భారతభూమి మన తీర్థక్షేత్రం ఎందుకు?

megaminds
0
భారతభూమి - మన తీర్థక్షేత్రం: ఈ భూమిలో పవిత్రత తప్ప ఇంకొకటి కనిపించదు. ఈ భూమిలోని ప్రతి మట్టి కణము, జడచేతన వస్తువులు, రాయి, చెక్క, చెట్టు, నది ఇలా అన్నీ పవిత్రమే. ఈ భూమి సంతానమైన మనకు ఇటువంటి ప్రగాఢమైన భక్తిభావాన్ని‌ హృదయంలో సజీవంగా ఉంచడానికి మన పూర్వీకులు అనేక రకమైన విధివిధానాలు సదాచారాలు మనకి అందించారు. మనం ప్రతిరోజు జరిపే ధార్మిక కార్యక్రమాల్లో, పూజా విధానాలలో ఈ దేశంలోని అనేక విశిష్ట స్థానాలను అనుసంధానం చేసుకుంటూ ఈ నేల తో మనకున్న సంబంధాన్ని స్మరించుకుంటున్నాం.

మనం తలపెట్టే ధార్మిక సంబంధమైన కార్యక్రమాలన్నీ ముందుగా భూమి పూజతో మొదలవుతాయి. ఉదయాన్నే నిద్ర లేవగానే భూమిపై పాదం మోపే ముందు, మనల్ని భరిస్తున్నందుకు భూమాతను క్షమించమని కోరుతూ ప్రార్థిస్తాము.

సముద్ర వసనే దేవి పర్వతస్తనమండలే
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే
(దేవి! సముద్రమే నీకు ఆచ్ఛాదన. పర్వతాలను స్తనమండలములుగా చేసుకుని నీ వాత్సల్యాన్ని నదుల రూపంలో ప్రవహింప చేస్తున్నావు. ఓ విష్ణుపత్ని! నీకు నమస్కరిస్తున్నాను. నా పాదం నీపై మోపుతున్నందుకు నేను  క్షమింపబడుగాక.)

నిద్ర లేవగానే ఈ శ్లోకాన్ని స్మరించుకోవడం ఒక సాధారణమైన పని. కానీ దీని ద్వారా ప్రతిరోజు మన మనసులో ఆదిశక్తి అయిన భూమాత పట్ల భక్తి భావన ఏర్పడుతుంది. ఇటువంటి ఆచారాలను పాటించడం వల్ల మనకు తెలియకుండానే మన దినచర్యలోని అనేక కార్యక్రమాలు మనకు ఈ దివ్యానుభూతిని కలిగిస్తాయి. పిల్లలు ఆటలాడేటప్పుడు, పరిగెడుతూ ఎగిరే సమయంలో తల్లి, భూమాతను కాలితో తన్నకూడదు ఆమెకు బాధ కలుగుతుంది అంటూ ఉంటుంది. ఒక సాధారణ రైతు కూడా పొలం దున్నే సమయంలో భూమికి నమస్కారం చేసిన తర్వాతే వ్యవసాయం చేస్తాడు. ఇది మన పరంపర. ఈ భూమి ఎప్పుడూ మనకి నిర్జీవము, అచేతనమైన పదార్థం కాదు. ధనికులు పేదవారు అని తేడా లేకుండా ఈ భూమి  సాక్షాత్తు మన అందరి పాలిట తల్లి స్వరూపమే.

స్వామి వివేకానందుడు ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి తిరిగి పైన ఏ సమయంలో ఇంగ్లాండ్ అమెరికా వంటి సమృద్ధి దేశాలను తిరిగి భారతదేశానికి వస్తున్నారు కదా! ఈ యాత్ర పూర్తి చేసుకున్న తర్వాత మాతృభూమి పట్ల మీ అభిప్రాయం ఏమిటి? అని అడగగా స్వామీజీ చెబుతూ, భారతదేశాన్ని నేను ఇంతకుముందు కేవలం ప్రేమించే వాడిని. కానీ ఇప్పుడు ఈ దేశంలోని ప్రతి రేణువులోని కణ కణమూ నాకు అత్యంత పవిత్రమైనదిగా గోచరిస్తుంది. నాకు  భారతదేశం ఒక తీర్థ క్షేత్రం లా కనిపిస్తున్నది.
(సతతము చేసెదము రాష్ట్ర ఆరాధన,
తను, మన, ధన పూర్వకముగా
మన జీవితమే సమర్పించగా
సతతము చేసెదము రాష్ట్ర ఆరాధన)

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.



Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top