Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

వనవాసీ కళ్యాణ పరిషత్ - శ్రీధర్ జీ - megaminds

మఠం లో శ్రీదర్జీ ఉండి పోయారు. అక్కడి పిల్లలతో మొదలయ్యిన పని పెద్దవాళ్ళకు చేరింది. వారు ఆ ఊరి వారితో చుట్టూ అనేక గ్రామాలు తిరిగే వారు. పోయ...

మఠం లో శ్రీదర్జీ ఉండి పోయారు. అక్కడి పిల్లలతో మొదలయ్యిన పని పెద్దవాళ్ళకు
చేరింది. వారు ఆ ఊరి వారితో చుట్టూ అనేక గ్రామాలు తిరిగే వారు. పోయిన చోట ఒక భజన కార్యక్రమం, పిచ్చాపాటీ కబుర్లు. వాళ్ళతోనే భోజనం. అక్కడ వారికో ఒక గుడిసె నిర్మించి ఇచ్చారు. అందరూ వారిని గురూజీ అనేవారు. పిల్లలకి, యువకులకి శాఖలు మొదల య్యాయి.
భాగ్యనగర్ వచ్చేవారు. శ్రీదర్జీ ! వాళ్లకి దేశం, త్యాగం చెబుతున్నారా? అంటే వచ్చి చెప్పి చూడు. ఉండే బుడ్డ గోచి నీకే త్యాగం చేసి వెళతాడు. వాళ్ళ కొరకు మీరు త్యాగం చేయాలి. అంటే వాళ్లకి డజన్ల కొద్ది పెన్నులు కావాలి, పలకా బలపాలు కావాలి, తినడానికి బిస్కెట్లు కావాలి. రాసుకోవడానికి కాగితాల కావాలి. ఎవ్వరేమిచ్చినా అన్నీ వాళ్లకు కావాలి, అంటూ సంచులకొద్ది పోగేసుకు వెళ్ళేవారు. ఇంత లగెజి ఎలా మోసు కెళ్తారంటే, అక్కడి అవసరం అట్లాటిది అనేవారు. పిల్లలకి బొమ్మలిస్తే వదిలేవారు కాదు. అక్కడికి వెళ్లి అన్నీ పంచేవారు. తనతో పాటు తల్లిభారతి సేవలో మనల్ని పాలు పంచుకునేట్లు చేసేవారు.
తరువాత పరశురాంజీ, ప్రభాకర్ కూడా వారితో వెళ్లారు. వారు పాటలు, భజనలు బాగా నేర్పారు. ఇక్కడ తెలంగాణా లో వినపడే భజనలు వాళ్ళు వాళ్ళ శైలి లో చేస్తుంటే ఎంతటి మార్పు అనేది మాకు తెలిసేది. అక్కడి సామూహిక కార్యక్రమాలకు ITDA అధికారులు వచ్చే వారు. మొదకొండమ్మకు జై, మత్స్య గుండం స్వామికి జై అంటూ వారికి స్వాగతం దొరికేది. అప్పటి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి ఆదిలాబాద్ జిల్లాకు చెందున గిరిజన బంధువే. వారిని దసరా ఉత్సవానికి పిలిస్తే వారు మటంలో లో కార్యక్రమానికి వస్తే 3500 మంది గిరిజనులతో కార్యక్రమం చూసి వారు ఆశ్చర్యపోయారు .
భాగ్యనగర్ లో మనవారు కలిస్తే, వారు మామూలు మనిషి కాదు. ఋషి . వారిపట్ల అక్కడి గిరిజనులకు ఎంత భక్తి? అంటూ పొగిడేశారు. వారు ఆ పనికే అంకిత మయిన సంఘ ప్రచారకులు, ఆజన్మ బ్రహ్మ చారి అంటే వారికి మరింత ఆశ్చర్యం.
నేను ఏలూరు లో ఉద్యోగం చేసేవాడిని. అనుకోకుండా మా ఆఫీస్ పని పై వైజాగ్ వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ముందుగా పరశు రాంజీ కి ఉత్తరం వ్రాయడం తో వారిని డైమండ్ పార్క్ దగ్గరి కార్యాలయం లో కలిసి, మటమ్ వెళ్ళాము. నేను వారికి తేనెల తేటలు మాటలతో పాత నేర్పించాను. అదొక అద్భుత అనుభవం.
ఒకసారి వైజాగ్ కలెక్టర్ అలా వెళ్తూ పిల్లలు గుండ్రంగా కూర్చుని దేశ భక్తి గీతం పాడుతుంటే జీప్ దిగి వచ్చి, పాట బాగుంది ఏ భాష అన్నారట. సంస్కృతం అని పిల్లలు జవాబు. సంస్కృతం మీకు అర్థం అవుతుందా? అడిగారు. పిల్లలు మేము సంస్కృతం మాట్లాడుతాము అన్నారట. కలెక్టర్ గారి వెంట ఒక సంస్కృతం తెలిసిన మాస్టారు ఉంటె, వారికి ముచ్చటేసి. కూర్చోవడం ఏమంటారు ఆ భాషలో అంటే పిల్లలు ఉపవిశా, మరో గుంటడు లేవడం ఉత్తీస్ట్ అన్నాడు మరొకడు నడవడం ప్రచల, పరుగెత్తడం క్షిప్రచల ఆన్నదట. కలెక్టర్ ఆ పండితుడిని నిజమేనా అడిగారట. వారు నిజమే అన్నారు. మీకు ఏవరు నేర్పారంటే, మా గురూజీ అని శ్రీదర్జీ ని పరిచయం చేశారు. ఇవన్నీ శాఖ లో రోజూ చెప్పే ఆజ్ఞలని వారికి తెలియదు పాపం. శ్రీదర్జీ కి వారు మంచి స్నేహితులయ్యారు.
ఆ తరువాత అక్కడి వారికి ఒక స్టోన్ క్రషర్ వచ్చింది. పిల్లలకు ప్రభుత్వం స్కూల్, హాస్టల్ లో మన సలహాలు తీసుకునే వారు. గ్రామ గ్రామానికి శాఖా, బాల సంస్కార కేంద్రం, వారానికోకసారి భజన కేంద్రం. ఇలా వారి జీవితాలను చూడటం కోసం ఎంతో మంది పెద్దలు. ఇలా ఆ జీవన స్రవంతి లో కొత్త ఉత్సాహం వచ్చింది.
చిన్నపిల్లగా వచ్చిన అచ్చమ్మ ఈ రోజు ఒక ఆవాసానికి, అక్కడి పని నిర్వాహ కురాలు. పోయిన సంవత్సరం మోడీ గారి నుండి సేవా పురస్కారం పొందింది. ఇది మార్పంటే. సాధించాలనే పట్టుదల, నిరంతర పరిశ్రమ, అందరినీ ప్రేమతో చూసే శ్రీధర్ జీ ఈ రోజు భూమిపై లేక పోయినా వారి జ్ఞాపకాలు ఆ పనిలో ప్రేరణ ఇస్తున్నాయి. నాకటే పరశు రాంజీ వ్రాస్తే బాగుండేది. వారు ప్రస్తుతం కరినగర్లో ఉంటున్నారు.
నమస్సులతో మీ నరసింహ మూర్తి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments