భవ్య మనీషి సావర్కర్ - Savarkar life History - సావర్కర్ జీవిత చరిత్ర - 27

megaminds
0

భవ్య మనీషి సావర్కర్

వీర సావర్కర్ మహిమోన్నత వ్యక్తిత్వం ప్రత్యర్థుల ప్రచారపు పొగవలన జనసముదాయంలో ప్రకాశించక పోయినప్పటికిని వక్తగా, సంస్కర్తగా దేశ భక్తుడుగా, రచయితగా, చరిత్ర కారుడుగా, హేతువాదిగా, విప్లవ కారుడుగా, రాజనీతిజ్ఞుడుగా తనకు తానే సాటిగా ఆయన నిలిచాడు. భారత చరిత్రలో ఒక భాగం సావర్కర్ యుగంగా ఆయన ప్రత్యర్మలు సైతం గుర్తించారు.

రచనా ప్రారంభం: సావర్కర్ రచన తన పదవ ఏటనే ప్రారంభించి బాల మేధావిగా గుర్తింపు పొందాడు. చాపేకరు సోదరులు ఉరితీయబడినపుడు వ్రాసిన వీర కావ్యాలు, ఉన్నత పాఠశాలలో చదువేటప్పుడే “నాశికా విభవ ” పత్రికలో వ్రాసిన హిందూస్థాన్ వైభవంఅనే పేరుతో వ్రాసిన వ్యాసాలు, గీతాలు లోకమాన్య తిలక్, మహర్షి రానడే వంటి మహోన్నతుల మన్ననలు పొందాయి. ఆ దినాలలో మహారాష్ట్రను దేశభక్తితో ఉజ్జీవింపజేసిన దేశభక్తి గీతాలన్ని సావర్కరు, అతని శిష్యుడు గోవింద కవి వ్రాసినవే.

చరిత్రను సృష్టించిన చారిత్రక రచనలు: ఆయన చారిత్రక రచన "ప్రథమ స్వాతంత్ర్య సమరము” చరిత్రనే సృష్టించినది. జవహర్ లాల్ నెహ్రూ కూడా చరిత్ర వ్రాసివాడు. కానీ అది ఆహ్లాదకరముగా వ్రాయబడిన పాఠశాల పాఠ్య గ్రంథం మాత్రమే. సావర్కర్ రచించిన చరిత్ర విప్లవములను గూర్చి వ్రాసినది. విప్లవాలను సృష్టించేది. గత చరిత్ర పునాదిగా నూతన చరిత్రను సృష్టించేందుకు జాతిని ఉజ్జీవింపజేసేది. అందువల్లనే బ్రిటీష్ వారు ఈ చరిత్రను అచ్చుకాకముందే విషేధించగా సుమారు 40 సంవత్సరాల కాలంలో వేలకొలది ప్రతులు ముద్రణ పొంది విప్లవ కారుల 'భగవద్గీత' గా రహస్య ప్రచారం పొందింది.

'హిందూ పద పాదుషాహీ' అనే పేరుతో వ్రాయబడిన పుస్తకం మహారాష్ట్రుల నాయకత్వంలో ముస్లిం పాలనను అంతమొందించిన, హిందూ సామ్రాజ్యం స్థాపనా చరిత్ర. హిందూ జాతి అత్యంత దీనమైన విషాదకరమైన పరిస్థితుల నుండి బయటబడి మరల ఆటక్ నుండి కటక్ వరకు గేరువా పతాకాన్ని రెప రెపలాడించి, హిందూ జాతిలో అంతర్గతంగా వుండే వీప్లవ పటిమను విశ్లేషించిన ఉత్తేజకాఠి యైన చరిత్ర. 

తెలుగు భాషలో సహా అనేక భాషలలోనికి అనువదింపబడి అత్యంత ప్రచారం పొందిన గ్రంథం. “భారత చరిత్ర ఆరు స్వర్ణపత్రములు'' మరో ఉత్తేజకర గ్రంథం. హిందూ సంపద, నాగరికతలచే ఆకర్షింపబడి, ఐరోపా ఆసియా మూకలు తెరలు తెరలుగా దండయాత్రలు చేసి దేశాన్ని కొల్లగొట్ట చూచినప్పుడు హిందూజాతి ఏ విధంగా దాడులను తిప్పిగొట్టిందీ, వారిని తనలో ఐక్యం చేసుకొన్నదీ ఈ గ్రంథంలో వివరింపబడింది. 

మరొక ప్రసిద్ధి చెందిన గ్రంథం "నా యావజ్జీవ ద్వీపాంతర శిక్ష” అనే ఆత్మకథ. ఇది మరాఠీ భాషలో రచింపబడి గుజరాతి, ఆంగ్ల భాషలలోనికి అనువదింపబడింది. ఈ పుస్తకం ధారావాహికంగా “కేపరి” పత్రికలో 1925–26లోను, పుస్తక రూపంలో 1927 లోను ప్రచురింపబడి రెండు మూడు ముద్రణలు కాబడి అత్యంత ప్రచారం పొందింది. గుజరాతీ భాషలోనికి కూడా అనువదింపబడిన తర్వాత 1937లో విషేధింపబడింది. స్వాతంత్య్ర సమరంలో విప్లవకారులు ఎటువంటి బాధలు పొందినది, అండమానులలో బ్రిటీష్ వారి అమానుష జైలు నిబంధనలను ఎదుర్కొంటూ ప్రాణాలు వదలిన, పిచ్చిపట్టిన, విప్లవ కారుల చరిత్రలేకాక, ముస్లిం పలాన వార్డన్ల దౌష్ట్యాలకు ఎదురుగా హిందూ సంఘటన శుద్ధి ఉద్యమాలు ఏ విధంగా విజయం పొందిందీ వివరించే ఈ గ్రంథం ఈ నాటి కళాశాలలో పాఠ్య గ్రంధంగా ఉండదగినది. ఈ పుస్తకం పై విషేధాన్ని తొలగింపజేయటానికి ఒక ఉద్యమువేసి తలెత్తింది. నిషేధాన్ని లెక్కచెయ్యకుండా పుస్తక ప్రచురణ సాగిపోయింది. తుదకు 1945లో విషేధంతొలగి 1947 లో బహిరంగ ప్రచురణ జరిగింది. ఈ జీవిత చరిత్రలోనే మరియొక చోట వ్రాయబడినట్లు "హిందుత్వ'' హిందూ పద నిర్వచనకు ఉపనిషత్తుల వంటిది. ఈ పుస్తకం కూడా మొదట సావర్కర్ పేరు లేకుండా ప్రచురించవలసి వచ్చింది.

నాటకాలు - నవలలు: నాటక కర్తగా కూడ వీర సావర్కర్ మహారాష్ట్ర, సారస్వత రంగంలో తనకు తానే సాటిగా నిలచినాడు. 1927లో మొదటిసారిగా రంగస్థలములో ప్రదర్శింపబడిన 'ఉషాప్' దళిత జాతుల ఉద్ధరణకు అస్పృస్యతా నిర్మూలనకు ఉద్దేశింపబడింది. ఈ నాటకం వేసిన చోట ఉద్రేకాలు పెరుగుతున్నవనే మిషతో కొంత కాలం వరకు ఈ నాటక ప్రదర్శన నిషేధింపబడింది. ఈయన రెండవ నాటకం 'పన్యస్త ఖడ్గం'. సంపూర్ణ అహింస వలన ఏ విధంగా జాతి నిర్వీర్యం అవుతుందో స్వరక్షణకు ఖడ్గం ఎంత అవసరమో వివరించే ఈ విషాదంత నాటకం అత్యంత ప్రచారం పొందింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న డాక్టరు యన్.బి.ఖరే నాగపూర్లో ఈ నాటకం చూస్తూ ఉద్రేకం పట్టలేక రంగస్థలం పైకి ఉరికి "మిత్రులారా! నా దేశస్థులారా, ఇప్పటి దేశ పరిస్థితులలో ఇట్టి తత్త్వాన్ని ప్రబోధించేవారు కావలసి ఉన్నది" అని ఉద్ఘాటించారు. మరొక నాటకం "డెత్తర' పానిపట్టు యుద్ధం తర్వాత మహాశాస్త్ర చరిత్రకు సంబంధించింది. బుద్ధుని జీవితంపై “బోధివృక్ష" అను నాటకం అసంపూర్ణంగా నిలిచి పోయింది. వీర సావర్కర్ రెండు నవలలు కూడ వ్రాశారు. “మోప్లా తిరుగుబాటు సావర్కర్ పై  నున్న నిర్బంధాల వల్ల మొదట సోదరుడు బాబారావు సావర్కరు పేర ప్రకటింపబడింది. ఈ నవల సాహిత్యరీత్యా, ఆదర్శవంతమైన కధ వలవ అత్యంత ప్రాచుర్యం పొందింది. రెండవ నవల “ద్వీపాంతరవాసం అండమాన్ జీవితం ఆధారంగా వ్రాయబడినది. ఈ నవలను సినిమాగా తీయాలని కూడా ప్రయత్నాలు జరిగాయి.

వీర కావ్యాలు – దేశభక్తి గీతాలు: ఇక వీర పావర్కర్ వ్రాసిన గేయాలు గీతాలు, మహారాష్ట్ర దేశ భక్తులకు కంఠస్థములు "ధవ్యజీ శివాజీ, రణగాజీ, ధవ్యాప్ తాణాజీ” అనే సింహగఢ్ పై వ్రాయబడిన వీర గేయాన్ని ప్రభుత్వం నిషేధించింది. కానీ ఇంటింటా ఈ గేయం మారుమ్రోగింది. యావజ్జీవ కారాగార శిక్షాకాలంలో తన మనోభావాలను వర్ణిస్తూ వ్రాసిన "సప్తర్షి", అత్యంత ప్రాచుర్యం పాందిన "కమల", "విరోవ్యాపి"", "మహాసాగర ఉడవిపూలు" అనే పేరుతో ప్రచురింపబడిన గేయాలు ఇవి సావర్కర్ ను మహారాష్ట్ర సాహిత్యవేత్తలలో అగ్రగామిగా చేశాయి. దాదాపు పదివేల పైగా పంక్తుల గీతాలను, గేయాలను రచించి కంఠస్థం చేసి, రహస్యంగా తోటి ఖైదీలతో కంఠస్థం చేయించి, తాము అండమాను నుండి భారతదేశానికి వచ్చే లోగా అవి ప్రాచుర్యం పొండేటట్లు చేయగలగటం ప్రపంచ చరిత్రలోనే అపూర్వం. అండమాన్ అడవిలో సృజించిన గీతాలు "అడవిపూలు" అన్న శీర్షికతో ప్రచురితం అయ్యాయి. తాత్విక చింతనతో నిండిన ఇతర గేయాలు "సంకెళ్ళు”. "జైలుగది”. "జగన్నాధ రధోత్సవం”, “నిద్రాదేవి”, “మరణశయ్యపై ”. "జయోస్తుతే స్వతంత్రతే” అనే విప్లవగీతం నెహ్రూ మరణానంతరం పూనా ఆకాశవాణి ప్రసారం చేసినది. "సముద్రము మీదికి" అన్నది మరో ప్రసిద్ధ గేయం.

హేతువాది సావర్కర్: సావర్కర్ తన శాస్త్రీయ హేతువాద దృక్పథాన్ని నిర్ద్వంద్వంగా తన వ్యాసాల ద్వారా ప్రకటించారు. ప్రతి జాతి పటిష్టంగా రూపొందటానికి మూఢ నమ్మకాలను వదలుకొని, విజ్ఞానశాస్త్రంపైన, యంత్రాలపైన ఆధారపడాలనే దృఢమైన నమ్మకాలు గలవారు సావర్కర్. ఒక సందర్భంలో ఆయన ఇలా వ్రాస్తారు. ''ఎందుకొరకు దేవుడు సన్మార్గులను బాధించటానికి దుర్మార్గులను అంత బలవంతులుగా చేయాలి? దేవుడు సర్వ శక్తిమంతుడు, దయామయుడు అయిన పక్షంలో ఒక వ్యక్తి యొక్క అమాయకత్వం, పవిత్రతలను ముందుగానే  తెలుసుకోలేదు? భక్తులను, నిర్మలమైన వారిని, ఎందుకు ఆయన అష్టకష్టాలు పెట్టి పరీక్షించాలి? అని సూటిగా ప్రశ్నిస్తారు. "విశ్వంలోని శక్తులు కొంత వరకు మానవునికి అనుకూలంగాను, ఎక్కువగా ప్రతికూలంగాను వున్నవి. మానవుడు చేయగలిగినదంతా ఏమిటంటే ఈ విశ్వాన్ని నడిపే నిబంధనలను లేదా సిద్ధాంతాలను తెలుసుకొని, వాటిని ఎంతవరకు వీలైతే అంతవరకు తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడం మాత్రమే. ఈ విశ్వానికి జరిపే నిజమైన పూజ ఇదే అని  వ్రాశారు. "యంత్రాలు మానవునికి వరప్రసాదాలు" అనే వ్యాసంలో శాస్త్రీయమైన సత్యం పై ఆధారితమైన ఆలోచనా విధానమే కానీ గాని జ్యోతిష్యంపై మూఢ విశ్వాసం ఉండటం వల్ల ఏమీ సాధించ లేము అని ఆయన పేర్కొన్నారు. విజ్ఞాన శాస్త్రం ఖండించిన దానిని జ్యోతిష్య పఠనం కాపాడ లేదు. విజ్ఞాన శాస్త్రమే క్షేమకరంగా నిర్ణయించిన దానిని జ్యోతిష్య శాస్త్రం ఇండించలేదు అని వ్రాశారు.

యంత్రాలపై గాంధీజీకి గల తిరోగమన భావాలను కాంగ్రెసు ప్రభుత్వాలే లెక్క చేయని విషయం లోకవిదితం. గోవును గూర్చి, పవిత్ర గ్రంథాలను గూర్చి సావర్కరు హేతువాద దృక్పథంతో పరిశీలనాత్మకంగా అనేక వ్యాసాలు వ్రాశారు. హిందువులలోని అంధ విశ్వాసాలను, కులవ్యవస్థను సావర్కర్ నిర్మొహమాటంగా ఖండించారు. ఇంతేకాదు పరాయి ప్రభుత్వంతో సహాయ నిరాకరణ విషయంలో కూడా సావర్కర్కు స్పష్టమైన భావాలు వున్నవి.

సహాయం - సహాయ నిరాకరణ: సహాయ నిరాకరణం కేవలం సహాయ నిరాకరణ కొరకు కాదు. ఎక్కడ శత్రువుతో సహకరిస్తే నీకు లాభం కలుగుతుందో, అక్కడ అతనితో సహకరించవలసిందే. హిందూదేశం ఏ నాటికైనా స్వాతంత్ర్యం పొంది తీరుతుంది. ఆనాడు సైనికంగా పటిష్టంగాని, పారిశ్రామికంగా పురోగామిగా వుండాలంటే కొన్ని సమయాలలో బ్రిటన్తో సహకరించవలసిందే. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలు అట్టి అవకాశాలు ఇచ్చాయి. వాటిని సద్వినియోగ పరచుకోవాలని సావర్కర్ ఉద్ఘాటించారు. అండమాను శిక్ష అనుభవిస్తూ తన తమ్మునికి వ్రాసిన లేఖలలో తాను కోరే స్వతంత్ర హిందూస్థాన్ ఏ విధంగా వుండాలో స్పష్టంగా దర్శించిన ద్రష్టగా సావర్కర్ను మనం చూడగలం. ఆయన తమ్మునికి వ్రాసిన లేఖలు అండమాను ప్రతిధ్వనులు అనే పేర ప్రచురితమయ్యాయి.

ఈ క్రింది భాగాలు చూడండి. "వేల కొలది భారత సైనికులు ప్రపంచంలోని మేటి సైనికులు ప్రపంచంలోని మేటి సైనిక దళాలతో పోరాడటానికి ఐరోపాకు పంపబడ్డారని, వారు అక్కడ అత్యంత దైర్య సాహసాలతో పోరాడి సైనిక దళాలు పొందదగిన అత్యున్నత కీర్తి ప్రతిష్టలను పొందారని తెలిసినా మనస్సు సంతోషంతో ఉప్పొంగి పోయింది. దేవుని దయవలన మన దేశంలో మగసిరి చచ్చిపోలేదు. ఇంకొక విచిత్రం ఏమిటంటే విదేశ యానాన్ని మనం ప్రోత్సహించి ఒక పదిమందిని విదేశాలకు పంపగనే మనలను మనం అభినందించుకునే వారం కదా! ఇప్పుడు చూడండి మనం చేయలేని పనిని విధి నిర్వర్తించింది!

వేలకొలది హిందువులు - గూర్కాలు, రాజ పుత్రుల వంటి సనాతనాచార పరులు, సిక్కుల వంటి ఆధునాతములు, విదేశీ ప్రభుత్వ సహకారంతో సముద్రాలను దాటారు. హిందువులకు సముద్రయానం ఆచరించదగినదా లేక నిషిద్దమా అని పండితులు శాస్త్రాలను తర్కిస్తూ గుడ్లు పొదగనీయండి! నిషిద్ధమవునో కాదో! హిందువులు సముద్రాలను దాటనే దాటారు. అలా దాటడంలో చరిత్రలో ఒక నూతవ శకాన్నే సృష్టించారు. ఆసియాలోని గొప్ప నాగరికతల మధ్య కలయికను ఏర్పాటు చేసి క్రైస్తవుల మత యుద్ధాలు ఐరోపాకు ఏమి మేలు చేశాయో అటువంటి మేలునే సముద్రాలు దాటి హిందూ సైనికులు ఐరోపాలో పోరాడటం భారత దేశానికేమిటి, ఆసియాకే కలుగుజేస్తుంది. 9.3.1915వ అండమాన్ నుండి వ్రాసిన లేఖలో హిందువులు ఆధునిక యుద్ధ పద్ధతులను తెలుసుకొని, సైనిక జాతిగా రూపొందాలని అందుకు అడ్డువచ్చే శాస్త్రాలను, శాస్త్రార్థాలను ప్రక్కకు నెట్టి వేయాలని సావర్కరు దృఢంగా చెప్పారు. తాత్కాలిక ధ్యేయాలు, తాత్కాలిక లాభాలు చౌకబారు జేజేలు కోరే నాయకులు తప్ప, దేశ భవితవ్యంపై ఈ విధంగా దృఢమైన భావాలు గల నాయకులు దేశ భవితవ్యం నిర్ణయింపవలసిన తరుణంలో మరుగున పడి పోవడం దేశ దురదృష్టం కాదా! ఇంకా చూడండి. అండమాను నరకంలో చావు బ్రతుకుల మధ్య ఊగులాడుతున్న తరుణంలో కూడా ఈ రాజనీతిజ్ఞునికి దేశ భవితవ్యంపై గల ఆలోచన.

అండమాన్లో వున్నా మాతృదేశ భవిష్యదర్శనం - ఆలోచనలు: "నీ జాబులో మన ప్రియమైన మాతృదేశం ఎట్లావుందో తెలుపు. టాటా వారి ఇనుప కర్మాగారం, నౌకాయాన కంపెని, కొత్త మిల్లుల వంటి చెప్పుకోదగిన పరిశ్రమలు కొత్తగా ఏవైనా ఏర్పడ్డాయా? చైనా రిపబ్లిక్ ఎలా వుంది. వారు సాధించజాలని దానిని సాధించిందని భావించకు. 1850 నుండి వారు ఈ కార్యసాధనకై దీక్షతో శ్రమించారు." (15.12.1912 అండమాన్ నుండి)

అంతర రాష్ట్ర వివాహాలకు ప్రోత్సాహం: ఇంకా అంతర రాష్ట్ర వివాహాలను గురించి, స్త్రీల స్థానాన్ని గురించి కలకత్తాలో వైద్యశాస్త్రం చదువుతున్న తమ్మునికి అండమాన్ నుండి ఈ క్రింది విధంగా సావర్కర్ వ్రాశారు.

“ఎవరో ఒక చతురురాలైన బెంగాలీ కన్య నీ హృదయాన్ని దొంగలించిందన్న వార్త ఏదో ఒకరోజు వినిపించవచ్చు. నా మటుకు నాకు ఒక ప్రియమైన చిన్ని బెంగాలీ మరదలు రావడం ఎంతో ఇష్టమైన విషయం. హిందువుల్లో అంతర రాష్ట్ర వివాహాలను నేను గట్టిగా బలపరుస్తాను. కాని ఇప్పుడు మన జాతి వున్న పరిస్థితులలో ఐరోపా వనితలతో వివాహాలను మాత్రం నేను తీవ్రంగా
వ్యతిరేకిస్తాను. (15.12.1912 అండమాన్ నుండి)

అండమాన్ - భారత రక్షణ దుర్గం: అండమాన్ దీవులలోనికి ఖైదీగా పోయిన వ్యక్తిగా ఆ దీవులను ద్వేషించలేదు సావర్కర్. "భారతదేశానికి అండమాన్ దీవుల ప్రాముఖ్యత కీలకస్థాన స్థితి మీకు తెలిసిందే. ఈ దీవులు భవిష్యత్తులో భారతదేశానికి రక్షణ వలయంగా, విదేశీ దాడుల నుండి రక్షణకు నౌకా విమాన దళ స్థావరాలుగా ఏర్పడవలసి ఉంది. హిందూ ఖైదీలు ఈ దీవులలోనే స్థిరపడిపోయి దీవులను తమ ఆక్రమణలోనే వుంచుకొంటే వారి పిల్లలు, రక్తం వలన, వారసత్వం వలన, హిందువులుగా వుంటారు. రానున్న తరాలు వారుగా ఈ దీవులు వారివిగా వుండి భారతదేశానికి జలదుర్గం వంటి ఈ ద్వీపం వారి రక్షణలో వుంటుంది." అంటూ అండమాన్లో వుండి దీర్ఘకాలిక ఖైదీలను అక్కడనే కుటుంబాలతో స్థిరపడి పోవలసిందిగా ప్రోత్సహించారు.

భాషా ప్రయుక్త రాష్ట్రాలు: ఇక భాషా ప్రయుక్త రాష్ట్రాలను గూర్చి 9.3.1915 తేదీన అండమాను నుండి తన తమ్మునికి వ్రాసిన లేఖలో తన భావాలను ఈ విధంగా స్పష్టం చేశారు.

"నీవు పంపిన పుస్తకాలను చదువుతుంటే భారత దేశమంతటా వ్యక్తమవుతున్న నూతన జీవన ఛాయలు తెలుగు రాష్ట్రంలోని మన సోదరులలో కూడా కనిపిస్తున్నట్లు గమనించాను. ఆంధ్ర ప్రభ ఉన్నతమైన ఉద్యమమేగాని, ఆ రాష్ట్రాన్ని తమిళ రాష్ట్రం నుంచి విడగొట్టవలెననే భావం మాత్రం శ్రేయస్కరం కాదు. కాని అన్నిటికన్న నాకు వ్యధ కలిగించింది సంకుచిత భాషా రాష్ట్ర భావన వల్ల సహజంగా సంభవించే “ఆంధ్రమాతాకీ జై" వంటి వివాదం. ఈ చిన్న గడ్డిపోచ వంటి విషయంను బట్టి అపాయకరమైన గాలులు ఏ వైపునకు వీస్తున్నవో మనం చూడవచ్చును, మహత్తరమైన స్వదేశీ ఉద్యమం నుండి ఉద్భవించే అనారోగ్యకరమైన ఇట్టి ప్రతికూల స్పందనలను సకాలంలో సవరించవలసి యున్నది. బెంగాలులో చిన్న విభజనతో జతపడిన స్వదేశీ ఉద్యమం ఇలాంటి వ్యతిరేక స్పందనను తెచ్చింది. ప్రతి రాష్ట్రమూ వేరుపడాలని, తనకు దీర్ఘాయుష్షు కావాలని నినాదాలు చేస్తున్నాయి. కాని జాతి జీవించకపోతే రాష్ట్రాలు ఏ విధంగా జీవిస్తాయి? అందువలన 'ఆంధ్రమాతాకి జై' కాకుండా "భారత మాతాకి జై” అని అందాము. 'వంగ అమర్' అని కాకుండా "హింద్ అమర్” అని పాడుదాము." ఈ విధంగా సావర్కర్ ప్రతి విషయాన్ని, అది కుటుంబానికి సంబంధించిన వివాహ సమస్యగాని, ప్రపంచ యుద్ధము కానీండి, భాషా రాష్ట్రాల విషయం కానీండి. హిందూస్థాన్ అఖండ హిందూస్థాన్, సైనికంగా పటిష్ఠమైన హిందూస్థాన్, మూఢ నమ్మకాలను పారద్రోలిన ఆధునిక హిందూస్థాన్ దృష్ట్యా ఆలోచించారు. అందువలననే ఆయన కాంగ్రెసు కపట రాజకీయాలతో కలుషితమైన భారత రాజకీయాలలో ఇమడలేక దూరంగా మార్గదర్శిగా ఉండిపోయాడు. కాబట్టే ఉపేక్షితుడైనాడు. ఎంతటి అపూర్వ భవిష్యదర్శి సావర్కర్!

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Megamindsindia

At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top