Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

నమ్మకం....విశ్వాసం

  రెండు ఇరవై అంతస్తుల భవనాలు. పక్కపక్కనే ఉన్నాయి. వాటిని కలుపుతూ ఒక తాడు. ఆ తాడుపై గారడీవాడు అలవోకగా నడిచేస్తున్నాడు. అందరూ చూసి చప్పట్లు...

 రెండు ఇరవై అంతస్తుల భవనాలు. పక్కపక్కనే ఉన్నాయి.
వాటిని కలుపుతూ ఒక తాడు.
ఆ తాడుపై గారడీవాడు అలవోకగా నడిచేస్తున్నాడు.

అందరూ చూసి చప్పట్లు కొట్టేస్తున్నారు. వాడి ధైర్యానికి, సాహసానికి, నైపుణ్యానికి అబ్బురపడిపోతున్నారు.
ఆ గారడి వాడు తాను నడవడమే కాదు. తన తొమ్మిదేళ్ల పాపని కూడా భుజాన ఎక్కించుకున్నాడు. ఆమెతో సహా తాడుపై నడిచాడు.
అందరూ కేరింతలు కొట్టారు.
"నాపై నమ్మకం ఉందా? నేను ఈ తాడుపై నడవగలనన్నది మీరే చూశారు కదా"
ప్రజలందరూ పెద్దపెట్టున అరిచారు. "ఉంది...ఉంది...ఉంది"
"అయితే మీలో ఎవరైనా నా భుజం మీదకి ఎక్కండి. ఆ భవనానికి తాడుమీద తీసుకెళ్తాను"
ప్రజలందరూ ఒక్కసారి చల్లబడిపోయారు.
ఉలుకు లేదు
పలుకు లేదు
నమ్మకం వేరు....విశ్వాసం వేరు.
గారడివాడు తాడుపై పడిపోకుండా నడవగలడు .... ఇది నమ్మకం.
అతని భుజం మీద కూర్చుని, అతనితో పాటు తాడుపై నడవటం ... దీనికి విశ్వాసం కావాలి.
సర్వస్వ సమర్పణ భావం కావాలి.

No comments