Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

సావర్కర్ భారత యువతను బ్రిటీష్ సైన్యంలో చేరమన్నది నిజమే

ఈ మద్య కాంగ్రెస్, కమ్యునిష్ట్ లలో కొంతమంది మూర్ఖులు సావర్కర్ బ్రిటీష్ వాళ్ళని క్షమాపణలు అడుగుతూ ఉత్తరాలు వ్రాశాడని, అలాగే భారత య...


ఈ మద్య కాంగ్రెస్, కమ్యునిష్ట్ లలో కొంతమంది మూర్ఖులు సావర్కర్ బ్రిటీష్ వాళ్ళని క్షమాపణలు అడుగుతూ ఉత్తరాలు వ్రాశాడని, అలాగే భారత యువతని బ్రిటీష్ సైన్యంలో చేరమన్నాడని కారు కూతలు కూస్తూ నోటికొచ్చినట్లు వాగారు, వాటికి బదులుగా మెగామైండ్స్ గత వ్యాసంలో సావర్కర్ వ్రాసిన ఉత్తరాల గురించి వివరించింది. ఈ వ్యాసంలో యువతను బ్రిటీష్ సైన్యం లో ఎందుకు చేరమన్నాడో ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకుందాం....

సావర్కర్ భారత యువతను బ్రిటీష్ సైన్యంలో చేరమన్నది నిజమే: 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం గురించి అందరికీ తెలుసనే భావిస్తున్నాను. రోజూ దేశం గురించి ఆలోచించే వారికి అది ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం కాని సగటు పౌరుడుకి అది 1857 సిపాయిల తిరుగుబాటు. సగటు పౌరుడు అది సిపాయిల తిరుగుబాటుగా ఎందుకు భావిస్తున్నాడు. ఆ సిపాయిల్లో చాలా మంది భారతీయులున్నారు వారు హిందువులుగా, ముస్లిం లుగా ఉన్నారు. వారి మద్య చిచ్చు పెట్టడానికి ఆవు కొవ్వు తూటాలు, పంది కొవ్వు తూటలు ఉంచారు బ్రిటీషర్స్.

కానీ దీనిని అదనుగా చేసుకును ఒక ప్రణాళికా బద్ధంగా మన ఝాన్సీ లక్ష్మీ, తాంత్యా, కున్వర్ సింగ్, మంగళ్ పాండే ఇలా ఒక వ్యుహంతో దేశ వ్యాప్తంగా ఒక ఉద్యమం కోసం ప్రయత్నం చేశారు కొంతమేరకు విజయం సాధించినా అంతిమంగా విఫలం అయ్యాం కానీ అదే స్పూర్తి తో ఫడ్కే, బంకింబాబు, తిలక్, సావర్కర్ లు పనిచేయనారంభించారు. సావర్కర్ అయితే ఒకడుగు ముందుకేసి 1857 ప్రథమ స్వతంత్ర పోరాటం గురించి పుస్తకమే వ్రాశాడు, కాని దానిని ముద్రణకు ముందే అడ్డుకుని అన్న బాబారావ్ సావర్కర్ ని అండమాన్ జైలుపాలు చేశారు. ఇది చరిత్ర వాస్తవం. సావర్కర్ వాళ్ళ బూట్లు నాకేవాడయితే ఆ పుస్తకాన్ని ముద్రణకి ముందే ఎందుకు ఆపేశారు.

సావర్కర్ 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామ తరాహాలోనే హిందువుల్ని సైన్యీకరించలని ఆ శిక్షణని మనం బ్రిటీషర్స్ కళ్ళు కప్పి చేయడం కష్టం కనుక శిక్షణను బ్రిటీషర్స్ శిబిరంలోనే పొందాలని నిర్ణయించుకుని ఒక పథకం ప్రకారం భారత యువతని సైన్యంలో చేరాలని ఆదేశించాడు. 

ఆ తరువాత జూన్ 22 1940 వ తారీకున సుభాష్ చంద్రబోస్ తో మొదటిసారిగా సమావేశమైనప్పుడు. సావర్కర్ హిందువుల్ని సైన్యీకరించలి అనే పకడ్బందీ యోజనని సుబాష్ ముందుంచాడు. దానికి సుభాష్ కార్యాచరణలో భాగంగా భారత జాతీయ సైన్యాన్ని INA ని స్థాపించాడు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వయంగా 1945లో ఒక రేడియోలో ప్రసంగిస్తూ, వీర్ సావర్కర్ తన మనస్సులో ఒక లక్ష్యంతో బ్రిటిష్ సైన్యంలో చేరాలని దేశంలోని యువతను కోరారు. సావర్కర్ యువకులను బ్రిటిష్ సైన్యంలో చేరి అక్కడి నుండి యుద్ధ శిక్షణ తీసుకోవాలని, సమయం వచ్చినప్పుడు సైన్యాన్ని విడిచిపెట్టి ఈ దేశ స్వాతంత్ర్య పోరాటంలో చేరాలని కోరారు. బ్రిటిష్ సైన్యం నుంచి మరో సిపాయి తిరుగుబాటును సృష్టించేందుకు సావర్కర్ ప్రయత్నించారు.  ఊహించిన విధంగానే బ్రిటీష్ ప్రభుత్వం చాలా మంది యువకులను భారత సైన్యంలోకి చేర్చుకున్నది తరువాత వారిలో ఎక్కువ మంది బ్రిటిష్ సైన్యం నుండి INAలోకి ప్రవేశించారని, INA దాని నియామకాలను పొందిందని చెప్పారు.

వీర్ సావర్కర్ నేతృత్వంలోని హిందూ మహాసభ మాత్రమే భారతదేశ విభజనకు వ్యతిరేకంగా చివరి శ్వాస వరకు పోరాడిన ఏకైక రాజకీయ సంస్థ. రాష్ బిహారీ బోస్ వీర్ సావర్కర్‌ను గొప్ప భారతీయ దేశభక్తుడు మరియు శౌర్యం మరియు త్యాగానికి ప్రతీకగా పేర్కొన్నాడు. రాష్ బిహారీ బోస్ సుభాష్ చంద్రబోస్‌తో కలిసి భారత జాతీయ సైన్యాన్ని పనిని చేపట్టాడు. 

ఈ దేశం కోసం స్వాతంత్ర్యం రాకముందు ఏమి చేసినా అది దేశాన్ని పరాయిపాలన నుండి విముక్తం చేయడంకోసమే, కొంతమంది కమ్యునిష్ట్ పార్టీని ఎంచుకున్నారు, ఇంకొందరు గదార్ పార్టీని ఎంచుకున్నారు, మరికొందరు ఆజాద్ హింద్ ఫౌజ్ లో చేరారు, అనేకమంది హిందూ మహాసభ లో పనిచేశారు అంతే తప్ప ఎవడి బూట్లు ఈ దేశం కోసం పనిచేసిన ఏ ఒక్కరూ నాకలేదు ఒకడి క్రింద పని అస్సలుచేయలేదు. ఇదే సత్యం. దీనిని తెలుసుకుని నడుచుకుంటే రాబోయే కొద్ది సంవత్సరాల్లో భారతదేశం ఉన్నత శిఖరాలని అధిరోహిస్తుంది అది మనకళ్ళతో చూడొచ్చు, అడ్డమైన వాగుళ్ళు వాగితే దేశప్రజల్లో ఆత్మాభిమానం దెబ్బతింటుంది. ప్రస్తుత పరిస్తితుల్లో దేశంకోసం పనిచేయకపోయినా పర్లేదు అడ్డమైన వాగుళ్ళు వాగొద్దు.. -రాజశేఖర్ నన్నపనేని.


ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments