Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

వివాహానికి, విడాకులకి, ఆస్తి వ్యవహారాలకి ఒకే చట్టం అదే ఉమ్మడి పౌరస్మృతి - Common Civil Code

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అంటే 75 సంవత్సరాల పైగా దేశ ప్రజలందరికీ ఒకే చట్టం లేదంటే ఆశ్చర్యం కలుగక మానదు. పౌరులంతా సమానమేనన్న రాజ్యాంగ స్...

Common Civil Codeస్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అంటే 75 సంవత్సరాల పైగా దేశ ప్రజలందరికీ ఒకే చట్టం లేదంటే ఆశ్చర్యం కలుగక మానదు. పౌరులంతా సమానమేనన్న రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించాల్సిన బాధ్యత మనపై లేదా? భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనపై లేదా? అంటే ఖచ్చితంగా మనపై ఉందని ముక్తకంఠంతో చెప్పాల్సిన సమయమిది.

ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం అదే ఉమ్మడి పౌరస్మృతి (UCC, Uniform Civil Code, Common Civil Code). కుల, మత, భేదాలకు అతీతంగా ఈ చట్ట రూపకల్పన జరగాలి దీనికి మనమంతా మద్దతు తెలపాలి. దేశ ప్రజల్లో ఎవరు దొంగతనం చేసినా ఒకే చట్టం, ఒకే శిక్ష ఉన్నప్పుడు వివాహానికి, విడాకులకి, ఆస్తి వ్యవహారాలు, దత్తత స్వీకారం ఇవన్నీ పౌరులందరికీ ఒకే విధంగా చట్టం కావాలి.  అది అమలు చేయడమే ఉమ్మడి పౌరస్మృతి ఆశయం.

సహజంగా మనకు అనిపిస్తుంది ముస్లిం లు మూడు పెళ్ళిళ్లు చేసుకుంటున్నారు. నేనేమో ఒక పెళ్ళి చేసుకుని ఒక్కరినే కంటుంటే వాళ్ళు మాత్రం నేను కట్టే ట్యాక్స్ తో అంతమంది అనుభవిస్తున్నారు కదా అని మీరెప్పుడూ అనుకోలేదా? అదే ముస్లిం అయినా, క్రైస్తవుడయినా, హిందువయినా ఒకటే వివాహం అయితే బాగుంటుంది కదా అనిపిస్తుంది!!. అలాగే ఒక ముస్లిం మహిళ నేను నలుగురు పిల్లల్ని కనలేకపోతున్నాను, అలాగే నాకు తలాక్ చెప్పి విడాకులు ఇచ్చాడు కాని నాకు మాత్రం ఈ పిల్లల్ని పెంచే బాధ్యత తప్పలేదు అదే హిందూ కుటుంబం లో అయితే విడాకులు తీసుకుంటే భరణం లభించేది అంటూ రోధించడం లేదా? అందుకే వీటన్నిటికీ పరిష్కారం ఉమ్మడి పౌరస్మృతి.

దీనికి మూలం ఏమిటి? రాజ్యాంగంలోని 44వ అధికరణ. భారత భూభాగంలో ఉండే పౌరులందరికీ సమానంగా వర్తించే ఒక చట్టం తీసుకు రావాలని అది స్పష్టం చేస్తున్నది. పర్సనల్‌ ‌లా పరిధి నుంచి తప్పించి అందరికీ ఒకే చట్టం అమలు చేసే దిశగా జరుగుతున్న ప్రయాణమే ఉమ్మడి పౌరస్మృతి. 44వ అధికరణం చెబుతున్నదే ఒకే దేశం ఒకే చట్టం గురించి. ఈ అధికరణం ప్రాధాన్యం ఏమిటి? లక్ష్యం ఏమిటి? ఆదేశిక సూత్రాల గురించి చెప్పే అధికరణమిది. వివక్షకు గురయ్యే అవకాశమున్న వర్గాలను దాని నుంచి తప్పించడం, భిన్నత్వం కలిగిన భారతీయ సంస్కృతిలో సామరస్యం తీసుకు రావడమే దాని ఆశయం. అదే సమయంలో వాస్తవికతను దృష్టిలో ఉంచుకున్న అధికరణ కూడా ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావడం అవసరమే కానీ అది స్వచ్ఛందంగా జరగాలని అంటుంది. 35వ అధికరణాన్ని ముసాయిదా రాజ్యాంగంలో చేర్చినది కూడా ఈ ఉద్దేశంతోనే. దేశం సంసిద్ధంగా ఉన్నప్పుడు ఉమ్మడి పౌరస్మృతిని రాజ్యాంగంలో చేర్చాలి అంబేద్కర్ గారిని గౌరవించుకోవాలి.

ఉమ్మడి పౌరస్మృతి గురించి అనుకూలంగా లేదా ప్రతికూలంగా మాట్లాడేవారు మొదట పాటించ వలసిన నియమం దీనిని ఓట్లు తెచ్చే ఆయుధంగా, లేదా రాజకీయ అజెండాగా భావించడం సరికాదు. ఇది భారతదేశ సమైక్యత, స్త్రీపురుష సమానత్వం కోసం చేస్తున్న ప్రయత్నంగా పరిగణించాలి. దీని వాస్తవిక స్వరూపం ఇదే కూడా. అదేకాదు, విధ్వంసక రాజకీయాలకు మూలమైన వలసవాద దృష్టిని ఇది వ్యతిరేకిస్తుంది. మహిళా సాధికారతకు పరిపూర్ణత చేకూర్చగలిగిన పరిణామమిది. ప్రధానంగా ముస్లింలలో ఉన్న బహు భార్యాత్వానికి అడ్డుకట్ట వేసి మహళలకు న్యాయం చేస్తుంది. ముస్లిం మహిళలు పర్సనల్‌ ‌లాతో ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలోనే ఉమ్మడి పౌరస్మృతి రాజకీయ తెర మీదకు వచ్చిందన్నా అతిశయోక్తి కాదు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments