Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

జీవితమంతా అవినీతే - megamindsindia

బాబుచంద్రబాబు గారు, జీవితమంతా కుట్ర రాజకీయాలేనా. చరిత్రలో మంచిపేరు సంపాదించాలి అన్న ఆలోచన ఎప్పుడూ రాదా? ఎంతసేపు నేను, నా కుటుంబం,న...

బాబుచంద్రబాబు గారు,
Image result for chandrababu naidu

జీవితమంతా కుట్ర రాజకీయాలేనా. చరిత్రలో మంచిపేరు సంపాదించాలి అన్న ఆలోచన ఎప్పుడూ రాదా? ఎంతసేపు నేను, నా కుటుంబం,నా కులం అనే యావేనా? సంక్షోభంలో కూడా సంపాదించాలి అనే స్వార్ధమేనా?
ఎన్టీఆర్ వెన్నుపోటు నుంచి ఇప్పటి వరకు ఏముంది గర్వకారణం మీ చరిత్ర లో? ప్రతి పనిలోనూ దుర్మార్గమే! స్వార్ధమే! మోసమే!
ఆనాడు లక్ష్మీ పార్వతిని బూచిగా చూపెట్టి అధికారం చేజిక్కించుకుని ఎన్టీఆర్ తో నే ఔరంగ జేబ్ అనిపించుకున్నారు. ఈనాడు బీజేపీ ని బూచి గా చూపించి అధికారం నిలబెట్టుకోవాలని విశ్వ విఫలప్రయత్నం చేస్తున్నారు.
ఎన్నో ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం అన్న నోటి తోనే ఏమి ఇవ్వలేదు అని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ఏ రోజు అయినా ఒకే మాట మీద నిలబడ్డారా?
ఈ మతతత్వ బీజేపీ పార్టీ తో ఇక పై ఎప్పుడూ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదు అని మసీదులో చెప్పేరు. నరేంద్రమోదీ హవా చూసి అదే బీజేపీతో అంట కాగేరు.
మోడీ ని జైల్లో పెట్టిస్తా అన్న నోటి తోనే మోడీ కి వంగి వంగి సలాం లు కొట్టేరు.
పోలవరం కేంద్ర ప్రాజెక్ట్ కోసం నీతి ఆయోగ్ ద్వారా కేంద్రాన్ని మేము దగ్గరుండి తొందరం గా కట్టుకుంటాం అని అడిగి మరీ తీసుకున్నారు. అడుగు అడుగునా అవినీతి మయం చేసేరు. 16 వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ను రాత్రి కి రాత్రి 56 వేల కోట్లు పెంచేసిన ఘన కీర్తి మీది. ఎవడబ్బ సొమ్మని దోచేసుకుందామనుకున్నారు?
కేంద్ర పధకాలు అన్ని మీ పేరు తో మార్చి స్వంత డబ్బా కొట్టుకున్నారు. కనీసం ప్రధాని ఫోటో కూడా ఎక్కడా పెట్టకుండా రాష్ట్ర పధకాలు గా పైరసీ ప్రకటనలు ఇచ్చేరు.
హోదాలో ఏముంది ప్యాకేజీ లోనే అంతా ఉంది అన్నారు. తీరా కేంద్ర లెక్కలు అడిగితే 'ఆంధ్రుల ఆత్మ గౌరవం - ఆంధ్ర కు ప్రత్యేక హోదా' అంటూ అధర్మ పోరాటానికి తెర లేపేరు.
ఆ రెండు నాల్కల అధర్మ పోరాట సభలో ప్రధాన మంత్రిని మీ పిచ్చి బామ్మర్ది పచ్చి బూతులు తిడుతుంటే ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు. విలాసవంతమైన మీ అరపూట నిరాహారదీక్ష లో మీరు పట్టు పరుపులపై ఆశీనులు అయి ఉంటే మీ పచ్చ తమ్ముళ్ళు మీ కాళ్ళ మీద పడి మొక్కుతుంటే మీరు ఆంధ్ర సీఎం బాబు గారు కాకుండా ఆంధ్ర డేరా బాబా లాగా దర్శనం ఇచ్చేరు.
అవినీతిలో, ఆడపిల్లల ఎగుమతి లో ఆంధ్రప్రదేశ్ ను మొదటి స్థానంలో నిలబెట్టేరు.
కట్టుబట్టలతో కరకట్ట కు వచ్చేను అని చెప్పి దేశం లోనే అత్యంత ధనిక సీఎం గా పేరు గడించేరు. మీ విలాసల కోసం, ప్రచార ఆర్భాటాల కోసం రాష్ట్ర ఖజానాకు గండి కొట్టేరు.
అమరావతిలో ఆకాశ హార్మ్యాలు నిర్మిస్తాను అని చెప్పి చిరు జల్లుకే చిల్లులు పడే తాత్కాలిక భవనాలు కట్టేరు. ఎమ్మెల్యే క్వార్టర్స్, రాజభవనం, హైకోర్టు దేవతా వస్త్రాలుగా చూపిస్తూ మభ్యపెడుతున్నారు.
అప్పుడు నా ఇటుక నా అమరావతి అని , ఇప్పుడు నా ధాన్యం నా పట్టిసీమ అని, ఎంత సేపు ప్రజలు ను దోచుకోవడం, దాచుకోవడం తప్పించి మీరు ఇచ్చిన 600 పైచిలుకు హామీలలో ఒక్కటంటే ఒక్కటి అమలు చేసేరా?
10 ఏళ్ళు కాల పరిమతి ఉన్నా కేవలం మూడు హామీలు (ప్రత్యేక హోదా, రైల్వే జోన్, ఉక్కు కర్మాగారం) తప్పించి మిగతా అన్ని మొదలు పెట్టిన కేంద్రాన్ని మాత్రం నిందిస్తారు. మీ వైఫల్యం కేంద్రం పై నెట్టివేసి 2019 లో మళ్ళీ నెగ్గటానికి మరో కుట్ర కు తెర లేపుతారు.
రేప్ చేస్తే అదే ఆఖరు రోజు అన్న మీరు ఇప్పుడు ఆగని రేప్ లను ఒక సామాన్య ప్రేక్షకుడులా చూస్తున్నారు. ఆడపడుచులపై మీ పార్టీ నాయకుల అత్యాచారాలపై చర్య తీసుకోవడానికి కూడా మీరు ముందడుగు వెయ్యడం లేదు. తీవ్రవాదానికి మతం లేదు అన్నారు మరి రేప్ కు ఉందా బాబు గారు? మీ పచ్చ తమ్ముళ్ళు అచ్చోసిన ఆంబోతుల్లా ఆడకుతుర్లు మాన ప్రాణాలను రోజూ చింపేస్తుంటే పోస్కో చట్టం ఎక్కడ దాచిపెట్టేరు?
ఢిల్లీ వెళితే  బీజేపీ ప్రభుత్వం మీకు NSG రక్షణ కల్పించింది. మరి అదే Z సెక్యురిటి ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఈ దేశంలో 90 శాతం అధికారం లో ఉన్న బీజేపీ ప్రభుత్వాల కి దశ దిశా నిర్దేశకుడు అమిత్ షా కుటుంబ సమేతంగా పుణ్య క్షేత్ర దర్శనం కు వస్తే మీ పచ్చ తమ్ముళ్ళు తో రాళ్లు వేయించేరు. ఇదేమి ధర్మ పోరాటం బాబు గారు?
2019 లో మైనారిటీ ఓట్ల కోసం గుళ్లు కూల గొట్టేరు, హజ్ హౌస్ లు నిర్మిస్తున్నారు. కానీ ఎంత కాలం ఈ నయ వంచన ఎన్ని సార్లు ఈ కప్పదాట్లు. ఇదేనా మీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ?
మైండ్ గేమ్ ఆడటం లోను ఈవెంట్ మేనేజ్మెంట్ లో మీరు సిద్ధహస్తులు. కానీ కాలం ఖర్మం కలిసి రాక పోతే గజ ఈతగాడు కూడా మురుగు కాల్వలో పడి చనిపోతాడు అనే విషయాన్ని గమనించగలరని మనవి.
120 ఏళ్ల కాంగ్రెస్ ను మట్టుబెట్టి కాంగ్రెస్ ముక్త్ భారత్ ను సాధించి 12000 అడుగుల ఎత్తులో హిమాలయాలలో ముక్తినాధ్ సన్నిధి పూజలు చేసి తిరిగి వచ్చిన అజేయుడు, అమేయశక్తి సంపన్నుడు , దైవంశ శంభూతుడు , ఈ దేశ ప్రధాని శ్రీ నరేంద్రమోదీ తన సేనాని అమిత్ షా పై జరిగిన రాళ్ళ దాడికి , అది తన పై అవమానం గా భావించి అగ్రహోగ్రుడై, అగ్నిహోత్రుడై మీ అవినీతిభరిత సామ్రాజ్యాన్ని దహించి వేస్తుంటే ....
మూడు రోజుల క్రితము మీ పాలన లో బోటు లో 40మంది జలసమాదీ ఐతే మీ పచ్చ మీడియా లో చూపరు కర్నాటక లో జరిగేవి చూపిస్తారు
మరి మీరు మోదట పుష్కర స్నానము చేయాలని 20మందిని బలి తీసుకున్నావు
మీ టీడీపీ గతి తప్పి మతి చెడి కకావికలు అవుతుంటే...
ఒక్కరూ రారు మిమ్ము రక్షింప మీరు ఎంత వేడుకున్న...
ఈ నా పలుకులు సత్యం. మీ అవినీతి, అసాంఘిక సామ్రాజ్య అంతం తధ్యం...అనంత్ ఆదిత్య
 భారత్ మాత కి జై

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments