Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఇది ఏ మీడియా లోనూ రాదు, ఎందుకంటే..?? - megamindsindia

నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫతలిస్తున్నాయి. బ్యాంకుల నుంచి బకాయిలు తీసుకున్న కంపెనీలు తిరిగి రుణా...

నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫతలిస్తున్నాయి. బ్యాంకుల నుంచి బకాయిలు తీసుకున్న కంపెనీలు తిరిగి రుణాలు చెల్లించేస్తున్నాయి. దీంతో ఇక ఆ బకాయిలు రావని బ్యాంకులు ఆశలు వదిలేసుకున్న రూ. 83 వేల కోట్లు తిరిగి వచ్చి పడ్డాయి. తమ సంస్థలపై చర్యలు తీసుకుంటారని, ఆస్తులను వేలం వేస్తారని భావించిన సుమారు 2,100 కంపెనీలు, గతంలో తాము తీసుకున్న రుణాలను సెటిల్ చేసుకునేందుకు ఆగమేఘాల మీద ప్రయత్నాలు జరిపి, తిరిగి చెల్లింపులు చేస్తున్నాయి. ఇదంతా కొత్తగా తీసుకొచ్చిన ఐబీసీ (ఇన్ సాల్వెన్సీ అండ్ బ్యాక్ రుప్టసీ కోడ్) పుణ్యమేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

కార్పొరేట్ వ్యవహారాల శాఖ వెల్లడించిన తాజా గణాంకాల మేరకు, మొత్తం 2,100 కంపెనీలు తాము కట్టాల్సిన రుణాలను తిరిగి చెల్లించాయి. ఐబీసీ చట్టంలో మార్పుల తరువాత, ఎన్పీఏగా బ్యాంకులు ప్రకటించిన ఆస్తులపై ప్రమోటర్లకు ఎటువంటి హక్కులూ ఉండవన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో 90 రోజుల పాటు రుణ చెల్లింపు ఆగిపోతే, ఆ రుణాన్ని, రుణం పొందేందుకు తనఖా పెట్టిన ఆస్తిని నిరర్థక ఆస్తి కింద ప్రకటించి తదుపరి చర్యలకు ఉపక్రమించవచ్చని కొత్త చట్టం చెబుతోంది.
Banks recover Rs 83,000 from 2,100 companies

ప్రభుత్వం చట్టాన్ని మార్చిన తరువాత ఇస్సార్ కంపెనీని నడుపుతున్న రూయాలు, భూషణ్ గ్రూప్ యజమానులైన సింఘాల్ ఫ్యామిలీ, జేపీ అసోసియేట్స్ ను నిర్వహిస్తున్న గౌర్ కుటుంబం నుంచి ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. అయినా ప్రభుత్వం వెనక్కు తగ్గలేదు. "ప్రభుత్వం సాధించిన నిజమైన విజయం ఏంటంటే, లోన్ డిఫాల్టర్ల మీద ఒత్తిడి పెరిగింది. వారు రుణాలను తిరిగి చెల్లిస్తున్నారు. ఐబీసీ వల్లనే ఇదంతా సాధ్యమైంది" అని ప్రభుత్వాధికారి ఒకరు వెల్లడించారు.


ఇదొక్కటే కాదు, ఈ మధ్యే భూషన్ స్టీల్ ని వేలం వేయడం ద్వారా 36 వేల కోట్లు బ్యాంకు లకు  చేరాయి.  ఇలాంటి వార్త లు ఏ టీవీ, ఏ పేపర్ వాడు చూపించడు. ఇది ఏ మీడియా లోనూ రాదు, ఎందుకంటే..?? మీకు తెలుసుగా..

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments