Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మతమార్పిడీలు - రక్తబీజుడి కథ - ప్రస్తుత పరిస్థితులు

మతమార్పిడీలు: భారతదేశం ఎన్నో విదేశీ దండయాత్రలను చవిచూసింది, వాటిని ఎల్లప్పుడూ ఎదుర్కోగలిగింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద ఉపద్రవం పొం...

Religious-conversion


మతమార్పిడీలు: భారతదేశం ఎన్నో విదేశీ దండయాత్రలను చవిచూసింది, వాటిని ఎల్లప్పుడూ ఎదుర్కోగలిగింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద ఉపద్రవం పొంచివుంది. హిందువులను క్రైస్తవ మతం, ఇస్లాం మతంలోకి మార్చడానికి చేసే ప్రయత్నాల గురించి మనమందరం కొన్ని సంవత్సరాలుగా వింటున్నాము. హిందుత్వము నుండి ఇతర మతాలలోకి మార్చబడే వారికి అత్యధికంగా సహాయపడేది హిందువులే. ఇలా జరుగుతుంది అని తెలుసుకునేలోపే ఈ ఊబిలో కొంతమంది హిందువులు చిక్కుకుంటున్నారు, కనీసం బయటకు రాలేని పరిస్తితి. ఫలితంగా, కొన్ని చోట్ల హిందూమతం త్వరగా ప్రాబల్యాన్ని కోల్పోతోంది.

స్టీఫెన్ నాప్ (ప్రసిద్ద రచయిత, కృష్ణభక్తుడు) లెక్కల ప్రకారం, ప్రస్తుతం భారతదేశంలో చాలా మిషనరీలు వివిధ తెగల నుండి పనిచేస్తున్నారు, వీరంతా మత మార్పిడుల కోసం పోటీ పడుతున్నారు. దక్షిణ భారతదేశ బాప్టిస్టులు మాత్రమే ఉత్తర భారతదేశం అంతటా మత మార్పిడీలు చేయడానికి దాదాపు మిషనరీలు 100,000 మంది పాస్టర్లు పనిచేస్తున్నారు. అలాగే హిందూ మతం నుండి ప్రజలను మతం మార్చే ప్రయత్నంలో దక్షిణ భారతదేశంలోని అనేక మంది కాథలిక్ ఫాస్టర్లు సన్యాసీల వలె దుస్తులు దరించి పనిచేస్తున్నారు, పెద్ద పెద్ద ఆశ్రమాలు కూడా కలిగి ఉన్నారు. క్రైస్తవ మతంలో కూడా మన వైదిక సంప్రదాయాలను పోలి ఉండడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. క్రైస్తవ పాఠశాలల్లో, భరతనాట్యం కూడా బోధించబడుతోంది, అయితే వేద చిహ్నాలు మరియు అర్థాల స్థానంలో క్రీస్తుని వుంచారు. హిందువులను క్రైస్తవ మతంలోకి వేగంగా మార్చే ప్రయత్నంలో ఇదంతా జరుగుతుంది.

ప్రస్తుతం, పాశ్చాత్య దేశాలలో యోగాను "క్రిస్టియన్ యోగా" అని పిలవడం, చేయడం ద్వారా యోగాకు మద్దతు ఇచ్చే చర్చిలు ఉన్నాయి. క్రైస్తవ ఆచారాలు, చిహ్నాలు మరియు వాటి యొక్క హిందూ రూపాలపై దుస్తులు కూడా ధరించడం ద్వారా, వారు క్రైస్తవ మతాన్ని భారతీయ సంస్కృతిలో లోతుగా చేర్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కమలంపై శిలువను చూడవచ్చు, కొంతమంది ఫాస్టర్లు కుంకుమ ధరిస్తారు మరియు కొన్ని చర్చిలలో దేవాలయం లాంటి వాతావరణం ఉంటుంది. ఇది ఇలాగే కొనసాగితే, బహుశా క్రైస్తవమే ఈ దేశ సంస్కృతా అనిపించక మానదు.

ఇంట్లో ఒకరు మారితే చుట్టేసి మొత్తం బందువులతో సహా మతం మారిపోయిన కుటుంబాలు ఈ దేశంలో అనేకం ఉన్నాయి. అలా మతం మార్చే కుటుంబాలకి ఆర్ధికంగా సహాయంచేయడం, బైక్ లు, కార్లు కొనివ్వడం చేస్తారు మరియు ఒక చైన్ సిస్టం ని కూడా ఏర్పాటుచేసుకున్నారు. మిషనరీలు మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాల్లోని గిరిజన ప్రజలకు వడ్డీతో కూడిన రుణాలను అందజేస్తాయి, వారు వాటిని సులభంగా తిరిగి చెల్లించలేరు. కానీ వారు క్రైస్తవ మతంలోకి మారితే, ఆ రుణాలపై వడ్డీని మాఫీ చేస్తారు.

మిషనరీ ఆసుపత్రులు ఈ దేశం అంతా విస్తరించి ఉన్నాయి. మనం ఈ ఆసుపత్రులకి వెళ్ళినట్లయితే మొదటగా పనిచేయని మందులు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే అప్పుడు మనం హిందూ దేవీ దేవతలకు ఆరాదిస్తుంటాము కాబట్టి, ఆ విషయం మనకు అప్రయత్నంగా చెప్పి తరువాత ఏసుని నమ్ముకొమ్మని చెప్పకనే చెప్తారు ఒక్కసారి ప్రార్థన చేసాక మంచి మందు ఇస్తారు జబ్బు నయం అవుతుంది ప్రస్తుతం మిషనరీ ఆసుపత్రుల్లో ఇదే జరుగుతుంది.

నిమ్నకులస్తులకు గతంలో ఆదరణ కరువైన కారణంగా వారికి క్రైస్తవంలోకి మారడం ద్వారా మీ కుల గుర్తింపు పోతుందని మతం మారుస్తున్నారు, కానీ అక్కడ కూడా ఇదే పరిస్థితి ఉందని తరువాత తెలుస్తుంది కాని అటువంటి హిందువులు తిరిగిరాలేని పరిస్థితి వుంది, ఇది అత్యధికంగా ధక్షిణ భారతంలో ముఖ్యంగా కేరళలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కులాల వారీగా చర్చిలు ఉన్నాయంటే నమ్మశక్యం కాదు.

మిషనరీలు చిన్న పిల్లలను కిడ్నాప్ చేస్తున్నారు. చెన్నైలోని ఒక క్రిస్టియన్ మిషనరీ దంపతులు గిరిజనులకు తమ ఆడపిల్లలను ఇవ్వడానికి డబ్బు చెల్లిస్తున్నారు. వారు గిరిజన ప్రజలకు నవజాత ఆడపిల్లలకు బదులుగా 2000–5000 రూపాయలను ఇచ్చి కొనుక్కుంటున్నారు, ఆపై బాలికలను పాశ్చాత్య దేశాలకు $30,000–40,000 వరకు మిషనరీల వారు అమ్ముతున్నారు. భారతీయ అధికారులు 300 మంది పసికందులను తప్పించారని అంచనా.

అస్సాం, నాగాలాండ్ మరియు మణిపూర్ ఈశాన్య భారతదేశంలోని మూడు రాష్ట్రాలు, విదేశీ మిషనరీల మోసపూరిత పద్ధతుల ఫలితంగా గత 25 సంవత్సరాలలో వారి క్రైస్తవ జనాభా సుమారు 200% పెరిగింది. ఇప్పుడు అక్కడ హిందూ మతాన్ని ఆచరించడం కొన్ని చోట్ల అపరాదంగా మారింది.

ఇప్పుడిపుడే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కూడా హిందూ దేవుళ్ళ పండుగలు జరుపుకోవాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అవుతోంది. గ్రామాల్లో మైకులు పెట్టాలన్న అనుమతి, వినయక ఉత్సవాలకీ అనుమతి అంటున్నారు. అలాగే డిల్లీ లాంటి పట్టణాల్లో దీపావళి టపాకాయలు కాల్చొద్దని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. గుళ్ళల్లో విగ్రహాలు ద్వంసం చేయడం, రథాలు తగులబెట్టడం, ఈ తప్పులు చేసిన వారు దొరికాక వారికి మతిస్థిమితం లేకపోవడం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం...


క్రైస్తవ పాఠశాలల్లో మన హిందూ పిల్లలు చదివినట్లయితే వారిలో సెక్యులరిస్ట్ లుగా తయారవుతారు అలాగే కొంతమంది మతం మారిపోతున్నారు. ఈ మద్య కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో కేరళ నన్ ల చేత కూడా పాఠాలు భోదిస్తున్నారు. ప్రయివేటు పాఠశాలల్లో కూడా శంటా తాత, ఇంకా సెలబ్రేషన్స్ పేరుతో క్రైస్తవ పండుగలు నిర్వహించడం ఫ్యాషన్ అయిపోయింది. పాఠశాలల్లో సరస్వతీ దేవీ బొమ్మలు తీసేయడం, వసతీ గృహాల్లో కూడా దేశ భక్తి, మన సంస్కృతికి సంబంధించిన చిత్రాలు తొలగించడం లాంటివి నిత్యం జరుగుతూనే ఉన్నవి.

రక్తబీజుడు కథ - ప్రస్తుత పరిస్థితులు: బ్రహ్మ ఇచ్చిన వరం ఫలితంగా రక్తబీజుని ఒంటి నుంచి ఒక్క రక్తం చుక్క భూమిపై పడితే అప్పుడే వందలాది మంది రక్తబీజులు పుట్టుకొస్తారు. దీంతో దుర్గ అతనితో తలపడి గాయపరిచిన కొద్దీ అతని సైన్యం సంఖ్య పెరుగుతూ ఉంటుంది. దుర్గాదేవి అయోమయస్థితిలో పడుతుంది. రక్తబీజులు మూకుమ్మడిగా దుర్గపై దాడి చేస్తూ ఉంటారు. ఆమెకు కలిగిన కోపంతో భయంకర రూపంలోని కాళీ ఆవిర్భవిస్తుంది. కాళీమాత వారిని సంహరించి , చివరకు రక్తబీజు పై దాడి చేస్తుంది రక్తబీజుని ఒడిసి పట్టుకొని అతని ఒంటిలోని రక్తాన్ని పూర్తిగా తాగేస్తుంది. అనంతరం రక్తబీజుడి తలని చేతిలో పట్టుకొని రక్తం కింద పడకుండా కింద ఓ చిప్ప పట్టుకుంటుంది. దీంతో రక్తబీజుడు మరణిస్తాడు.

అయుతే పూర్వం ఈ రక్త బీజుడు ఎలా అనేకమంది ని తన రక్తం ద్వారా పుట్టించాడో అలాగే ఈ రోజు సమాజాన్ని, హిందుత్వాన్ని నాశనం చేయడానికి రక్తబీజుడిలా అనేక రూపాలను ఈ దుర్మార్గులు సంతరించుకున్నారు. మొదటగా కాంగ్రేస్ దేశ స్వాతంత్ర్య వచ్చాక ఈ రూపాన్ని సంతరించుకుంది, తరువాత కమ్యునిష్ట్ లు ఇలా వీళ్ళకి తోడు పైన చెప్పుకున్న విధంగా మతమార్పిడి ముఠా ద్వారా దేశం లో ప్రస్తుతం కొన్నివేల సంస్థలు పుట్టుకొస్తూ ఈ దేశం ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాయి.. ఆ రోజున రక్త బీజుడ్ని చంపడానికి అమ్మవారు కాళీలా మారింది. ఇప్పుడు కనీసం ఈ రూపం లో వీళ్ళున్నారు అని అనుకునే లోపే ఇంకో రూపంలో మారి దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ అంతం మరి ఎలా ఉంటుందో అర్దము కాని పరిస్తితి నేడు నెలకొని ఉంది. వీటన్నిటి నుండి మన దేశం బయట పడాలి అంటే కచ్చితంగా ఒక శక్తి సమూహం బయటకు సంఘటన రూపంలో రావాల్సిందే...

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments