Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

LGBT సమస్య - కుటుంబ వ్యవస్థని బలోపేతం చేసుకోవాలా?

ఫ్రెండ్స్ మీరు మెగామైండ్స్ వ్యాసాలు ఇంతకు ముందు చదివినట్లయితే మీకొక విషయం అర్దమయి ఉండాలి, మెగామైండ్స్ ఎప్పుడూ నెగటివ్ వార్తలు లే...


ఫ్రెండ్స్ మీరు మెగామైండ్స్ వ్యాసాలు ఇంతకు ముందు చదివినట్లయితే మీకొక విషయం అర్దమయి ఉండాలి, మెగామైండ్స్ ఎప్పుడూ నెగటివ్ వార్తలు లేదా సమాచారం ను ప్రచారం చేయలేదు కానీ అవగాహన నిమిత్తం కొన్ని వ్యాసాల్లో సమస్యలపై పరిష్కారం కోసం ప్రచారం చేయడం జరుగుతుంది అలాంటిదే ఈ వ్యాసం. అదే LGBT సమస్య.

ముందుగా ఈ LGBT గురించి తెలుసుకుందాం: స్వలింపర్కం నేరం కాదంటూ భారత చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. ముందుగా LGBT అర్దం తెలుసుకుందాం. ఎల్ అంటే లెస్బియన్: లెస్బియన్ అంటే ఒక స్త్రీకి మరో స్త్రీ పట్ల ప్రేమ కలగడం. జి అంటే గే: గే అంటే ఒక మగాడికి మరో మగాడిపై ప్రేమ కలగడం. బీ అంటే బైసెక్సువల్: బైసెక్సువల్ అంటే ఎవరికైనా, ఎవరి పట్ల అయినా ఆకర్షణ కలగవచ్చు. ఒక మగాడికి మరో మగాడిపై ప్రేమ కలగొచ్చు, లేదా స్త్రీపై ప్రేమ కలగొచ్చు. అలాగే ఒక స్త్రీకి మరో స్త్రీ పై లేదా మగాడిపై ప్రేమ కలగవచ్చు. టీ అంటే ట్రాన్స్‌‍జెండర్ : ట్రాన్స్‌జెండర్ అంటే మూడో జెండర్‌కి చెందిన వ్యక్తి. పుట్టినపుడు వీళ్లను మగపిల్లలో, ఆడపిల్లలో అనుకుంటారు. కానీ పెద్దయ్యాక వాళ్లు భిన్నంగా తయారవుతారు. మగాడిగా పుట్టిన వ్యక్తిలో పెద్దయ్యాక ఆడపిల్ల లక్షణాలు బైటపడవచ్చు, ఆడపిల్లగా పుట్టిన వ్యక్తిలో పెద్దయ్యాక మగాడి లక్షణాలు కనిపించవచ్చు. ట్రాన్స్‌జెండర్ల మనసులో ఉండే ఆలోచన వాళ్ల దుస్తుల రూపంలో కనిపిస్తుంది. కొంతమంది తమ ఆలోచనలతో పాటుగా శరీరం కూడా మారాలని అనుకుంటారు. ఆపరేషన్ ద్వారా తమ శరీర అవయువాల్లో మార్పులు చేసుకుంటారు. భారతదేశంలో మాత్రం వీళ్లు 'హిజ్రా'లు అనే పేరుతోనే అందరికీ తెలుసు.

ఇవన్నీ సహజంగా భారతదేశం లో లేదా ప్రపంచంలో ఇంతకు ముందు లేవా అంటే ఉన్నవనే చెప్పాలి, మరి ఎందుకుప్పుడు వీటిపై ఇంతలా ప్రచారం చేస్తూ పాశ్చాత్య దేశాల్లోనే కాక మనదేశం లో కూడా ఇలాంటి సంస్థలు పుట్టుకురావడం దురదృష్టకరం. అంతకు ముందు ఎక్కడో ఒకరిద్దరు అలా ఉండే పరిస్థితిని కావాలని ఈ సూడో సెక్యులర్ మేదావులు దీనిని బహిర్గతం చేసి మన కుటుంబ వ్యవస్థని నాశనం చేయదలచుకున్నారు అనడం లో ఎలాంటి సందేహం లేదు.

భారతదేశం లో ఈ పరిస్థితి నెలకొనడంలో అంతర్జాతీయ స్థాయిలో కుట్ర దాగి ఉందనేది మనం గమనించాలి. ఒకప్పుడు అవయవ మార్పిడి అనేది భారతదేశంలో లేనే లేదు కాని ప్రస్తుతం ఇది ఒక వ్యసనం గా మారేపరిస్థితి కి వచ్చింది. మనం సహజంగా ఒక చెప్పుల షాపుకి వెళితే ఆ షాపులో అందమైన చెప్పులు ఎన్నో ఉంటాయ్ కానీ మనకు ఆ చెప్పు సైజ్ సరిపోకపోతే కొనుక్కుంటామా? కొనుక్కోము అలాగే మానవునిగా జన్మించాక స్త్రీ, పురుష అనేది ఒకటి ఉంది. దాని ఆదారంగానే మానవుల ఉత్పత్తి జరుగుతుంది. దానిని కాదని లింగమార్పిడి చేసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. మనం ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయిని పెళ్ళి చేసుకుని ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం లో మన కుటుంబాలు ఎంత మనోవేదన చెందుతాయి. అలాగే మనవ ఉత్పత్తి కూడా ప్రమాదస్థితిలో చేరుకుంటుంది. వీటి కారణం చేత భారతదేశం దేశ సంస్కృతితో పాటుగా, జనాభాని కూడా కోల్పోతుంది.

నిజంగా ఈ సమస్య పై మనం చెప్పాలంటే భారతదేశంలో LGBT వారికి హిందూ కుంభమేళాల స్నానమాచరించే సమయంలో వీరికి ప్రత్యేక ఘాట్ లను కూడా ప్రభుత్వాలు ఎప్పటి నుండో వేరుగా ఏర్పాటు చేస్తున్నాయి. భారత్ లో బిడ్డ పుట్టగానే ఇళ్లకు పాటలు పాడేందుకు వస్తారు. అలాగే నూతన గృహప్రవేశాల సమయంలో కూడా వీరిని హిందువులంతా సత్కరించుకుంటారు. వారికి ప్రత్యేక కమ్యూనిటీ స్థలం ఉన్నప్పటికీ, వారు కూడా ప్రధాన స్రవంతిలో భాగం. దీనిని ఎన్నడూ ప్రపంచ చర్చనీయాంశంగా మార్చలేదు. ఇదసలు ఒకప్పుడు సమస్యనే కాదు కానీ ఇప్పుడు ఎందుకు ఇంతలా రాద్ధాంతం చేస్తున్నాయో కూడా మీరు అర్దం చేసుకోవాలి. కానీ ఇవి దేశానికి చాలా ప్రమాదకరం ఎందుకంటే వీరిలో ఒకరు చనిపోతే మరొకరు బ్రతుకరు ఇద్దరూ చనిపోతారు.

LGBT సమస్య కూడా అలాంటిదే. జరాసంధుడికి ఇద్దరు సైన్యాధిపతులు ఉన్నారు హన్స్ మరియు డింభక. కృష్ణుడు డింభక చనిపోయాడని పుకారు తేవడంతో, హన్స్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఇద్దరు సైన్యాధిపతులని కృష్ణుడు అలా వదిలించుకున్నాడు. దాని గురించి ఆలోచించండి మనకు ఈ కథ ఏమి సూచిస్తుంది? ఇద్దరు జనరల్స్ ఆ విధమైన సంబంధంలో ఉన్నారు కాబట్టి జరాసందుడు ఓడిపోయాడు. ఇంతకు ముందు మన దేశంలో ఎప్పుడూ లేరని కాదు. మనుషులు ఉన్నంత కాలం ఇలాంటి ప్రోక్లివిటీస్ ఉన్న వ్యక్తులు ఎప్పుడూ ఉంటారు. జంతువులలో కూడా అలాంటి లక్షణాలు కనిపిస్తాయని తెలుసుకోండి. ఇది జీవసంబంధమైనది, జీవన విధానం. వారు కూడా సమాజంలో ఒక భాగమని భావించాలని మనం కోరుకుంటున్నాము. ఇది చాలా సాధారణ సమస్య. ఎల్‌జిబిటిని నేరంగా పరిగణించే ఇస్లామిస్ట్ మరియు చర్చి శక్తులతో వామపక్షం పొత్తు పెట్టుకుంది. ఇస్లాంలో లింగంలోని ఏదైనా వికృత రూపానికి శిక్ష మరణమే. హిందూ గ్రంధాల ఆధారంగా ఎల్‌జిబిటిని హిందుత్వ మాత్రమే ఎప్పుడూ నేరంగా పరిగణించలేదు.

కానీ ఇది కావాలని పసి పిల్లల్ని హోమో సెక్సువల్స్ గా మార్చే ప్రయత్నం జరిగితే మాత్రం దేశానికి చాలా ప్రమాదకరం. దీనిని మనమంతా గుర్తించాలి. ఇది విచ్చలవిడి తనాన్ని పెంచుతుంది. కమ్యునిష్ట్ లు, సూడో సెక్యులర్ లు, వీటికి వంతపాడే ప్రభుత్వాలు దేశంలో రాజ్యమేలితే ఈ దేశం ఎంతో కాలం నిలబడదు. కనుక మనమంతా LGBT మనోభావాలని గౌరవిస్తూనే కుటుంబ వ్యవస్థని కాపాడుకోవాలి, బలోపేతం చేసుకోవాలి. - MegaMinds

No comments