ఇప్పటికీ అనేక మంది దీనివల్ల తక్కువ సమయంలో తమ అన్ని రకాల పైల్స్ సమస్యలకు ఉపశమనం పొందారు. ఇది రసాయన రహిత, ప్రభావాలులేని నేచురల్ ఔషధం.
అర్షోనాశక మూల వటి దాదాపు 15 మూలికల తయారు చేయబడుతుంది వాటి కావాల్సిన పదార్థాలు మరియు తయారు చేయు విధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కావలసిన మూలిక పదార్థాలు (ప్రతి పదార్థాన్ని సుమారు 10 గ్రాములు తీసుకోవాల్సి ఉంటుంది): 1.హరితకి, 2.విభీతకి, 3.ఆమ్లకి, 4.నాగకేశర, 5.దారుహరిద్ర, 6.వేపాకులు, 7.గుడూచి, 8.గుగ్గులు, 9.చిత్రక, 10.పిప్పలి, 11.శుంఠి, 12.యవానీ, 13. పునర్నవ, 14.పసుపు, 15.అలోవెరా పొడి (లేదా తాజా గుజ్జు).
తయారీ విధానం:
1. పై అన్ని పదార్థాలను మెత్తగా పొడిగా దంచి ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి.
2. ఈ పొడిలో తేనె లేదా అలోవెరా గుజ్జు (లేదా కొద్దిగా తులసి నీరు/గోమూత్ర సారం) వేసి పేస్ట్‌లా కలపాలి.
3. మిశ్రమాన్ని చిన్న చిన్న మాత్రలుగా (గుంటె ముత్యం పరిమాణంలో) చేయాలి.
4. వీటిని నీడలో వంచి 2–3 రోజులు బాగా ఆరబెట్టాలి.
5. పూర్తిగా ఆరిన తరువాత గాజు సీసాలో భద్రపరచాలి.
వాడక విధానం: రోజుకు 2 సార్లు – ఉదయం ఖాళీ కడుపుతో మరియు రాత్రి భోజనం తరువాత. 1 లేదా 2 మాత్రలు గోరువెచ్చని నీటితో లేదా తేనెతో తీసుకోవాలి.
అదనపు సూచనలు: మసాలా, వేడి ఆహారాలు, మాంసాహారం, మద్యం పూర్తిగా నివారించాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి (పచ్చికూరలు, గోధుమలు, దోసకాయ మొదలైనవి). రోజుకు కనీసం 2.5–3 లీటర్ల నీరు తాగాలి. మలవిసర్జనను నిరోధించకండి – సమయానికి సహజంగా చేయండి.
గమనిక: ఇది గృహోపచార మందు మాత్రమే. పైల్స్ (మూలవ్యాధి) యొక్క తీవ్రత వ్యక్తికి వ్యక్తికి వేర్వేరుగా ఉండవచ్చు. అందువల్ల పరిస్థితి ఆధారంగా సరిగా వైద్య సలహా అవసరమవచ్చు. తీవ్ర లక్షణాలు ఉన్నవారు దయచేసి మమ్మల్ని సంప్రదించండి వారికి తగిన మందు సూచించగలము.


