అమృత కాడ మొక్క పేరుకే కాదు నిజంగా కూడా అమృతంలోని గుణాలు దీనిలో ఉన్నాయి. ప్రకృతికి మనిషికి అవినాభావ సంబంధం ఉంది. ఇంకా చెప్పాలంటే మనిషి పంచభూతాలతో నిర్మితం.. అందుకనే ప్రకృతిమనిషికి జీవనాధారమైంది. మనకు ఊపిరినిచ్చే గాలి, తినే ఆహారం, అన్ని మొక్కలనుంచే లభిస్తాయి. ఇక మనం ఎందుకు పనిరావని పిచ్చిమొక్కలుగా భావించి చూసే వాటిల్లో కూడా అనేక ఔషధగుణాలున్నాయని మన పురాతన వైద్య శాస్రం ఆయుర్వేదం తెలిపింది. ఈ రోజు చేలల్లో, పొలం గట్లమీద, ఇంటి చుట్టుపక్కన ఇలా ఎక్కడబడితే అక్కడ పెరిగే ఓ మొక్కలోని ఔషధ గుణాలను గురించి తెలుసుకోబోతున్నాం. అంతేకాదు గడ్డిలో కలుపు మొక్కగా పెరిగే ఈ మొక్కను పశువులకు ఎక్కువగా తింటాయి.
ఆరోగ్య ప్రయోజనాలు:
ఈ మొక్కలో యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే ఈ మొక్క ఆకులు, వేర్లు గాయాలు, పుండ్లను తగ్గించడంతో సహాయపడతాయి.
చర్మ వ్యాధులకు:
చర్మరోగాలు, మొహంపై మొటిమలు, మచ్చలు తగ్గించడానికి మంచి అమృత కాడ మంచి ఔషధంగా పనిచేస్తుంది. వీటి ఆకులను మెత్తని పేస్ట్ లా చేసి ముఖంపై మొటిమలు, మచ్చలు ఉన్న చోట అప్లై చేస్తే గాయాలు త్వరగా తగ్గిపోతాయి. మొటిమలు నివారింపబడి.. ముఖం అందంగా మారుతుంది.
సీజనల్ వ్యాధ్యులకు:
ఈ అమృతకాడ మొక్క ఆకులు జ్వరానికి ఔషధంగా పనిచేస్తాయి. ఈ ఆకులు ఆరు తీసుకొని 150 గ్రాములు నీటిలో అర స్పూన్ జీలకర్ర, అరస్పూన్ మిరియాలు కలిపి ఈ ఆకులు కూడా వేసి బాగా మరిగించాలి. ఈ కషాయాన్ని రోజుకు ఒకసారి కనుక తాగుతూ ఉంటే జ్వరం తగ్గిపోతుంది. శరీరంలో వేడిని తగ్గించి మేలు చేయడంలో సహాయం పడుతుంది. మలేరియా జ్వరం తగ్గడానికి ఈ ఆకులను నలిపి ఆ రసాన్ని తాగుతారు. ఆకులను కూడా గొంతు నొప్పి ఉపశమనానికి ఉపయోగిస్తూ ఉంటారు.
రుతుక్రమం రెగ్యులర్పీ గా రాని మహిళలకు అమృత కాడ నిజంగా అమృతంలా పనిచేస్తుంది. ఈ ఆకు మరియు కాండం యొక్క కషాయాన్ని తాగితే.. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నుంచి విముక్తిమాత్రమే కాదు..ఆ సమయంలో తలెత్తే ఇబ్బందులు కూడా నివారింపబడతాయి. రుతుక్రమంలో అధిక రక్తస్రావం తగ్గడానికి ఉపయోగిస్తారు. స్త్రీలలో సంతాన సమస్యలు తగ్గించడానికి కూడా ఈ మొక్కలు ఉపయోగిస్తారు.



Amrutha Kaada Mokka ekkada dorkuthado cheppandi anna naaku kavali
ReplyDelete