India is the New Chess Superpower: 2025

megaminds
0
Divya Deshmukh vs Koneru Humpy


64 గడుల చదరంగంలో భారత్ శాసిస్తుంది... Divya Deshmukh is the 2025 FIDE Women's World Cup champion

ఫిడే మహిళా ప్రపంచ కప్ లో కొనేరు హంపి మరియు దివ్య దేశ్ ముఖ్  తలపడగా మొదటి రెండు రౌండ్లు డ్రా అయ్యాయి అంతిమంగా దివ్య దేశ్ ముఖ్ ఫిడే ప్రపంచ మహిళా ఛాంపియన్  గా నిలిచింది. ఈ ఇద్దరూ భారతీయులే కావడం మరింత ఆనందాన్ని దేశ ప్రజలకిచ్చింది.

64 గడుల చదరంగంలో భారత్ శాసిస్తుంది. ఇటీవల భారత దేశం అంతర్జాతీయ చదరంగంలో విశేష విజయాలు సాధిస్తూ, మహిళా చదరంగంలో కూడా చాంపియన్ స్థాయికి చేరుకుంది. భారత మహిళ మరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఇది దేశానికే గర్వకారణం.

చదరంగం ఆత్మహత్యల నివారణకు మానసిక ఔషధం. ఆధునిక జీవితంలో ఒత్తిడి, ఒంటరితనం, నిరాశ వీటన్నిటి కారణంగా అనేక మంది తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. అత్యంత బాధాకర సంఘటనల్లో ఒకటి ‘ఆత్మహత్య.’ దీనిని తగ్గించేందుకు చదరంగం లాంటి మేధో క్రీడ ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

చదరంగం ఆడటం వల్ల కలిగే మానసిక లాభాలు

చదరంగం ఆడేవారు తమ దృష్టిని పూర్తిగా ఆటపై నిలుపుకోవాల్సి ఉంటుంది. ఇది పనిలోతు, ఏకాగ్రత సామర్థ్యాన్ని క్రమంగా అభివృద్ధి చేస్తుంది. అలాగే, పనుల్లో పరధ్యానాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. చదరంగంలోని వ్యూహాలను, గత కదలికలను గుర్తుంచుకోవటం అవసరం. ఇది మానసికంగా జ్ఞాపకశక్తిని ఉత్కృష్టంగా మార్చుతుంది, అల్జీమర్స్‌ వంటి వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

చదరంగం ఆడటం ద్వారా మనం సమయాన్ని ప్రశాంతంగా, కేంద్రీకృతంగా కూర్చుని గడుపుతాం. ఇది మనసుని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఈ ఆటలో గెలుపు ఓటములు ప్రశాంతంగా స్వీకరించే శక్తి అలవడుతుంది. ఇలా స్వీకరణ శక్తి పెరగడం ద్వారా జీవితంలోనూ మానసిక ధైర్యం సాధించవచ్చు.

ప్రత్తి సారి ఎత్తుకు పైఎత్తు వేయడం లో సరైన నిర్ణయం తీసుకోవడానికి కొత్త కొత్త మార్గాలను ఆవిష్కరించాలి. ఇందులో ఊహాశక్తి, సమస్య పరిష్కరణ పద్ధతులు గణనీయంగా పెరుగుతాయి ఆలోచించడాన్ని మెరుగుపరచుకోవచ్చు. మనలో ముందు జాగ్రత్త, సృజనాత్మకత, మెరుగైన సమస్యాన్వేషణ సామర్థ్యాలను పెంపొందిస్తుంది చదరంగం. సామాజిక ఒత్తిడుల నుండి దూరంగా ఉంచుతుంది. చదరంగంలో స్వీయపరిశీలన చోటు చేసుకుంది. ఒంటరితనాన్ని మాయం చేయడంలో కూడా ఇది కొంత వరకూ సహాయపడుతుంది.

పరిశోధనల్లో చదరంగం తరచుగా ఆడే వారికి మానసిక స్థైర్యం, జ్ఞాపకశక్తి పురోగతి, సమస్యల పరిష్కరణలో స్పష్టమైన అభివృద్ధి కనపడుతోంది. చదరంగం ఆడే కొందరు విద్యార్థులను పరీక్షిస్తే ఆట వలన సృజనాత్మకత, ప్లానింగ్ సామర్థ్యం పెరిగిందని గుర్తించారు. చదరంగాన్ని చికిత్సా విధానాల్లో భాగంగా ఉపయోగించే మానసిక వైద్యులు కూడా ఉన్నారు. మానసిక స్థైర్యాన్ని కోల్పోయిన వారికి చదరంగం ద్వారా సమస్యలు ఎదుర్కొనడం, భావోద్వేగాలను నియంత్రించడం నేర్పిస్తున్నారు.

ఆత్మహత్యల నివారణలో భాగంగా మానసిక శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం, చదరంగం లాంటి మైండ్ గేమ్స్ వల్ల మనసు కొత్త మార్గాల్లో ఆలోచించేలా రూపొందుతుంది. దీని ద్వారా డిప్రెషన్, ఆత్మహత్యకూడా నివారించబడే అవకాశం ఉంది. ఆట ద్వారా ఏర్పడే స్నేహితులు వలన, విజయం ఓటములను పాజిటివ్ గా తీసుకొనే దృక్పథం పెరగడం వలన వ్యక్తిగతంగా, కుటుంబాల్లోనూ ఊరటనిస్తుంది.

చదరంగం ఒక ఆట మాత్రమే కాదు ఇది మనస్సుకు ఔషధం. దీని ద్వారా వ్యక్తిత్వ వికాసం, మానసిక ఆరోగ్యం, జీవితం పట్ల ప్రేమ అలవడుతుంది. ముఖ్యంగా ఒత్తిడికి గురయ్యి పనిచేసే వారు రోజూ ఒకటి రెండు ఆటలు చదరంగం ఆడటం ద్వారా మీ మానసిక ఆరోగ్యాన్ని సంరక్షించుకోగలరు. మన ఇంట్లో పిల్లలకు ముఖ్యంగా చస్ - చదరంగాన్ని నేర్పుదాం.. నేటి తరం పిల్లలకు రోల్ మోడల్ గా గుకేష్, ప్రజ్ఞా, హంపి, దివ్యా దేశ్‌ముఖ్ లు వారి ఫోటో లో ఇళ్లల్లో ఉంచాలి. ఫ్రేమ్ ల రూపంలో కాకపోయినా సెల్ ఫోన్ స్క్రీన్, ప్రొఫైల్ పిక్చర్స్, లేదా కంప్యూటర్ ల మీద, టి.వి లలో వాళ్ల ఇంటర్వ్యూలు చూపించాలి మనమూ చూడాలి.

Click the below Image & Join MegaMindsIndia WhatsApp Group.

Divya Deshmukh vs Koneru Humpy, FIDE Women's World Cup Final 2025, All-Indian Chess Final, Indian women chess history, Grandmaster clash, Women's Candidates qualification, Divya Deshmukh FIDE Women’s World Cup 2025 , Divya Deshmukh becomes India's 88th GM, Divya Deshmukh vs Koneru Humpy tiebreak , India all-India women final chess , rapid tiebreaks explain FIDE Women’s World Cup, youngest champion Divya Deshmukh , India fourth Indian woman Grandmaster 



Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top