Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

వేప చెట్టు ప్రాముఖ్యత - ప్రయోజనాలు

వేప ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఔషధ గుణాలున్న చెట్టుగా పేరుగాంచిన శక్తివంతమైన వృక్షం. ఆయుర్వేదంలో వేప చెట్టును సహజ ఔషధాలయంగా పరిగణిస్తారు. ఇది ఎక...

వేప చెట్టు ప్రాముఖ్యత - ప్రయోజనాలువేప ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఔషధ గుణాలున్న చెట్టుగా పేరుగాంచిన శక్తివంతమైన వృక్షం. ఆయుర్వేదంలో వేప చెట్టును సహజ ఔషధాలయంగా పరిగణిస్తారు. ఇది ఎక్కువగా భరత ఖండంలో పెరుగుతుంది కానీ దీని ఉపయోగాన్ని గుర్తించడం మొదలుపెట్టి ఇదే తరహా వాతావరణం ఉన్న ప్రదేశాలలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పెంచుతున్నారు. వేప చెట్టులోని ప్రతి భాగానికీ కూడా ప్రత్యేకమైన ఔషధ గుణాలు ఉన్నాయి. అందువల్ల అది ప్రపంచంలోనే అత్యంత బహుముఖ ఔషధ చెట్టుగా గుర్తించబడింది. భారతదేశంలో మన సాంప్రదాయంలో వేప చెట్టు ప్రయోజనాలు మనకు ఎప్పటినుండో తెలిసినా, గత దశాబ్ద కాలంలో ఆధునిక పరిశోధన ఈ వేప చెట్టుని వెలుగులోకి తీసుకువచ్చింది.

వేప చెట్టు ఎన్నో లాభదాయకమైన రసాయనముల సమ్మేళనము. బెరడు మొదలుకొని వేపాకుల దాకా, ఆఖరికి పూలు, పళ్ళు , విత్తనాలు, వేరులు - వేప చెట్టులోని అన్ని భాగాలు అనేక రకాల రుగ్మతలను సరి చేయడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఇది యాంటీ ఆక్సిడెంట్లకు ఒక గొప్ప వనరు కావడం వలన దానికి ఫ్రీరాడికల్ స్కావేజింగ్ లక్షణాలు ఉంటాయని పరిశోధనలు ధృవీకరించాయి. అలాగే అది సెల్ సిగ్నలింగ్ మార్గాలను నియంత్రించడం ద్వారా క్యాన్సర్ ను కూడా ప్రభావవంతంగా ఎదుర్కొనేందుకు సహకరిస్తుంది. వేప, సైక్లోఆక్సీజనేస్ (COX) ఇంకా లిపాక్సీజనేస్ (LOX) లతో సహా అనేక ప్రో - ఇన్ఫ్లమేట్రీ యంజైమును నియంత్రించడం ద్వారా ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థం పాత్రను కూడా పోషిస్తుంది.

వేపకు ఎన్నో నమ్మశక్యం కాని ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి. కానీ అత్యంత ముఖ్యమైన విషయాలలో ఒకటి ఏంటంటే, అది క్యాన్సర్ కణాలను చంపుతుంది. 

ప్లాస్టిక్ టూత్ బ్రష్‌లు విక్రయించబడే వరకు దాదాపు ప్రతి హిందూ గ్రామస్థుడు వేప చెట్టు కొమ్మతో తన దంతాలను శుభ్రం చేసుకున్నాడు.

మీరు రోజూ కొంత వేపను కనుక తీసుకుంటే, అది పేగు ప్రాంతంలో ఉన్న ఇబ్బంది కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. అలాగే మీ పెద్ద పేగును శుభ్రంగా ఇన్ఫెక్షన్ లేకుండా ఉంచుతుంది. అలాగే శరీరంలోని కొన్ని భాగాల్లో కొద్దిగా వాసన వస్తూ ఉన్నట్టయితే, దాని అర్థం అక్కడ బ్యాక్టీరియా కొంచం ఎక్కువ యాక్టివ్ గా ఉంది అని.

దాదాపు ప్రతి ఒక్కరికి కొన్ని చిన్న చర్మ సమస్యలు ఉంటాయి కానీ మీరు మీ శరీరాన్ని వేపతో కడిగితే అది శుభ్రంగా, ప్రకాశవంతంగా మారుతుంది. మీరు స్నానం చేసే ముందు వేప పేస్ట్‌తో మీ శరీరాన్ని రుద్దుకుని, కొంచం సేపు ఆరనిచ్చి, ఆపై నీటితో కడిగేస్తే అది మంచి యాంటీ బాక్టీరియల్ స్నానంగా పనిచేస్తుంది. ప్రత్యామ్నాయంగా, మీరు కొన్ని వేప ఆకులను రాత్రిపూట నీటిలో నానబెట్టి, ఉదయం ఈ నీటితో స్నానం చేయవచ్చు.

అన్నింటినీ మించి వేప శరీరంలో ఉష్ణాన్ని కలిగిస్తుంది. ఈ ఉష్ణాన్ని సృష్టించడం అనేది వ్యవస్థలో చాలా తీక్షణమైన శక్తి రూపాలను తయారుచేయడంలో సహాయపడుతుంది. ఒక హఠ యోగికి వేప ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే అది శరీరాన్ని కొద్దిగా ఉష్ణ వైపుగా ఉంచుతుంది.

వేపతో చేసిన ఉత్పత్తులు ప్రయోజనకరమైన కీటకాలకు, పరాగ సంపర్కాలకు ఇంకా తేనెటీగలకూ అనుకూలంగా ఉన్నాయని కనుగొన్నారు. అవి పర్యావరణపరంగా నిరపాయమైనవి, స్థిరమైనవి, పునరుత్పాదకమైనవి, అందరికి అందుబాటులో ఉన్నవి.

వేప జ్యూస్ తాగటం అనేది ఒకరి జీర్ణవ్యవస్థను పునర్వ్యవస్థీకరించి రీబూట్ చేయడానికి సహాయపడుతుంది. అది ఒకరి మెటబాలిజంను కూడా గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఒక జ్యూస్ గా తీసుకున్నప్పుడు, చేదుగా ఉండే ఈ వేప శరీరంలోని కొవ్వును కరిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే అది పేగులలోని మలాన్ని శుభ్రపరచడానికి, శరీరం మల విసర్జన ప్రక్రియను మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఇది అవసరం లేని బ్యాక్టీరియా పెరుగుదలను నివారించడం ద్వారా రక్తాన్ని శుద్ధిచేస్తుంది. ఎందుకంటే వేపలో యాంటీ బ్యాక్టీరియల్, ఏంటి సెప్టిక్ ఎంజైములు సమృద్ధిగా ఉంటాయి.

వేప చెట్టులోని అన్ని ఇతర భాగాలలో లాగానే, వేప వేళ్లలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 2011 లో నిర్వహించిన ఒక అధ్యయన ఫలితాలు, వేప వేరు బెరడు సారం, 27.3 μg / mL వద్ద 50% స్కావెంజింగ్ యాక్టివిటీతో, అధిక ఫ్రీ రాడికల్ స్కావెంజింగ్ ప్రభావాన్ని ప్రదర్శించిందని అలాగే ఈ సారం యొక్క మొత్తం యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటి ఆస్కార్బిక్ ఆమ్లం ప్రామాణికం ప్రకారం 0.58 అని తేలింది.

వేప పండు నుండి నూనె తీస్తారు. దీన్ని చుండ్రుని పోగొట్టడం కోసం తలకి రాయవచ్చు. అలాగే చుండ్రు రాకుండా నివరణకు కూడా వాడవచ్చు. ఈ నునే దోమల రిపెల్లంట్ గా కూడా సమర్ధవంతంగా పనిచేస్తుంది. సాధారణంగా లభించే అన్ని రూమ్ ఫ్రెషనర్‌లలో కూడా ఇది ఒక భాగంగా ఉంటుంది.

బాగా గుర్తుంచుకోవలసిన ఒక విషయం ఏంటంటే వేపను అతిగా తీసుకోవడం అనేది వీర్యకణాలను చంపుతుంది. గర్భం దాల్చిన మొదటి నాలుగైదు నెలల్లో, పిండం అభివృద్ధి చెందుతున్నప్పుడు, గర్భిణీ స్త్రీలు వేపను తీసుకోకూడదు. వేప అండాశయాలకు ఎటువంటి నష్టం కలిగించదు కాని అది అధిక వేడిని కలిగిస్తుంది. ఒక స్త్రీ అప్పుడే గర్భం దాల్చి ఉంటే, అదే సమయంలో శరీరంలో ఎక్కువ వేడి ఉంటే, ఆమె పిండాన్ని కోల్పోవచ్చు. ఒక స్త్రీ గర్భం ధరించాలని అనుకున్నట్లయితే ఆమె వేపను తినకూడదు, ఎందుకంటే అధిక వేడి ఉంటుంది, మన శరీర వ్యవస్థ ఆ శిశువును బయటి పదార్థంలా భావిస్తుంది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments