Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

దేశపాండేజి మన సంఘ ప్రచారక్-continue - megaminds

వారు భాగ్యనగర్ లో మాననీయ శ్రీ సోమయాజులు విభాగ్ ప్రచారక్ గా మాననీయ భాస్కర్జీ సహవిభాగ్ ప్రచారక్ గా భాగ్యనగర్ ఒక ఉద్దండ ప్రచారకుల టొలి నడిపి...

వారు భాగ్యనగర్ లో మాననీయ శ్రీ సోమయాజులు విభాగ్ ప్రచారక్ గా మాననీయ భాస్కర్జీ సహవిభాగ్ ప్రచారక్ గా భాగ్యనగర్ ఒక ఉద్దండ ప్రచారకుల టొలి నడిపించింది. తరువాతి కాలం లో దేశపాండేజి రాజమండ్రి విభాగప్రచారక్ గా వెళ్లారు. తరువాత జాగృతికి, ప్రచార విభాగం, తరువాత ధర్మ జాగరణ వారు అనేక బాధ్యతలు నిర్వహించారు. మాననీయ రామ్మోహన్ రావు గారు ఎడిటర్ గా వీరు సహాయక గా పని చేశారు.
ఏదైనా వ్యాసాలు వ్రాయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఏదైనా ప్రదర్శిని తయారు చేయాలంటే వారు ఉత్సాహంగా చేసేవారు. అనేక శిక్ష వర్గాల్లో వారు బౌద్ధిక్ ప్రముఖ గా వారు మార్గ దర్శనం చేశారు. నేను వ్యాపారం లో ఉండేవాడిని. దిల్సుఖ్నగర్ జిల్లా టీమ్ లో ఉండి వారిని అంత దగ్గరగా చూడలేదు.
ధర్మ జాగరణలో వారి కాంట్రిబ్యూషన్ గొప్పగా చెప్పుకునేవారు. కొత్త విభాగం, దారులు సరిగా వేసే మార్గదర్శి వారు అయ్యారు. గ్రామాల్లో, తండాల్లో వారు పని ప్రారంభం చేసి మంచి నెట్ వర్క్ నిర్మాణం, పలు పూర్ణ సమయ కార్యకర్తలు, ఆంజనేయ స్వామీ విగ్రహ ప్రతిష్టలు మంచి వాతావరణం తయారు అయ్యింది. వారు తనకు తాను విచ్చుకొని పని చేశారు.
పాత కార్యకర్తలతో, కుటుంబాలతో వారి సంబంధాలు అన్నీ సంఘ కార్యం లో ఉత్సాహంగా ఉండింది. వారు విశ్రాంతి గూర్చి ఎవరైనా గుర్తు చేస్తే అవసరం వచ్చినపుడు తప్పక తీసుకుంటాను మీ ఇంటికే వస్తాను. అనేవారు. అలా ఎంత మందితో అన్నారు, కాని దానిని గూర్చి ఆలోచించేవారు కాదు.
ఒక రోజు వారు, శ్యామ్జీ కలసి చైతన్యపూరి లో మాఇంటికి వచ్చారు. మా జిల్లాలో ఒక కార్యకర్తను కలిసి రాత్రి, వారిద్దరూ మా ఇంట్లో భోజనం చేసి రాత్రి 11.00 గంటల వరకు మా ఇంట్లో ఉన్నారు. ఆనందంగా గడిపాము. కార్యాలయానికి వెళ్ళిపోయారు. ఉదయం మెహదీపట్నం కి ఉదయమే స్కూటర్ పే బయలుదేరి ఎందుకో నీరసం అనిపించి వెనక్కి వచ్చారు. సువీర్జి కార్యాలయ ప్రముక్, హుషారుగా ఉండే పాండన్న కు ఈ నీరసం భయం వేసి ప్రక్కనే ఉన్న వూడలాండ్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. డాక్టర్ కి తన విషయం చెబుతూ గుండె పోటు రావడం తో వారు 1.00 గంట సేపట్లో వారు పరమాత్ముడిని చేరారు. నగరం స్వయంసేవకులు అంతా శోక సముద్రం లో మునిగారు. ఎంత అనాయాస మరణమో? చివరి క్షణం వరకు పనిలోనే.
భరత మాత చరణ సేవకే అంకితమైన ఒక సేవాపుష్పం ఆ తల్లి పాదాల వద్ద రాలిపోయింది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments