చతువిధ పురుషార్ధాలు - కామం. - megaminds

megaminds
0
మనిషికి కోరికలు ఉంటాయి. దాన్నే మనవాళ్ళు పురుషార్థాలలో ఒకటైన కామ అనే పదం వాడారు. కామం అనగానే శారీరక అవసరం అనాల్సిన పని లేదు. అది శరీర, మనసు, బుద్ధి, ఆత్మల , ఏవైనా కలసిగా కాని విడిగా కాని అయి ఉండవచ్చు.
కోరికలు లేని వాడు, తీర్చుకోవడం కొరకు పని చేయని వాడూ ఉండదు. మనసు చేసే సంకల్పం సరైన దిశలో ఉండేట్లుగా బుద్ధి ప్రేరేపించాలి. మనసు తనకి ప్రియమైన దిశలో కాకుండా శ్రేయ మైన దిశలోనడిచేలా బుద్ధి నియంత్రించాలి
ఉపనిషత్తులలో దీన్ని ఒక పోలిక తో వివరించారు. నీవు రథం లో కూర్చుంటే, నీ సారధి నీ బుద్ధి. గుర్రాన్ని ఉండే కళ్ళాలు నీ మనస్సు. గుర్రాలు నీ ఇంద్రియాలు. గుర్రాలను కళ్ళాలు, వాటిని సారధి సరిగా నియంత్రిస్తే నీ ప్రయాణం సునాయాసం, సుగమం అవుతుంది. లేకపోతే ఆ ప్రయాణం తనకు, ఇతరులకు కూడా ఇబ్బంది అవుతుంది. కోరికలు ఉండటం తప్పు కాదు. కాని సరైన పద్ధతి గ్రహించి తీర్చుకోవాలి తప్ప, అవి మన బుద్ధిని నియన్త్రిస్తే వినాశమే. ఇదివరకు చెప్పిన ఉదాహరనే. రావణుడి మనస్సు ఆ కోరిక సరైంది కాదన్న బుద్ధిని నియంత్రించి లంకా నాశనం, తన నాశనానికి కారకూడయ్యాడు.
చతుర్విధ పురుషార్థాలలో కామం కూడా ఉంతుంది. అది సరయినడా కాదా చెప్పే బుద్ధికి ఉన్నత స్థానం ఇవ్వాలి. అయితే ఆ బుద్ధి ఆ కామాన్ని సులువుగా, ఆనందం గా తీర్చుకునే దారి చెబుతుంది. అలాంటి సత్ సంకల్పం నిర్ణయం చేయడానికి బుద్ధి కి ధర్మం అనే నియమం ఉన్న వాడి సంకల్పాలన్నీ ఆ వ్యక్తిని ఆదర్శ వ్యక్తి గా తీసుకెళుతుంది. దానికి ఉదాహరణ శ్రీ కృష్ణుడు.
అర్థమనే మరో పురుషార్థాన్ని గురించి మరో వ్యాసంలో...
షేర్ చేస్తే మన తత్వం అందరికి చేరుతుంది.
నమస్సులతో మీ నరసింహ మూర్తి.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top