తన పరిశోధనల ద్వారా ‘మార్వలెస్‌ రికార్డ్స్‌ బుక్‌ ఆఫ్‌ ఇండియా’ లో కావ్య చోటు దక్కించుకుంది. ‘ఏరో నాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా 2015’ లో నిర్వహించిన సదస్సులో ‘మినీ రుక్మా విమాన నమూనా ప్రదర్శన’, వేవ్స్‌ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్పిరిచువలిటీ ఇన్‌ సైన్స్‌’ సదస్సులో ‘స్పిరుచువల్‌ కాయిల్‌-నికోలా టెస్లా అండ్‌ విమానా’ వంటి ప్రాజెక్టులతో మంచి గుర్తింపును పొందింది. అంతేకాకుండా మరికొన్ని ప్రాజెక్టులతో భారతీయ ప్రాచీన శాస్త్రాల సత్తాను చాటి చెప్పింది. ప్రస్తుతం ‘స్వస్తిక్‌ టీమ్‌’ అనే బందంతో కావ్య పనిచేస్తోంది. ఇందుకు ఎనిగ్మా ఎడిజియోని అనే సంస్థ సహకారం అందజేస్తోంది. వైదిక శాస్త్రాల ఆధారంగా శాస్త్ర సాంకేతికతలో నూతన అధ్యాయనాన్ని సష్టించడమే ఈ బందం లక్ష్యం. ఇప్పటికే బంద సభ్యలు సమన్వయ, సహకారాలతో కావ్య ఎన్నో పురాతన అంతరిక్ష సాంకేతికతపై పరిశోధన పత్రాలను అంతర్జాతీయ వేదికలపై సమర్పించింది. మరిన్ని పరిశోధన పత్రాలను రూపొందిస్తోంది.
ప్రాచీన విమాన నమూనాల 3డి మోడలింగ్‌, సిఎఫ్‌డి విశ్లేషణ, వైదిక విమానాల నిర్మాణాత్మక వివరణ, వివిధ ధాతువుల ప్రయోగం ద్వారా ఉష్ణ మార్పులను వివరించడం, విమానాల 3డి ప్రింటింగ్‌ వంటి అంశాలలో కావ్య విజయాలను సాధించింది. భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించి ప్రపంచం ముందుంచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమెలో భారతీయ వైదిక శాస్త్రాల పట్ల ఉన్న నమ్మకం, గౌరవం అలాంటిది.
భవిష్యత్తులో మిని రుక్మా, త్రిపుర, సుందర విమానాలను, యాంటీ గ్రావిటీ ప్రొపల్షన్‌ వ్యవస్థను, ప్లాస్మా కవచాన్ని, ఎలక్ట్రో మాగ్నటిక్‌ కవచాలు, శక్తి ఉత్పాదకాలు, వోర్టెక్స్‌ జనరేటర్లు, గైరో స్కోప్లను వైదిక శాస్త్రం ఆధారంగా తయారు చేసేందుకు పరిశోధన లను వేగవంతం చేసిన కావ్య భారతీయ శాస్త్ర పరిజ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెబుతానని ధీమాగా చెబుతోంది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments