Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

‘పశ్చిమ బెంగాల్’.. భారత దేశ చిత్ర పటంలో ఈ పేరు చూసి నేటి తరం పిల్లలు ‘మరి తూర్పు బెంగాల్ ఎక్కడ?

‘పశ్చిమ బెంగాల్’.. భారత దేశ చిత్ర పటంలో ఈ పేరు చూసి నేటి తరం పిల్లలు ‘మరి తూర్పు బెంగాల్ ఎక్కడ?’ అని వెతుకుతారు.. కానీ అది కనిపించదు.. స్క...

‘పశ్చిమ బెంగాల్’.. భారత దేశ చిత్ర పటంలో ఈ పేరు చూసి నేటి తరం పిల్లలు ‘మరి తూర్పు బెంగాల్ ఎక్కడ?’ అని వెతుకుతారు.. కానీ అది కనిపించదు.. స్కూళ్లలో చరిత్ర మాస్టార్లు కూడా చెప్పరు. ఎందుకంటే వారికీ పూర్తిగా తెలిసుండక పోవచ్చు.. కానీ వాస్తవ చరిత్రను ఎవరూ మరుగు పరచలేరు.. అలా చేస్తే చరిత్ర క్షమించదు.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్రం పేరును మార్చాలని ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కొన్ని చారిత్రిక వాస్తవాలను తెలుసుకుందాం.,
No automatic alt text available.
చరిత్రలోకి వెళ్లితే బెంగాల్(బంగ)ను రాష్ట్రకూటులు, చోళులు, గుప్తులు, పాలులు, సేనులు తదితర ఎందరో పాలకులు ఏలారు. బెంగాలీ భాషా సంస్కృతులు ఈ కాలంలో ఒక రూపాన్ని సంతరించుకున్నాయి. 13వ శతాబ్దంలో మహ్మదీయులు బెంగాల్ ప్రాంతాన్ని దురాక్రమించారు. 15వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ముసుగులో మన దేశానికి వచ్చిన బ్రిటిష్ వారు 18వ శతాబ్దం నాటికి అధికారాన్ని స్థిర పరచుకున్నారు. ఈస్టిండియా కంపెనీ, బ్రిటిష్ పాలనలో బెంగాల్ లోని కలకత్తా భారత దేశ రాజధానిగా ఉండేది.
బెంగాల్ నేల ఎందరో విప్లవకారులకు, స్వాతంత్ర్య సమరయోధులు, సాహితీవేత్తలు, ప్రముఖులకు జన్మనిచ్చింది. చైతన్యప్రభు, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్, బంకించంద్ర చటర్జీ, రవీంద్రనాథ్ ఠాగూరు, అరివింద ఘోష్, బిపిన్ చంద్రపాల్, రాజారామమోహన్ రాయ్, శరత్ చంద్ర చటర్జీ, శ్యామప్రసాద్ ముఖర్జీ, జగదీష్ చంద్రబోస్.. ఇలా ఎందరో ప్రముఖులను మనం చూడవచ్చు..
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాగిన స్వాతంత్ర్యోద్యమ కాలంలో బెంగాల్ ప్రధాన భూమికను పోషించింది. ఈ దేశభక్తి, రాజకీయ చైతన్యాన్ని అణచి వేయడమే లక్ష్యంగా బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ (వైస్రాయ్) లార్డ్ కర్జన్ 1905లో మత ప్రాతిపదికన తొలిసారిగా బెంగాల్ ను విభజించారు. ఈ విభజనను నిరసిస్తూ ఎగిసిపడిన వందేమాతరం ఉద్యమం దేశ వ్యాప్తంగా మార్మోగింది. బ్రిటిష్ సామ్రాజ్యాన్నే కంపింప జేసింది. ఈ కారణం వల్లే బ్రిటిష్ వారు దేశ రాజధానిని కలకత్తా నుంచి న్యూఢిల్లీకి మార్చారు.
1947లో భారత దేశ స్వాతంత్ర్యానికి, దేశ విభజనకు ముడి పెట్టారు బ్రిటిష్ వారు. స్వాతంత్ర్య ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే సత్తువ కోల్పోయిన కాంగ్రెస్ నాయకులు తమ జీవిత చరమాంకంలో అయినా అధికారాన్ని రుచి చూడాలనే ఆశతో దేశ విభజనకు అంగీకరించారు. ఇందులో భాగంగా కొత్తగా ఏర్పడుతున్న పాకిస్తాన్ లో బెంగాల్ మొత్తాన్ని కలిపే కుట్ర జరిగింది. అప్పటికే బెంగాల్ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్య పేరుతో పెద్ద ఎత్తున మారణకాండ సాగించింది. ఒక్క కలకత్తా నగరంలోనే 10 వేల మంది హిందువులను ఊచకోత కోశారు. కలకత్తా వీధులు శవాలతో నిండిపోయాయి. మహిళలపై అత్యాచారాలు, లూఠీలు, గృహ దహనాలు పెద్ద ఎత్తున సాగాయి..
ఈ దశలో బెంగాల్ మొత్తాన్ని ఏకపక్షంగా పాకిస్తాన్ లో కలపడాన్ని బలంగా వ్యతిరేకించారు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ.. బెంగాల్ పై ముస్లింలకు ఎంత హక్కు ఉందో హిందువులకూ అంతే హక్కు ఉందని స్పష్టం చేశారు.. బెంగాల్ ను  ఏకపక్షంగా పాకిస్తాన్ లో కలిపితే భవిష్యత్తులో ఆ దేశ భవిష్యత్తు ప్రశ్నార్ధకం అవుతుందని తేల్చి చెప్పారు ముఖర్జీ. పెద్ద సంఖ్యలో ఉన్న హిందువులు ఉద్యమించి తూర్పు పాకిస్తాన్ (బెంగాల్)ను తిరిగి భారత దేశంలో కలుపుతారని హెచ్చరించారు. పాకిస్తాన్ లో బెంగాల్ అనుగడ అసాధ్యమని అన్నారు.. బెంగాల్ లో హిందూ ఆధిక్యత ఉన్న ప్రాంతాలను భారత దేశంలోనే కొనసాగించాలని వత్తిడి తెస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని లేవదీశారు శ్యామప్రసాద్ ముఖర్జీ. ఈ తిరుగుబాటును చూసి ముస్లింలీగ్, కాంగ్రెస్ పార్టీలతో పాటు బ్రిటిష్ వారు భయపడిపోయారు.
ఈ దశలో పట్టు విడుపులు లేకపోతే పాకిస్తాన్ కలకే ఎసరు వస్తుందని భావించిన ముస్లింలీగ్ చివరకు బెంగాల్ విభజనను అంగీకరించక తప్పలేదు. శ్యామప్రసాద్ ముఖర్జీ ఉద్యమ ఫలితంగా కేవలం ముస్లిం ఆధిక్య ప్రాంతాలు మాత్రమే పాకిస్తాన్ (తూర్పు) పరిధిలోకి వెళ్లాయి. ఈనాడు పశ్చిమ బంగ (వెస్ట్ బెంగాల్) భారత్ లో ఉందంటే కారణం ఆ మహనీయుడే.. బ్రిటిష్ వారు ఇండియాను చీల్చి పాకిస్తాన్ ఏర్పాటు చేస్తే, పుట్టక ముందే పాకిస్తాన్ ను విభజించారు ముఖర్జీ..
చివరకు శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఎంతో ముందు చూపుతో చెప్పిందే జరిగింది.. తూర్పు పాకిస్తాన్ (తూర్పు బెంగాల్)పై పశ్చిమ పాకిస్తాన్ నాయకుల ఆగడాలు, పెత్తనం భరించరానిదిగా మారింది. బెంగాల్ భాషా సంస్కృతులు కాలరాయడంతో పాటు ఇక్కడి నాయకులను అణచివేయడం మొదలైంది. ఫలితంగా తిరుగుబాటు వచ్చింది. చివరకు తూర్పు బెంగాల్ భారత దేశ సహకారంతో పాకిస్తాన్ తో యుద్దం చేసి 1971లో ‘బంగ్లాదేశ్’ గా ఆవిర్భవించింది..
పశ్చిమ బెంగాల్ ఈ రోజు భారత దేశంలో ఉంటే, తూర్పు బెంగాల్ ‘బంగ్లాదేశ్’ పేరిట స్వతంత్ర్య దేశంగా ఎందుకు కొనసాగుతుందనే విషయం  భావి తరానికి తెలియాలి. ‘పశ్చిమ’ అనే పేరులోనే దాని చారిత్రక నేపథ్యం ఉంది. మమతా బెనర్జీ కోరుకున్నట్లుగా రాష్ట్రం పేరు ‘బంగ్లా’గా మార్చడం అర్థ రహితం. వెస్ట్ బెంగాల్ అని ఉంటే అక్షర క్రమంగా వెనుకబడి ఉన్నాం, బంగ్లాగా మర్చితే ముందకు వస్తాం అనే ఆమె వాదన హస్యాస్పదంగా ఉంది. పశ్చిమ బెంగాల్ ను సుదీర్ఘ కాలం పాలించిన కమ్యూనిస్టులు సైతం రాష్ట్రం పేరు మార్చే సాహసం చేయలేదు. కానీ వివాదాలు, గిల్లికజ్జాలను ఇష్టపడే దీదీకి బెంగాలీలతో పాటు దేశ ప్రజల మనోభావాలు ఏ మాత్రం పట్టవు.. కొందరికి అత్యాశగా కనిపించవచ్చు కానీ, భవిష్యత్తులో ‘తూర్పు బెంగాల్’ (బంగ్లాదేశ్) భారత్ లో కలవాల్సిందే..  అప్పటి వరకూ ‘పశ్చిమ’ బెంగాల్ కొనసాగాల్సిందే..

No comments