SCALP మిస్సైల్: SCALP-EG (Système de Croisière Autonome à Longue Portée – Emploi Général) అనేది ఫ్రాన్స్ తయారు చేసిన ఒక అధునాతన క్రూజ్ మిస్సైల్. దీన్ని MBDA అనే యూరోపియన్ ఆయుధ తయారీ సంస్థ అభివృద్ధి చేసింది. ఇది చాలా స్మార్ట్‌గా డిజైన్ చేయబడింది, దీని వల్ల శత్రువుల రక్షణ వ్యవస్థలను తప్పించుకుని ఖచ్చితంగా లక్ష్యాన్ని బలంగాకొట్టగలదు.
రేంజ్ & సామర్థ్యం SCALP మిస్సైల్ ప్రయాణ సామర్థ్యం 500–600 కి.మీ వరకు ఉంటుంది. అంటే, యుద్ధ విమానం ద్వారా దేశ సరిహద్దుల లోపల నుండే ఈ మిస్సైల్‌ను ప్రయోగిస్తే, అది శత్రువుల భూభాగంలో దూర ప్రాంతాలను చేరుకుని దాడి చేయగలదు. ఈ మిస్సైల్‌లో 450 కిలోల వార్హెడ్ ను కలిగి ఉంటుంది, దీనిని ఉపయోగించి బంకర్లు, ఎయిర్‌బేస్‌లు, రాడార్ స్టేషన్లు, హై-సెక్యూరిటీ టార్గెట్లు పూర్తిగా నాశనం చేయవచ్చు.
శత్రువుల కళ్లు కప్పి తప్పించుకునే టెక్నాలజీ ఈ మిస్సైల్ సొంతం. ఇది శత్రువుల రాడార్‌లకు కనిపించకుండా తక్కువ ఎత్తులో (terrain-hugging flight) ప్రయాణిస్తుంది. రాడార్ సిగ్నల్స్‌ని తప్పించుకుంటూ, టార్గెట్ దగ్గరికి చేరేవరకు గుర్తించలేనంత సైలెంట్‌గా వెళ్లగలదు. అంటే, శత్రువుకు ఇది ఎప్పుడొస్తుందో తెలిసేలోపే పేలిపోతుంది.
ఖచ్చితమైన లక్ష్యాన్ని కొట్టగలదు, SCALP మిస్సైల్‌లో ఆధునిక GPS–INS నావిగేషన్, టెర్రెయిన్ మ్యాపింగ్ మరియు ఇన్‌ఫ్రారెడ్ సీకర్ ఉన్నాయి. వీటితో ఇది ఎటువంటి పరిస్థితుల్లోనైనా, అతి క్లిష్టమైన లక్ష్యాన్ని కూడా ఖచ్చితంగా దాడి చేయగలదు. వర్షం, పొగ, రాత్రి, పగలు – ఏ పరిస్థితులలో అయినా దీని పనితీరుపై ప్రభావం చూపదు.
ప్రస్తుతం భారతదేశంలో వినియోగంలో వుంది. భారత వాయుసేనలో రఫాల్స్ ఈ మిస్సైల్‌ను మోసుకెళ్లగలదు. 2019లో బాలాకోట్ దాడి తర్వాత ఈ మిస్సైల్ పేరు మరింత ప్రసిద్ధి పొందింది. మరియు అదే ఆయుధం చూసి పాకిస్థాన్‌ను ఆపరేషన్ సిందూర్ లో బెంబేలెత్తిపోయింది. ఇప్పుడు ఈ మిస్సైల్‌ను స్వదేశీ యుద్ధవిమానం తేజ్‌స్ Mk-1A & Mk-2లో కూడా అమర్చే ప్రయత్నం జరుగుతోంది. ఇది విజయవంతమైతే, భారత వాయుసేనకు ఇది ఒక భారీ గేమ్-చేంజర్.
వ్యూహాత్మక ప్రాధాన్యత SCALP మిస్సైల్ ను తేజస్ పై అమరిస్తే భారతదేశం కేవలం సమీప లక్ష్యాలనే కాదు, శత్రువుల ముఖ్య స్థలాలను (deep strike targets) సైతం నాశనం చేయగలదు. అంటే, పాకిస్తాన్‌లోని లాహోర్, కరాచీ మాత్రమే కాదు, అవసరమైతే టెహ్రాన్ లేదా కాబుల్ వరకు సైతం అతి ఖచ్చితంగా దాడి చేయగలదు. ఇది భారత్‌కి స్ట్రాటజిక్ ఆటానమీ మరియు దూరప్రదేశాలపై దాడి సామర్థ్యంను పెంచుతుంది.
మొత్తంగా SCALP ఒక సాధారణ మిస్సైల్ కాదు – ఇది “స్మార్ట్ వెపన్”గా గుర్తింపు పొందింది. దీని రహస్యమైన ప్రయాణం, ఖచ్చితమైన దాడి, బలమైన వార్హెడ్ కారణంగా ప్రపంచంలో చాలా అరుదైన మిస్సైళ్లలో ఇది ఒకటి. ఇప్పుడు ఇది తేజ్‌స్‌లో చేరితే, భారత్ వాయుసేనకు తక్కువ ఖర్చుతో అధిక శక్తి లభించినట్లే, ఇది శత్రువుల గుండెల్లో భయాన్ని నింపగలదు. నా మాటల్లో చెప్పాలంటే SCALP ఈ పేరు వింటే శత్రువు కి దడ, మరణ సందేశం. జయ్ హిందురాష్ట్ర. -రాజశేఖర్ నన్నపనేని. Mega Minds