Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

జాతీయవాద రాజకీయాలకు పట్టం కట్టిన కన్నడ రాష్ట్ర ఓటర్లు - megamindsindia

జాతీయవాద రాజకీయాలకు పట్టం కట్టిన కన్నడ రాష్ట్ర ఓటర్లు   ఈ పలితాలు ప్రధాని శ్రీ నరేంద్ర మోడి గారి నాయకత్వం పై ప్రజలకు ఉన్న విశ్వసనీ...

జాతీయవాద రాజకీయాలకు పట్టం కట్టిన కన్నడ రాష్ట్ర ఓటర్లు 
Image result for bjp

 ఈ పలితాలు ప్రధాని శ్రీ నరేంద్ర మోడి గారి నాయకత్వం పై ప్రజలకు ఉన్న విశ్వసనీయతకు మరో నిదర్శనం కాగా కాంగ్రెస్ నేత శ్రీ రాహుల్ గాంధీ (కలల ప్రధాని ) గారి వైఫల్యానికి మరో ఉదాహరణ .విచ్చిన్న కర విభజన వాద రాజకీయాలను ముక్త కంఠంతో తిరస్కరించిన ప్రజలు కాంగ్రెస్ ,కమ్యూనిష్టులతో  పాటు తెలుగుదేశం లాంటి పార్టీలకు  ఈ ఫలితాల ద్వారా బుద్ధి చెప్పారు. కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఉత్తరాది-దక్షిణాది అని వేర్పాటు వాదాన్ని తెరపైకి తెచ్చారు, కర్ణాటకాకు ప్రత్యేక జెండా ఏర్పాటు చేస్తానని స్వయంగా ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య ప్రకటించి వేర్పాటు వాదానికి ఆజ్యం పోయాలని చూశారు.లింగాయత్ లను ప్రత్యేక మతంగా గుర్తిస్తూ హిందూ సమాజాన్ని చీల్చాలని ఎత్తుగడలు వేశారు, గౌరీ లంకేష్ హత్య కేసును దారి మళ్ళించి పత్రికా స్వేచ్చపై దాడి అంటూ దేశమంతా RSS, BJP పై తప్పుడు ప్రచారం చేసి సాహిత్య అకాడమి అవార్డులను ప్రధానికి తిరిగిపంపారు, సుప్రీం కోర్టు తీర్పును కూడా RSS, BJP ,ప్రధాని నరేంద్ర మోడి గార్లకు అంటగడుతూ అట్టడుగా ప్రజల అభ్యున్నతికి కృషిచేస్తున్న సంఘ పరివార్‌ సంస్థలను దళిత వ్యతిరేఖులుగా చిత్రీకరించడమే కాకుండా అహిందా కూటమి కుట్రలకు తెరలేపారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఉన్న సెంటమెంట్‌ ను రెచ్చగొట్టి కర్ణాటకాలోని తెలుగు ఓటర్లు తమ గంపగుత్త సొత్తుగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలకు తెరలేపాడు, ఇక మైనార్టీల ఓట్ల కోసం బుజ్జగింపు పతాక స్థాయికి చేరింది, ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధిరామయ్య ''గోమాంసం నాకు ఇష్టం ,చాలా రుచిగా ఉంటుంది అందరూ తినండి" అని వెటకారం చేస్తూ హిందువుల విశ్వాసాలను చులకన చేస్తూ ముస్లీం సంతుష్థీకరణ  విధానం ప్రకటించాడు, శ్రీ కృష్ణ దేవ రాయల నుండి మోక్ష గుండం విశ్వేశ్వరయ్య లాంటి మహానీయులందరిని విస్మరించిన  కాంగ్రెస్ ప్రభుత్వం నరహంతకుడు టిప్పు సుల్తాన్ జయంతిని రాష్ట్ర పండుగగా జరిపించింది, త్రిపుల్ తలాక్ రద్దు చేసి బహు భార్యత్వం రద్దు దిశగా అడుగులు వేస్తున్న ప్రధాని నరేంద్ర మోడి గారి పై ముస్లీం మహిళాలోకం చూపుతున్న ప్రేమాభిమానo దృష్టిని దారి మళ్లించడానికి కథువా లో చిన్నారి అసిఫా హత్యను రాజకీయం చేసి వాస్తవాలు దాచిపెట్టి దేవాలయంలో జరిగిన అత్యాచారంగా, హిందువులంతా రేపిస్టులు అంటూ రామ భక్తులతో ప్రమాదం అంటూ కార్టూన్లు గీసి ప్రపంచ వ్యాప్తంగా హిందూ సమాజాన్ని దోషులుగా చిత్రకరించి తిరిగి ముస్లీం మహిళలలో ద్వేషాన్ని రెచ్చ గొట్టే ప్రయత్నం చేశారు, రోహంగియా నుండి అక్రమంగా ప్రవేశించిన ముస్లీంలకు శాశ్వత నివాసం కల్పిస్తామని ముస్లీం లందరూ మాకే ఓటు వేయాలని కాంగ్రెస్ జాతీయ నాయకులు నిస్సిగ్గుగా ప్రకటించారు, దేశ విభజనకు కారణమైన మహమ్మద్ అలీ జిన్నా చిత్రపటo కూడా తమకు ఓట్లు తెచ్చిపెట్టాలని ఆశించిన కాంగ్రెస్ పార్టీ చివరికి తమ అభ్యర్థుల ప్రచారంలో  'పాకిస్థాన్ జిందాబాద్ ' అని వచ్చిన నినాధాలు కూడా ఆపాలని కోరుకోలేదు,ఇలా చెబుకుంటూ పోతే చాత్తాడంత కుట్రల చిట్టా ఉంది, ఇవన్నీ సునితంగా గమనించిన కర్ణాటక ప్రజలు విచ్చిన్న విభజన రాజకీయాలను తిప్పికొట్టి, దేశ సమగ్రత సమైక్యతలతో చెలగాటమాడే రాజకీయ పార్టీలకు సమాధి కడుతామని సృష్టమైన తీర్పును తమ ఓటు ద్వారా వ్యక్తం చేశారు, ప్రభుత్వాలు అభివృద్ధిని చూపి ఓట్లు అడగాలి అని ప్రజలు తెల్చి చెప్పారు.జాతీయవాద,అభివృద్ధి వాద రాజకీయాలకు లభించిన ఈ విజయాన్ని  మనం స్తూర్తిగా తీసుకొని రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా విచ్చిన్న విభజన రాజకీయాలకు సమాధి కట్టాలి, అందుకై సమిష్టిగా సంఘటితంగా ప్రణాళికలు రచించాల్సిన సమయం ఆసన్నమైంది.- జైభారత్ - వందేమాతరం.-అనంత ఆదిత్య

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments