వ్యతిరేక కథనాలను తిప్పికొట్టడమెలా?
ప్రపంచంలోని అనేక నాగరికతలను నిర్మూలించి తమ మతాలనే వ్యాపింపచేయాలని చూసే క్రైస్తవ, ఇస్లాం మతాలు భారతదేశంలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ రెండు సామ్రాజ్యవాద మతాలు భారతదేశంలో పాగా వేయడానికి పోటీపడుతున్నాయి. అలాగే చైనా నేతృత్వంలో కమ్యునిజం ప్రపంచంలో ఈ రెండు మతాల తరువాత గొప్పశక్తిగా అవతరించింది. భారతదేశంలో కమ్యునిజానికి ఒకప్పుడున్న ప్రాభవం ఇప్పుడు లేకపోవడం మూలాన హిందూధర్మాన్ని అందులో భాగమైన జైన, సిఖ్, బౌద్ధమతాలను నిర్మూలించడానికి ఈ రెండు మతాలకు సహాయపడుతుంది.భారత స్వాతంత్య్ర పోరాట సమయంలోని జాతీయ తత్వచింతన, మేధోపరమైన ఉత్సాహం, పోరాటపటిమ ఇవన్నీ స్వాతంత్య్రం వచ్చిన తరువాత బలహీనపడ్డాయి. 60 ఏళ్ల పాటు భారతదేశం కుటుంబపాలనలో మగ్గింది. కుహనా లౌకికవాదం, కుహనా ఉదారవాదం విజృంభించి హిందూ సంస్కృతి బలహీనపడింది. దేశవిచ్ఛిన్నకర శక్తులు బలపడ్డాయి. ప్రపంచీకరణలో మన భారతీయ సంస్కృతి వసుధైవ కుటుంబకం అంటే ఈ రెండు మతాలు, కమ్యునిజం మాత్రం ఈ ప్రపంచాన్ని యుద్ధభూమిగా, వ్యాపార కేంద్రంగా చూస్తున్నాయి. అందుకే ప్రపంచంలో అశాంతి నెలకొని వుంది. మన చరిత్ర తెలుసుకుని మసలుకుంటేనే మనదేశాన్ని, మన ధర్మాన్ని రక్షించుకోగలం.
మనం చిన్నప్పుడు పులి, మేక కథ వినే ఉంటాం. పులికి మేకని చంపి తినడానికి ఒక లాజిక్ కావాలి. అలాగే ఈ పాశ్చాత్య విశ్వవిద్యాలయాలు, ప్రొఫెసర్లు, మేదావులు తాము లక్ష్యంగా చేసుకున్న దేశాన్ని ఆర్ధికంగా బలహీనపరచడానికి, సమాజంలో చీలికలు తేవడానికి, వాటిని తమ గులాములుగా మార్చుకోవడానికి అనేక అధ్యయనాలను చేస్తారు. కథలో పులి మాదిరిగా ఒక లాజిక్ ని తయారుచేస్తారు అలాంటి లాజిక్ నే ఢిల్లీ లో జరిగిన జనలోక్ పాల్ బిల్ పై పోరాటం. ఈ ఉద్యమం కొత్త కావడం మూలాన అన్నా హజారే లాంటి వారిని అడ్డుపెట్టుకుని కేజ్రీవాల్ అనే ఫేక్ నాయకుడుని చాలామంది సమర్ధించారు. ఎందరో జాతీయవాదులు కూడా ఈ ఉచ్చులో పడ్డారు. ఇప్పుడు అతను ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడు మానవహక్కుల ఉల్లంఘన, లేదా మైనారిటీల, నిమ్నజాతుల అణచివేత జరుగుతుందని, మతస్వేచ్ఛ లేదనీ మరియు కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలు పోతుందని మాట్లాడుతుంటాడు. నిజానికి కేజ్రీవాల్ ఒక అవినీతిపరుడు, హిందూ ద్వేషి. అలా ఈ పాశ్చాత్య బానిస మేదావులు అనేకమంది మన దేశంలో ఉన్నారు.
మనకందరికీ ఒంటె కథ కూడా తెలిసే ఉంటుంది, రాజస్తాన్ ఎడారిలో విపరీతమైన దుమ్ములేస్తుంటే అక్కడే ఉన్న టెంట్ లో తలపెట్టుకోవచ్చా అని ఆ టెంట్ లో ఉన్న వ్యక్తిని అడిగిందట ఒంటె. సరే తలపెట్టుకో అన్నాడంటా తీరాచూస్తే టెంట్ నే లేపేసింది ఆ ఒంటె. అలాగే మన దేశం నుండి 1947 లో విడిపోయినప్పుడు పశ్చిమ పాకిస్తాన్ లో ఉన్న హిందువుల శాతం 16 మరి ఇప్పుడు 1 శాతం కూడా ఉండకపోవచ్చు. అలాగే తూర్పు పాకిస్తాన్ అంటే బాంగ్లాదేశ్ లో 24 శాతం నుండి నాలుగు శాతానికి పడిపోయాం. 1990 లో కాశ్మీర్ నుండి హిందువులను వెళ్లగొట్టడం ఒంటె కథకు సరిపోయే చక్కని ఉదాహరణ. భారతదేశం ద్వారా స్వతంత్రం పొందిన బాంగ్లాదేశ్ నేడు భారత్ నే బెదిరించాలని చూస్తుంది. అక్రమంగా వలసలతో భారత్ ని నింపేస్తుంది. భారత్ లో ప్రవేశించడానికి రోహింగ్యాలకు దారిచ్చింది. తమ దేశం లో కావాలనే ఒక అంతర్యుద్ధాన్ని క్రియేట్ చేసి హిందువులని మారణకాండకు గురిచేస్తుంది. అన్నం పెట్టిన ఇస్కాన్ సంస్థనే నాశనం చేసింది, మరింత చేయాలని చూస్తుంది.
జర్మనీలో ఆవిర్భవించిన కమ్యునిజం అమెరికాలో ప్రవేశించి కమ్యూనిష్ట్ సిద్ధాంతాన్ని అన్వయించి ప్రతి తెల్లవాడు జాత్యాహంకారి, ప్రతి నల్లవాడు పీడితుడు అనే సిద్ధాంతం తయారుచేశారు. వ్యక్తి స్వాతంత్య్రం పేరిట విడ్డూరమైన సిద్ధాంతాలని అమెరికన్ లపై రుద్దుతున్నారు. నల్లజాతి వారిలో సామాజిక చైతన్యం రూపంలో ప్రారంభమైన వోకిజం లాంటి సామాజిక ఉద్యమాల్ని కమ్యునిష్ట్ లు రూపాంతరం చేసి విచ్చలవిడిగా వ్యక్తి స్వాతంత్య్రం పేరుతో 8 ఏళ్ల పిల్లవాడు లేదా అమ్మాయి ఇష్టమొచ్చిన సెక్సు మార్పిడి చేయించుకోవచ్చు అదికూడా ప్రభుత్వ ఖర్చుతోనే. తల్లిదండ్రులకి ప్రమేయం ఉండటానికి వీలులేదు. స్త్రీ, పురుషులు ఎటువంటి బట్టలైనా వేసుకోవచ్చు అలాగే వారికి నచ్చిన మరుగుదొడ్ల లోకి వెళ్లవచ్చు లింగబేధాలతో సంబంధం లేకుండా. ఈ ప్రవర్తనలు ప్రస్తుతం అమెరికాను అతలాకుతలం చేస్తున్నాయి.
తాము టార్గెట్ చేసిన దేశాలపై ఏదో వంక చూపి అక్కడి ప్రభుత్వాలని కూల్చడానికి, సమాజాన్ని అనేక వర్గాలుగా విభజించి బలహీన పరచడానికి వ్యుహాలు పన్నడం ప్రారంభించాయి. మనదేశంలో కూడా ఇలాంటి పనే చేయాలని గత పదేళ్లుగా అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వీళ్ళు దేశం లో చేసిన మణిపూర్ అల్లర్లు, బాంగ్లాదేశ్ సరిహద్దుల్లో చేసే అల్లర్లు కూడా ఇలాంటివే వీటిని సాకుగా చూపి అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ విలువను దిగజార్చే ప్రయత్నం చేస్తుంటారు. దీనిని Liberation Theology అంటారు. విదేశాల్లో జోక్యం చేసుకోవడానికి, మత ప్రచారం చేయడానికి కేథలిక్ చర్చి కనుకొన్న గొప్ప అస్త్రం ఇది. ప్రపంచం లోని పలుదేశాల్లో (భారతదేశం) ప్రజాదరణ లేని ప్రభుత్వాలు పాలిస్తున్నాయని ఒక వర్గం ప్రజలు మరొక వర్గాన్ని పీడిస్తున్నారని ఆ పీడనకు గురైనవారిని విముక్తి చేయడం తమకు దేవుడిచ్చిన ఆజ్ఞయని వీరి సిద్ధాంతం.
ప్రజాస్వామ్య దేశాల్లో విదేశీశక్తుల జోక్యం ఎక్కువగా ఉంటుంది. శత్రుదేశాలకు ఆటస్థలాలుయివి. అనేకమంది విభజనవాదులు, వారికి తోడుగా సామ్రాజ్యవాద మిషనరీలు మతఛాందసవాదులు, వామపక్ష ఉద్యమకారులు అనేక రంగాల్లో పనిచేస్తూ దేశవ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంటారు. మతఛాందసవాదుల నెట్‌వర్క్ చాలా పటిష్టంగా వుంది. జార్జ్ సొరోస్ లాంటి వాళ్ళు వామపక్ష శక్తులకు, భారత వ్యతిరేక సంస్థలకు, హిందూ ధర్మాన్ని ద్వేషించే కొన్ని రాజకీయ పార్టీలకు విరాళాలివ్వడం తీవ్రనేరం. గొప్పచరిత్ర ఖ్యాతి గడించిన అమెరికన్ విశ్వవిద్యాలయాలు గత కొద్ది సంవత్సరాలుగా పలు వివాదాలకు కేంద్రాలయ్యాయి. అసత్య కథనాలు ఇక్కడున్న ప్రొఫెసర్ లు, విద్యార్థుల చేత వ్రాయించడం. ఉదా: ఔరంగజేబు ఉదార స్వభావంగల పరిపాలకుడనీ, భారతీయ సంస్కృతిని పోషించాడని అసత్య రచనల్ని ప్రచారం చేశారు.
వివిధ దేశాలలోని వామపక్ష మేదావుల ఐక్యత చాలా పటిష్టంగా వుంది. దీన్ని గ్లోబల్ వామపక్షం అని వ్యవహరిస్తున్నారు. వీరు ప్రజాస్వామ్య దేశాల్లోని వివిధ ఆందోళనకు సహకారాన్ని ఇస్తుంటారు. అల్లర్లని ఎలా తీవ్రతరం చేయాలి మేదావి వర్గాలను, మీడియాను ఎలా కలుపుకోవాలని విధి విధానాలు (దీనిని మనం టూల్ కిట్ అంటాం) అందజేస్తుంటారు. గత పదేళ్లగా మనదేశంలో ఇలాంటి టూల్ కిట్ విధానాలు అనేకం జరిగాయి వాటిల్లో కొన్ని మీ ముందుంచుతాను. హైదరాబాద్ విశ్వవిద్యాలయం లో రోహిత్ వేముల ను బలిగొన్నది వీళ్లే. అల్లర్లు చేసింది వీళ్లే. తాజాగా రోహిత్ వేముల దళితుడు కాదని కోర్టు తీర్పునిచ్చింది. రైతు చట్టాలపై సాగిన ఉద్యమం కూడా టూల్ కిట్ లో భాగమే అని గ్రహించాలి. అలాగే ఢిల్లీ షాహిన్ భాగ్ లో జరిగిన అల్లర్లు, జె.ఎన్.యు. లో ఆజాద్ కాశ్మీర్ ఆందోళనలు తుకుడే గ్యాంగ్ లు. ఖలిస్తాన్ తీవ్రవాదం పై కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో నిరసనలు, ఓట్ చోరీ అంటూ గగ్గోలూ ఇవన్నీ భారతదేశం పై విషం చిమ్మేవాటిల్లో భాగమే.
వామపక్షం వారు మంచి కవులు, రచయితలు, పుస్తకాలు, కరపత్రాలు వ్రాయడంలో అనుభవం ఉన్నవారు. ఈ విషయంలో జాతీయవాదులు వెనుకంజలో ఉన్నారు. కమ్యునిష్ట్ లు ఉన్నది తక్కువ మందే అయినప్పటికీ ఆందోళనలు (Agitations) ఒకవైపు, ప్రచారం (Propaganda) మరోవైపు కొనసాగించడాన్ని Agit-Prop అని వీరి పరిభాషలో అంటారు. అనేక అనుబంధ సంస్థల ద్వారా (Front organizations) పల్లెపల్లెల్లో ప్రతివ్యక్తికి తమ భావాల్ని ప్రచారం చేయడం, తక్కువ మందే ఉన్నప్పటికీ ధైర్యంగా సూటిగా చెప్పడం వీరి ఘనత.
ఇప్పుడు మీరు ఎప్పుడూ వినే ఒక కథ చెబుతాను కాకపొతే ఈ కథ చివర్లో ఎలా జరిగితే మన దేశం బావుంటుందో అదే మనం చేయాల్సి ఉంటుంది, అప్పుడు మన దేశాన్ని ఎవరూ ఏమీ చేయలేరు.
కథ: ఒక గ్రామంలో ఒక వ్యక్తి మేకను కొనుగోలు చేసి భుజం మీద వేసుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు. దారి మధ్యలో ముగ్గురు మోసగాళ్లు పథకం వేసుకున్నారు.
మొదటివాడు వచ్చి – “ఏంట్రా! నువ్వు పందిని మోసుకెళ్తున్నావేంటి?” అన్నాడు. ఆ వ్యక్తి కోపంగా – “అరె! ఇది పంది కాదు, మేకే!” అని చెప్పి ముందుకు నడిచిపోయాడు.
కొద్దిసేపటికి రెండవవాడు ఎదురొచ్చి – “అయ్యో! మేక అని అనుకుంటున్నావేమో, కానీ అది స్పష్టంగా పందే!” అన్నాడు. ఆ వ్యక్తి కాస్త అయోమయంలో పడ్డాడు కానీ మళ్లీ – “లేదు ఇది మేకే” అని తన దారిలో సాగాడు.
మూడవవాడు వచ్చి – “ఏరా! నీకు చూపు లేనట్టుంది. నీ భుజం మీద స్పష్టంగా పందే ఉంది” అన్నాడు. ఇంతవరకు మూడు సార్లు విన్నాక ఆ వ్యక్తి మనసు దెబ్బతింది. “బహుశా నిజంగానే పందేమో, నేను తప్పు చూసుంటానేమో” అనుకుని వెంటనే ఆ మేకను వదిలేశాడు.
అలా మోసగాళ్లు తమ బుద్ధితో మేకను కాజేశారు.
ఈ కథలో నీతి ఏమిటంటే – తప్పు మాటలను అనేకసార్లు వింటే అది నిజమని నమ్మే ప్రమాదం ఉంది. కాబట్టి మన బుద్ధి, వివేకంపై విశ్వాసం ఉంచాలి.
ఇందాక కథ మొదలపెట్టక ముందు ఒక మాట చెప్పాను, కథ చివర్లో ఇలా చేయాలని... ఇప్పుడు మనలో ఎవరో ఒకరు ఆ మేక పిల్లను తీసుకెళ్లే అతని దగ్గరకు వెళ్లి మార్గ మధ్యలో బాబాయ్ నీ మేకపిల్ల బలే ముద్దొస్తుందే అని ఎవరైనా అన్నట్లయితే ఏమి జరిగుండేదో ఒకసారి ఆలోచించండి. మనం పెద్ద పెద్ద ఉద్యమాలు చేయాల్సిన పనిలేదు కేవలం ఈ కథ లో చివర పిల్లాడిలా మంచి పనులు చేసే వారిని మంచి పని చేస్తున్నావ్ అని ఒకసారి భుజం తట్టి చూడండి (ఇదే దేశానికీ కుడా వర్తిస్తుంది), మన దేశం జోలికి ఏ ఒక్క టూల్ కిట్, డీప్ స్టేట్, లిబరేషన్ తియాలజి, ప్లే బుక్ ఏవీ, ఏవీ కుడా మన దరిచేరవు. మనం ప్రపంచానికి శాంతినందిస్తాం, ప్రపంచాన్ని వసుదైక కుటుంబం గా మార్చేస్తాము. -రాజశేఖర్ నన్నపనేని, MegaMinds.