వక్ఫ్ బోర్డు గురించి పూర్తి వివరాలతో వ్యాసం - Do you wanted to know about Waqf Board in India

megaminds
2

వక్ఫ్ మూలాలు: వక్ఫ్ సంస్థ యొక్క మూలాలు అరేబియాలోని ఖైబర్ అనే ప్రదేశంతో ప్రారంభమైంది. స్వాధీనం చేసుకున్న ఆస్తిని తమ ఆస్తిగా మొదటి ప్రకటించింది ఖైబర్ లోనే. అందుకే మనం మన చరిత్రనే కాదు ప్రపంచ చరిత్రను కూడా చెప్పాల్సిన అవసరం వుంది.

అసలు వక్ఫ్ అం‌టే ఏమిటి? ఇదొక అరబ్ పదం. ఈ పదానికి అర్ధం - ఇస్లాం కోసం మతపరమైన వితరణ, ‌సాధారణంగా భవనాలను, భూములను, ఆస్తులను మత కార్యక్రమాలకు పూర్తిగా ఇవ్వడం మనభాషలో చెప్పాలంటే దానం చేయడం, కానీ ఇది లాక్కోవడం అనాలి. 10 వ శతాబ్దంలో వక్ఫ్ ‌చట్టం ద్వారా మదర్సాలు, వైద్యశాలలు ఎక్కువగా ఏర్పాటుచేశారు. వీటి నిర్వహణ ఖర్చు వక్ఫ్ ‌సంస్థలు భరించేవి. ఇంకా సులభంగా చెప్పాలంటే, ఒక మహమ్మదీయుడు దేవుని పేరు మీద విద్య, మత, ధార్మిక కార్యక్రమాల కోసం ఇచ్చిన విరాళం. కానీ వక్ఫ్ అం‌టే అసలు అర్ధం కబ్జా చేయడం. ఈ అసలు అర్ధమే ఇప్పుడు చలామణిలో ఉంది.

వక్ఫ్ చట్టం 1923 లో మొదటగా బ్రిటిష్ వారిచే ప్రవేశపెట్టబడింది. 1925లో సిక్కుల గురుద్వారాల చట్టం ఆమోదించబడింది. తద్వారా గురుద్వారాలను ఎన్నుకోబడిన సిక్కుల సంఘం నియంత్రణలోకి తీసుకు వచ్చింది. 1925లో మద్రాస్ రిలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ యాక్ట్‌ను బ్రిటీష్ వారు తొలిసారిగా ప్రవేశపెట్టారు. దీనికి ముస్లింలు మరియు క్రైస్తవుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ విధంగా వాటిని మినహాయించటానికి, హిందువులకు మాత్రమే వర్తించేలా మద్రాస్ హిందూ రిలిజియస్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ 1927 గా పేరు మార్చబడింది. కాబట్టి బ్రిటీష్ వారు హిందువుల కోసం ఒక చట్టాన్ని మరియు మిగిలిన వారికి మరొక చట్టాన్ని ఏర్పాటు చేశారు. స్వతంత్ర భారతదేశం ఈ చట్టాలతో కొనసాగింది. 

స్వతంత్రం వచ్చిన తరువాత వక్ఫ్ చట్టం 1954 మొదటిది. ఇది అనేక సవరణలకు గురైంది. చివరగా వక్ఫ్ చట్టం 1995 రూపొందించబడింది. ఈ చట్టం సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ మరియు రాష్ట్ర వక్ఫ్ బోర్డులను ఏర్పాటు చేసింది. హిందూ వారసత్వ చట్టం 1956 అమాయక హిందువుల కోసం తూతూమంత్రంగా ఆమోదించబడింది.

1995 వక్ఫ్ చట్టం జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రానికి మరియు  అజ్మీర్‌ దుర్గాకు వర్తించదని పేర్కొంది. ఈ మతలబు ఏంటో మరి, అయితే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసిన కారణంగా వక్ఫ్ చట్టం జమ్ము కాశ్మీర్ కి కూడా వర్తిస్తుంది ఇంకా ఆచరణలోకి తెవాల్సివుంది.

1995 వక్ఫ్ చట్టం సుమారు 40 ఏళ్ళు అమలులో ఉన్న తర్వాత కుట్రపూరితంగా కాంగ్రేస్ ప్రభుత్వం పి.వి.నరసిం హారావు ప్రధానిగా వుండగా దీన్ని రద్దు చేసి 1995 లో కొత్త వక్ఫ్ చట్టాన్ని పార్లమెంట్ లో ఆమోదింపచేసింది. ఈ చట్టం ద్వారా వక్ఫ్ బోర్డుకు హిందువుల ఆస్తులు కేవలం ఒక నోటీస్ ద్వారా స్వాధీనం చేసుకునే హక్కులను ముస్లింస్ కు దారాదత్తం చేసింది. 2004 నుండి 2013 వరకు ఎన్నో ఆస్తులను ఈ చట్టం ద్వారా తమపరం చేసుకున్నారు ముస్లింలు. ఆ తరువాత 2013లో కాంగ్రెస్ మరో కుతంత్రంతో చట్టంలో కొద్ది మార్పులతో వక్ఫ్ 1995 చట్టానికి పూర్తి స్వేచ్చనిచ్చింది అదేంటంటే పచ్చ జెండా పాతితే చాలు అది వక్ఫ్ బోర్డ్ స్థలమే.. వక్ఫ్ చట్టం, 1995 లోని సెక్షన్ 3 ప్రకారం, ఆ భూమి ముస్లింకు చెందినదని వక్ఫ్ భావిస్తే అది వక్ఫ్ ఆస్తి. వక్ఫ్ బోర్డుకు ఎటువంటి రుజువులు అవసరం లేదని ఇక్కడ గమనించాలి. మీ ఆస్తి మీది కాదని, వక్ఫ్ బోర్డుకు చెందినదని వక్ఫ్ భావిస్తే, అప్పుడు మీరు కోర్టుకు కూడా వెళ్లలేరు.

మీరు వక్ఫ్ ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించవచ్చు. వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 85 ప్రకారం అది మీ సొంత భూమి అని వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ ను సంతృప్తి పరచలేకపోతే, ఆ భూమిని ఖాళీ చేయమని మిమ్మల్ని ఆదేశిస్తారు. ట్రైబ్యునల్ నిర్ణయమే తుది నిర్ణయం. వక్ఫ్ ట్రిబ్యునల్ నిర్ణయాన్ని ఏ కోర్టు, సుప్రీంకోర్టు కూడా మార్చలేవు. వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 40 ప్రకారం, వక్ఫ్ బోర్డు ఒక వ్యక్తి భూమిపై దావా వేసినప్పుడు, భూమిపై హక్కును నిరూపించడం వక్ఫ్ బోర్డు బాధ్యత కాదు, కానీ భూమి యొక్క నిజమైన యజమాని తన భూమి యాజమాన్యాన్ని నిరూపించాలి. అంటే వక్ఫ్ బోర్డు ఏదైనా భూమిని క్లెయిమ్ చేస్తే, అప్పుడు వక్ఫ్ బోర్డు భూమికి సంపూర్ణ యజమానిగా మారిందని అర్థం చేసుకోండి. 

కాంగ్రెస్ ప్రధాని పీవీ తెచ్చిన వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 40 ప్రకారం ముస్లిం మత అవసరాలకు వినియోగించబడుతోంది అని భావిస్తే, దేశంలోని ఏ ప్రాంతంలోని ఎవరికి చెందిన ఆస్తినైనా స్వాధీనం చేసుకునే హక్కు వక్ఫ్‌బోర్డ్‌కు ఉంది. పైన చెప్పిన విధంగా ట్రిబ్యునల్ కోర్ట్ కి వెళితే ఈ ప్రశ్నలే ఉంటాయి...

ప్రశ్న 1: భూమిని స్వాధీనం చేసుకునే ముందు ఎవరో ఒకరు విచారణ చెయ్యాలి కదా.. అదెవరు చేస్తారు..?

జవాబు: వక్ఫ్‌బోర్డ్

ప్రశ్న 2: విచారణ నివేదికను ఎవరికి సమర్పిస్తారు..?

జవాబు: వక్ఫ్‌బోర్డ్‌కు

ప్రశ్న 3: విచారణపై ఎవరు నిర్ణయాన్ని ప్రకటిస్తారు..?

జవాబు: వక్ఫ్‌బోర్డ్

ప్రశ్న 4: నీ ఆస్తి స్వాధీనం కాకుండా ఉండాలంటే ఎవరిని ఆశ్రయించాలి..?

జవాబు: వక్ఫ్‌బోర్డ్ ట్రిబ్యునల్

ప్రశ్న 5: వక్ఫ్‌బోర్డ్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసేదెవరు..?

జవాబు: వక్ఫ్‌బోర్డ్

ప్రశ్న 6: వక్ఫ్‌బోర్డ్ ట్రిబ్యునల్‌లో సభ్యులెవరు..?

జవాబు: ముస్లింలు

ప్రశ్న 7: వక్ఫ్ ట్రిబ్యునల్ నిర్ణయం నీకు వ్యతిరేకంగా ఉంటే ఎవరికి మొర పెట్టుకోవాలి..?

జవాబు: వక్ఫ్‌బోర్డ్

ప్రశ్న 8: వక్ఫ్‌బోర్డ్‌లో సభ్యులు ఎవరు..?

జవాబు: ముస్లింలు

ప్రశ్న 9: ఇలాంటి అధికారం మరే ఇతర మతస్థులకైనా ఉందా..?

జవాబు: లేదు

ప్రశ్న 10: దీంతో అర్థమైందేంటి..?

జవాబు: దేశంలోని ప్రతి ఒక్కరూ వక్ఫ్.. అంటే.. పరోక్షంగా ముస్లింల దయాదాక్షిణ్యాలపై బతుకుతున్నారు..!

ఈ వ్యాసం పూర్తి చేయబోయే ముందు ఇంకొన్ని బిందువులు అదనంగా.. వక్ఫ్ బోర్డ్ ఒక స్వచ్చంద సంస్థ లాంటిదే. 1982 స్వచ్చంద సంస్థల చట్టాల ప్రకారం, సెక్షన్ 80 G ప్రకారం డొనేషన్ లు తీసుకోవచ్చు. అలాగే సంస్థ ఒక సెక్షన్ 8 కంపెని తరహాలో కూడా నడపవచ్చు, ఎటువంటి ట్యాక్స్ లు కూడా కట్టాల్సిన పనిలేదు ఎందుకంటే లెక్కల్లో ఇంకా సంస్థకి అప్పులే ఉంటాయి మదర్సాలు, మతపరమైన అన్నిటికీ వీటి నిధులే ఆదారం అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బడిముబ్బడిగా ఈ సంస్థకి డబ్బుల్ని ఇస్తాయి. ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ ఆదీనంలో ఉంటుంది కానీ దీని భూముల పై ఎటువంటి హక్కులు రాష్ట్ర ప్రభుత్వం కలిగి వుండదు.

సచార్ కమిటీ నివేదిక 2006 అంచనా ప్రకారం భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వక్ఫ్ భూమిని కలిగి ఉంది. దాదాపు 6 లక్షల ఎకరాల భూమిని కలిగి ఉండి 4.9 లక్షల రిజిస్టర్డ్ వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తుల యొక్క మార్కెట్ విలువ సుమారు రూ. 1.20 లక్షల కోట్లు. ఇప్పుడిది కనీసం పదిరెట్లు పెరిగి ఉండొచ్చు.

వక్ఫ్ చట్టం 1995 ఈ మద్య చేసిన కొన్ని పంచాయీతీలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను:
2014 మార్చిలో లోక్ సభ ఎన్నికలు ప్రారంభం కావడానికి ముందు కాంగ్రెస్ ఈ చట్టాన్ని ఉపయోగించి ఢిల్లీలోని 123 పురాతత్వ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి అత్యంత ప్రధాన ఆస్తులను ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు బహుమతిగా ఇచ్చింది.

గత 40 ఏళ్లలో సగం డిల్లీని వక్ఫ్ పేరిట ముస్లింస్ బలవంతంగా ఆక్రమించుకున్నారని మీకు తెలుసా?

నాటి ముస్లింస్ పాలనలో కంటే గత 40-50 ఏళ్లలో వక్ఫ్ ను అడ్డంపెట్టుకొని హిందువుల ఆస్తులను ఆక్రమించుకున్నది ఎక్కువ.

ఈ చట్టం ఉపయోగించి షుమారు 500 లకు పైగా హిందువుల మోహల్లాలని ఆం ఆద్మీ ప్రభుత్వం కేజ్రీవాల్ వక్ఫ్ కు దారాదత్తం చేసింది. కేజ్రీవాల్ ప్రజాధనం 101 కోట్లను వక్ఫ్ కు బహుమతిగా ఇచ్చాడు కేవలం 2020-21 ఈ ఒక్క సంవత్సరంలోనే 62 కోట్లరూపాయలు దోచిపెట్టాడు.

ఇటీవల తమిళనాడు వక్ఫ్ బోర్డు 1500 సంవత్సరాల పురాతన హిందూ ఆలయంతో సహా తమిళనాడులోని 7 గ్రామాలను వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించింది.

కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలో గల శ్రీకృష్ణ మందిర ఉత్సవాలు జరిగే 11 సెంట్లను కాజేయడానికి స్థానిక ముస్లింస్ వక్ఫ్ చట్టాన్ని ప్రయోగించారు..

చేబ్రోలు మండలం గొడవర్రు గ్రామంలో అయితే అత్యంత దారుణంగా ముస్లింస్ ప్రవర్తించారు. వందలాది ఏళ్లుగా కులాలతో నిమిత్తం లేకుండా గ్రామస్తుల పూజలందుకుంటున్న 'జంధ్యాల వసంతమ్మ' అమ్మవారి విగ్రహాన్ని ముక్కలు ముక్కలుగా పగలు కొట్టి బావిలో వేసి ఆ బావిని పూడ్చేశారు. తర్వాత ఆ కాంపౌండ్ మొత్తం ప్రహరీ గోడ కట్టేశారు. గ్రామస్తుల కడుపుమండి కులాలకతీతంగా ఏకమై రాత్రికి రాత్రి ఆ గోడ కూల్చేశారు.

ఒక హైలెట్ ఈ వ్యాసాన్ని తెలుగులో అందిస్తూ మన తెలుగు రాష్ట్రాల గురించి చెప్పకపోతే బాగోదు. తెలంగాణ ల కంటే ఆంధ్రలో ఎక్కువగా వక్ఫ్ బోర్డ్ పనిచేస్తుంది. ఒకసారి మీరు ఫేస్ బుక్ లోకి వెళ్ళి సెర్చ్ లో వక్ఫ్ బోర్డ్ అని టైప్ చేయండి మీకే అర్దమవుతుంది.

ఈ చట్టం కారణంగా దేశంలో ఇప్పటివరకు లక్షలాది ఎకరాల భూములు వక్ఫ్ బోర్డ్ పరమయ్యాయి. సరళంగా చెప్పాలంటే, ముస్లిం దాతృత్వం పేరిట ఆస్తులను క్లెయిమ్ చేయడానికి వక్ఫ్ బోర్డుకు అపరిమితమైన అధికారాలు ఉన్నాయి. కానీ ఇది ఎలా సాధ్యమైందో అర్థం చేసుకోవడానికి, మనం చరిత్ర పుటలను తిప్పాలి. ఆఖర్లో ఒక మాట ఈ వక్స్ బోర్డ్ ముస్లింలకి కరెక్టే కానీ ఇందులో కూడా రెండు ఉన్నాయి. సున్నీ వక్స్ బోర్డ్, షియా వక్ఫ్ బోర్డ్. -కుశక్ బకుల్ రింపోచే.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.


At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Tags

Post a Comment

2 Comments
  1. ఒరేయ్ ఏంట్రా ఈ పనికిమాలిన రాతలు
    ఏం చదువుకున్నార్రా నాయనా మీరు..
    వక్ప్ బోర్డు ఏదైనా భూమిని 'మాది' అనుకుంటే వాళ్ళది అయిపోతుందా.. ఇలాంటి పిచ్చి రాతలు రాసి ప్రజల మెదళ్లలో బాగా విషం నింపాలి..

    ReplyDelete
    Replies
    1. seems you are well educated, read act. once the wakf declares a property a their, it is final. you cannot sell or pledge your property. Even the court don't accept your case for trial. Many instances are cited go through. Don't spread lies.

      Delete
Post a Comment
To Top