Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

దేశాన్ని, సమాజాన్ని విచ్చిన్నం చేసే మీ కుట్రలను చేదించాలి

దేశ ప్రజలారా, తస్మాత్ జాగ్రత్త...  మన భారత దేశాన్ని ముక్కలు చేయడానికి రకరకాల పేర్ల మీద దేశంలో ఏదో ఒక్క ప్రాంతంలో దేశ ద్రోహులు పుట్టగొడ...


దేశ ప్రజలారా, తస్మాత్ జాగ్రత్త...  మన భారత దేశాన్ని ముక్కలు చేయడానికి రకరకాల పేర్ల మీద దేశంలో ఏదో ఒక్క ప్రాంతంలో దేశ ద్రోహులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉన్నారు. మొదట అసహనం బ్యాచ్, తరువాత అవార్డు వాపసీ బ్యాచ్, తదనంతరం తుకుడే తుకుడే బ్యాచ్, ఇప్పుడు ద్రవిడ నాడు పేరుతో మరో కొత్త బ్యాచ్.
మురళీమోహన్ గారు, స్టాలిన్ గారు, సిద్దిరామయ్య గారు వంటి కొంత మంది రాజకీయ నాయకులు ఓట్ల కోసం దేశాన్ని దోచుకుంటారని, నోట్ల కోసం బినామీలుగా మారుతారని మాత్రమే ఇన్ని రోజులు అనుకున్నాం. కానీ, ఓట్ల కోసం దేశాన్ని ముక్కలు చేయడానికి కూడా వారు వెనకాడరని వారి పిచ్చి కూతల ద్వారా నిరూపిస్తున్నారు.
దక్షిణాదిలో వచ్చిన ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉత్తరాదిలో ఖర్చు చేస్తున్నది. దక్షిణాది రాష్ట్రాలుగా మేము అభివృద్ధి చెందాం కాబట్టి ఉత్తరాదికి మేము ఎందుకు నిధులు ఇవ్వాలి అని వీరు చిలకపలుకులు పలుకుతున్నారు. మరి అలాంటప్పుడు రెవెన్యూ లోటు ఉన్న ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్రం ప్రత్యేక నిధులు ఎందుకు ఇవ్వాలి అని ఉత్తరాది వారు అడిగితే మీ సమాధానం ఏంటి?
దేశంలోని 115 వెనకబడిన జిల్లాలకు కేంద్రం సంవత్సరానికి 50 కోట్ల చొప్పున ప్రత్యేక నిధులు అందిస్తున్నది. ఈ 115 జిల్లాల్లో గుజరాత్ నుండి కానీ పంజాబ్ నుండి కానీ, ఢిల్లీ నుండి కానీ ఒక్క జిల్లా కూడా లేదు. కానీ, తెలంగాణ లో 9 వెనకబడిన జిల్లాలు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్లో 7 జిల్లాలు ఉన్నాయి. అలా అని ఆంధ్రా, తెలంగాణలకు నిధులు ఎందుకు ఇస్తున్నారని రేపు గుజరాత్ వాళ్ళు, పంజాబ్ వాళ్ళు, ఢిల్లీ వారు అడిగితే మీ సమాధానం ఏంటి?
సైన్యంలో ఉండి దేశం కోసం పోరాడేది ఎక్కువ మంది మేమే, ఎక్కువగా చనిపోయేది కూడా మేమే. మేమే ఎందుకు చనిపోవాలి? మీరు ఎందుకు చనిపోకూడదనే వాదనను రేపు ఉత్తరాది వారు తీసుకువస్తే మీ సమాధానం ఏంటి?
దక్షిణాది వారిగా మేము చాలా తెలివిగలిగిన వాళ్ళం కాబట్టి  మేము జనాభాను తగ్గించుకోగలిగాం. ఈ నేపథ్యంలో ఆర్ధిక సంఘం జనాభా పరంగా నిధులు ఇస్తే ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాలకు లాభం జరుగుతుంది, మాకు నష్టం జరుగుతుందని ఈ అభివృద్ధి కాముకులు  మాట్లాడుతున్నారు. అంటే ఏంటి మీ ఉద్దేశ్యం? 20 కోట్ల జనాభా ఉన్న ఉత్తర్ ప్రదేశ్ కు, 7 కోట్ల జనాభా ఉన్న తమిళనాడుకు ఒకేలా నిధులివ్వాలా? అసలు మీరు మాట్లాడేదానిలో ఏమైనా అర్ధం ఉందా?
కాశ్మీర్ కు లక్ష కోట్ల రూపాయలు ఇస్తున్నారు, మాకు మాత్రం అంత ఇవ్వడం లేదు కొంత మంది పచ్చోళ్ళు మాట్లాడుతున్నారు. కాశ్మీర్ ను ఆంధ్ర ను పోల్చుతున్నారంటేనే మీకు ఎంత అజ్ఞ్యానం ఉందో అర్ధమవుతుంది. కాశ్మీర్ ను కాపాడుకోకపోతే, ఉత్తర భారత దేశం, దక్షిణ భారత దేశం కాదు, మొత్తం భారత దేశానికే ప్రమాదం అన్న విషయం మీకు తెల్వదా? లేక తెలిసి కూడా చెత్త రాజకీయాలు చేయదల్చుకున్నారా?
తెలంగాణాలో మా హైదరాబాద్ అందించే ఆదాయం 70 శాతం. కానీ, మాకు ఖర్చు చేసేది కేవలం 15 శాతం మాత్రమే అని రేపు ఒకవేళ హైదరాబాద్ వాళ్లంతా కలిసి మేము ఈ రాష్ట్రంలో ఉండము. మేము ప్రత్యేక రాష్ట్రంగా ఉంటాం, లేకపోతే మేము కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటాం అంటే ఎం సమాధానం చెప్తాము?
ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో వెనకబడిన ప్రాంతాలు ఉంటాయి. అలాంటి ప్రాంతాలను గుర్తించి, దేశంలోని ఏ ఒక్క ప్రాంతం కూడా అభివృద్ధిలో వెనకపడకుండా చూసే బాధ్యత, హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది అనే విషయాన్ని ఈ ద్రవిడ బ్యాచ్ గుర్తుంచుకోవాలి.
మేము ద్వితీయ శ్రేణి పౌరులమా అని కొంత మంది తమిళ పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు. ఈ దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులు ఎవరూ లేరు. అందరూ ప్రథమ శ్రేణి పౌరులే. ఒకవేళ ద్వితీయ శ్రేణి పౌరులు ఎవరైనా ఉంటె అది కేవలం పేద ప్రజలు మాత్రమే. తరాలు మారినా ధనికులు పేదలను దోచుకుంటూనే ఉన్నారు.
అయినా, దేశానికి మాత్రమే భౌగోళిక సార్వభౌమత్వం ఉంటుంది. రాష్ట్రానికి భౌగోళిక సార్వభౌమత్వం ఉన్నట్లుగా కొంత మంది మాట్లుడుతున్నారు. ప్రాంతీయ పార్టీ నాయకులు వారి వారి రాష్ట్రాలను వాళ్ళ సొంత ఎస్టేట్స్ అనుకుంటున్నారు.  వాళ్ళది ఒక స్వతంత్ర దేశం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది దేశ ద్రోహం కిందకు వస్తుంది.
ఇదంతా ఒక దేశం. దేశం మాత్రమే శాశ్వతం. రాష్ట్రాలు కాదు. రాష్ట్రాలు మిథ్య మాత్రమే. పరిపాలనా సౌలభ్యం కోసమే రాష్ట్రాలను, జిల్లాలను, మండలాలను ఏర్పాటు చేసుకున్నాం. రేపు  పరిపాలనా సౌలభ్యం కోసం అవసరం అయితే 29 రాష్ట్రాలను 50 రాష్ట్రాలుగా చేసుకుంటాం. ఈ రాష్ట్రాలు ఏమైనా శాశ్వతమా?
కొన్ని ప్రాంతీయ పార్టీల నాయకులకు మాత్రమే ఈ వేర్పాటువాద భావన ఉన్నది. ప్రజలకు లేదు. భారత మాత సంతానంగా వారంతా గర్వంగా భారత్ మాతాకీ జై అంటున్నారు.
ఒకడో తెలుగు జాతి అంటడు, ఇంకొకడు తెలంగాణ జాతి అంటడు. ఇంకొకడు ద్రవిడ జాతి అంటడు. మీరు అంటున్నట్లుగా భారత దేశం వివిధ జాతుల సమాహారం కాదు. భారతీయులందరిదీ ఒకే జాతి...అదే భారత జాతి. మనందరికీ ఒకే మాత.. భారత మాత. మనందరిదీ ఒకే జెండా... మువ్వెన్నల జెండా.
అయినా ప్రాంతీయ వాదాలను రెచ్చగొట్టి,  ప్రాంతీయ పార్టీలను స్థాపించుకొని తరతరాలుగా మీ ఒక్క కుటుంబం చేతిలో మొత్తం రాష్ట్ర  అధికార పగ్గాలను గుత్తాధిపత్యంగా పెట్టుకొని బడుగు బలహీన వర్గాలను రాజకీయ అధికారానికి దూరం చేస్తున్నది వాస్తవం కాదా?
మీ స్వార్ధ రాజకీయాల కోసం దేశాన్ని చీల్చాలని మీరు అనుకుంటున్నా ప్రజలు మాత్రం అందుకు సిద్ధంగా లేరు.
ఈ దేశ ప్రజల నరనరాన భారతీయత ఇమిడి ఉన్నది. ఈ దేశంలోని ప్రతి అణువులో, ప్రతి చెట్టులో, ప్రతి పుట్టలో, ప్రతి గుట్టలో భారతీయత ఇమిడి ఉన్నది. యుగయుగాల నుండి, తరతరాల నుండి జీవించే సంస్కృతి భారత సంస్కృతి, జీవించే దేశం భారత దేశం. ఈ దేశాన్ని ముక్కలు చేయడం మీ తరం కాదు. మీ తాతల తరం కూడా కాదు.
భారతీయులుగా జన్మించినందుకు మేము గర్వపడుతున్నాం. మేము జీవించినా ఈ భారత దేశం కోసమే. మరణించినా ఈ భారత దేశం కోసమే. మా జీవితం ఈ దేశానికి అర్పితం. మరణించిన తరువాత మా అస్థికలు కూడా భారత మాత పులకించి విధంగా భారత మాతాకి జై అంటూనే ఉంటాయి.
రాష్ట్రాలకు అధిక ఆర్ధిక వనరులు కావాలంటే అవి సాధించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కానీ, ఆ పేరు చెప్పి దక్షిణ భారత దేశం కావాలని, ద్రావిడ నాడు కావాలని చెప్పి దేశాన్ని ముక్కలు చేయాలని కుట్రలు చేస్తే మేము చూస్తూ ఊరుకోము. భారత మాత పుత్రులుగా మీ స్వార్థ రాజకీయాలను మేము ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటాం. దేశాన్ని, సమాజాన్ని విచ్చిన్నం చేసే మీ కుట్రలను చేధిస్తూనే ఉంటాం.
స్వార్థ రాజకీయాల కోసం దేశంలో విభజన వాదాన్ని రెచ్చగొడుతున్న ఈ రాజకీయ నాయకులను వెంటనే దేశ ద్రోహం కింద జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.

No comments