Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఖోంగ్జోమ్ ఆంగ్లో-మణిపూర్ యుద్ధం, కియోంఝర్ తిరుగుబాటు - Anglo-Manipur War - 1891 and odisha keonjhar war

ఖోంగ్జోమ్ ఆంగ్లో-మణిపూర్ యుద్ధం, కియోంఝర్ తిరుగుబాటు: భారతదేశ స్వాతంత్య్రం కోసం వందలాది వీరులు ప్రాణత్యాగం చేసిన వేళ. భారతదేశాన...

ఖోంగ్జోమ్ ఆంగ్లో-మణిపూర్ యుద్ధం, కియోంఝర్ తిరుగుబాటు: భారతదేశ స్వాతంత్య్రం కోసం వందలాది వీరులు ప్రాణత్యాగం చేసిన వేళ. భారతదేశానికి స్వాతంత్ర్యం ఒక్కరోజులోనో లేదా ఏదో ఒక వ్యక్తి కృషితోనో సిద్దించలేదు. అనేక ఏళ్లపాటు లెక్కలేనంత మంది ఎన్నో త్యాగాలు చేయాల్సి వచ్చింది. బ్రిటిష్ పాలనపై చెలరేగిన అనేక తిరుగుబాట్లు దాదాపు 200 ఏళ్ల బానిసత్వ చరిత్ర అంతటా మనకు గోచరిస్తాయి. వాటి అణచివేతకు బ్రిటిష్ పాలకులు చేయని ప్రయత్నమంటూ ఏదీ లేదు. ఫలితంగా ఎందరు వీరులు మరణించారో లెక్కలేదు. భారతదేశ చరిత్రలో అటువంటి సంఘర్షణలకు మణిపూర్ లోని ఖోంగ్జోమ్, ఒడిశాలోని కియోంఝర్ ప్రత్యక్ష నిదర్శనాలు.

దేశం కోసం త్యాగాలు చేసినవారు చిరంజీవులుగా మిగిలిపోతారు. ఆ మేరకు స్ఫూర్తిప్రదాతలుగా మారడమేగాక తరం నుంచి తరానికి తమ త్యాగ పరిమళాలను వెదజల్లుతూంటారు. మూడు ముఖ్యమైన ఉద్యమ స్రవంతుల నిర్విరామ కృషి ఫలంగా భారతదేశం వందలాది సంవత్సరాల బానిసత్వం నుంచి విముక్తి పొందింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత వ్యాసంలో స్వాతంత్య్ర అమ్మత్ మహోత్సవాలకు సంబంధించిన ఇటువంటి రెండు పోరాటలను తెలుసుకుందాం. వాటికి చరిత్ర పుటల్లో సముచిత స్థానం లభించి ఉండకపోవచ్చు. కానీ, అవి బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను బలంగా కదిలించాయి. ఈ మేరకు మణిపూర్ లోని ఖోంగ్జోమ్, ఒడిశాలోని కియోంఝర్ లలో నాటి స్వాతంత్య్ర పోరాట గాథలు మనలను ఆకట్టుకుంటాయి...

ఖోంగ్జోమ్ లో బ్రిటిషర్లపై వీరోచితంగా పోరాడిన మణిపూర్ యోధులు: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లోని ఖోంగ్జోమ్.. బ్రిటిష్ పాలనను ఆత్మరక్షణలోకి నెట్టిన సాయుధ తిరుగుబాటుకు పుట్టినిల్లు. దేశ చరిత్రలో ఈ యుద్ధం అత్యంత ముఖ్యమైన సంఘటనలలో ఒకటి. మణిపూర్ వంటి ఒక చిన్న రాష్ట్రం నుంచి అనేక మంది ప్రజలు శక్తిమంతమైన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. అలాగే మాతృభూమి ఆత్మగౌరవం, ప్రతిష్ట, సార్వభౌమాధికార పరిరక్షణలో భాగంగా బ్రిటిష్ వలసరాజ్య విస్తరణపై యుద్ధంలో తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. "సూర్యుడు అస్తమించడు' అనే బ్రిటిష్ సామ్రాజ్య నినాదం ఒక ఆకర్షణీయ పదబంధం మాత్రమే కాదు అది వాస్తవం కూడా మణిపూర్ వంటి చిన్న రాష్ట్రం బ్రిటిషర్లతో పోరాడటమంటే ఒక్కటే అర్థం మణిపూర్ ఓటమి. అయినప్పటికీ పరాక్రమశాలురైన మణిపూర్ యోధులు పట్టు వీడలేదు.

నిజానికి మణిపూర్ ను అదుపులో ఉంచగలమని మొదట్లో బ్రిటిష్ ప్రభుత్వం భావించినా, అది అసాధ్యమని త్వరలోనే తేలిపోయింది.. అలాంటి పరిస్థితుల్లో బ్రిటిష్ వారు 1890 మార్చి 22న మొత్తం 400 మంది గూర్ఖా సైనికులను మణిపూర్ కు పంపాడు. అటుపైన ఆ పటాలం 1891 మార్చి 24న మణిపూర్ లోని కాంగ్లా ప్యాలెస్ పై దాడి చేసింది. బ్రిటిష్ వారి ఆధర్మ వైఖరి ఫలితంగా అనేక నుంది మరణించగా మణిపూర్ బ్రిటిష్ దళాల మధ్య సాయుధ పోరాటం ఉవ్వెత్తున ఎగసింది. ఆంగ్ల సైన్యం వద్ద బాంబుల వంటి ఆధునిక ఆయుధాలుండగా మణిపూర్ సైన్యం కత్తుల వంటి సంప్రదాయక ఆయుధాలతో తలపడింది.. అయినప్పటికీ మణిపూర్ సైన్యం మొక్కవోని సాహసంతో బ్రిటిష్ వారిపై పోరాడింది. తొలిదశ యుద్ధంలో బ్రిటిష్ ఓడిపోయి, లొంగుబాటు ప్రదర్శించిన రెండో దశలో విజయం సాధించారు.

మణిపూర్ సైన్యం వీరోచిత పోరాటం చేసినా, 1891 ఏప్రిల్ 25న ఖోంగ్జోమ్ లో ఓడిపోగా చాలా మంది వీర యోధులు మరణించారు. ఇది భారత స్వాతంత్య్ర్య పోరాట చరిత్రలో అత్యంత భీకర యుద్ధాలలో ఒకటిగా పరిగణించబడింది. మణిపూర్ లోని ఖోంగ్జోమ్ లోగల లేదా హిల్స్ లో జరిగిన యుద్ధం కాబట్టి ఆ రోజును 'ఖోంగ్జోమ్ డే'గా వ్యవహరిస్తారు. ఆ మేరకు 1891 ఏప్రిల్ 27వ యుద్ధ పరిసమాప్తి అనంతరం మణిపూర్ బ్రిటిష్ ప్రభుత్వ ప్రత్యక్ష నియంత్రణలోకి వచ్చింది.

యుద్ధానంతరం బ్రిటిష్ ప్రభుత్వం అనేక మందిపై తూతూమంత్రపు విచారణ చేయించి, మరణశిక్ష విధించింది. ఈ మేరకు యువరాజు టికీంద్రజిత్, తంగల్ జనరల్ 1891 ఏప్రిల్ 13న ఉరితీయబడ్డాడు. అంతేకాదు, యువరాజు తోపాటు మరో నలుగురిని ఉరితీసిన బ్రిటిష్ ప్రభుత్వం మరో 22 మంది సహా కులచంద్రకు బహిష్కరణ శిక్ష విధించి అండమాన్ దీవుల్లో కారాగారానికి పంపింది. మణిపూర్ ప్రజల శౌర్యప్రతాపాలు చూసి బ్రిటిష్ వారు నివ్వెరపోయారంటారు. మణిపూర్ సైన్యం లోని ఖోంగ్జోమ్ లో వీర సైనికులు తమ ప్రాణత్యాగం ద్వారా భవిష్యత్తు తరాలు స్వేచ్ఛావాయువులు పీల్చుకునేలా చేశారు. కాగా, బ్రిటిష్ సామ్రాజ్యంలో భారత రాష్ట్రాలను విలీన ప్రక్రియ 1757లో ప్లాసీ యుద్ధంతో ప్రారంభం కాగా, 1891లో ఖోంగ్జోమ్ యుద్ధంతో పూర్తయింది. ఈ యుద్ధం తర్వాత బ్రిటిష్ సామ్రాజ్య నియంత్రణలోకి వచ్చిన చివరి భారత ఉపఖండ రాష్ట్రంగా మణిపూర్ జాబితాలోకి ఎక్కింది. ఈ యుద్ధాన్ని 1891 ఆంగ్లో మణిపూర్ యుద్ధంగా పిలుస్తారు. మణిపూర్ లోని ఖోంగ్జోమ్ లో 2016 ఏప్రిల్ 23న అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ యుద్ధ స్మారకాన్ని ఆవిష్కరించారు.

కియోంఝర్ లో బ్రిటిషర్లకు సవాలు విసిరిన భుయాన్.. జువాంగ్ గిరిజన తిరుగుబాటు: ఒడిశాలోని కియోంఝర్ భుయాన్, జువాంగ్ గిరిజన తెగల తిరుగుబాటు బ్రిటిష్ పాలనకు సవాలు వినరటమేగాక అంతం చేసింది. వాస్తవానికి కియోంఝర్ లోని భుయాన్, జువాంగ్ ప్రజల ఆకాంక్షలు, సంప్రదాయాలకు విరుద్ధంగా కొత్త రాజును బ్రిటిష్ ప్రభుత్వం సింహాసనం ఎక్కించింది. ఆ మేరకు స్థానిక ప్రజలు నిరాకరించిన రాజు ద్వారా బ్రిటిష్ వారు పాలన సాగించాలని తలపోశారు.

కొత్త రాజు ప్రజల కోసం కాకుండా, కేవలం బ్రిటిష్ వారి ప్రయోజనాల నిమిత్తమే ఉన్నానన్నట్లు వ్యవహరించాడు. తదనుగుణంగా గద్దెనెక్కిన వెంటనే ఇష్టానుసారం పన్నులు విధించి, బలవంతపు వసూళ్లు ప్రారంభించారు. ఈ అన్యాయాన్ని సహించలేని జువాంగ్, భుయాన్ తెగల ప్రజలు 1868 ఏప్రిల్ 21న రత్నానాయక్, నందా నాయక్ ల నేతృత్వంలో బ్రిటిష్ వారితోపాటు కొత్త రాజు దోపిడీని సవాలు చేస్తూ సాయుధ తిరుగుబాటు చేశారు.

కియోంఝర్ లో బ్రిటిష్ వారిపై తిరుగుబాటుకు ఆ జిల్లాలోని తార్పూర్ గ్రామంలో 1820లో జన్మించిన రత్నానాయక్ నేతృత్వం వహించాడు. రత్నానాయక్ భుయాన్ తెగ కుటుంబికుడు కాగా, నందా నాయక్, నందా ప్రధాన్, బాబా నాయక్, దశరధి కున్వర్, పొదూ నాయక్ తదితరులు అతనికి మద్దతు నిలిచారు. స్థానిక రాజుతోపాటు బ్రిటిష్ పాలకుల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఈ తిరుగుబాటు తలెత్తింది. ఈ పరిస్థితుల నడుమ తిరుగుబాటుదారులు 1868 ఏప్రిల్ 28న కియోంఝర్ మార్కెట్ ను దోచుకోవడమేగాక రాజ సౌధంపై దాడి చేశారు. అనంతరం రాజు, దివాన్ సహా 100 మంది సైనికులను బందీలుగా పట్టుకుపోయారు.

దీంతో ఈ తిరుగుబాటును కఠినంగా అణచివేయాలని నిర్ణయించుకున్న బ్రిటిష్ పాలకులు 1868 మే 7న కియోంఝర్ కు సైన్యాన్ని పంపారు. ఈ సైనిక దళానికి నాటి సింగ్బూమ్ డిప్యూటీ గవర్నర్ డాక్టర్ డబ్ల్యు-హైస్ నాయకత్వం వహించారు. ఈ సైనిక దళం వచ్చీరాగానే గిరిజన ప్రజలపై దాడి చేయడంతో తిరుగుబాటు ఉధృతమైంది. దీంతో ఆగ్రహించిన రత్నానాయక్ నేతృత్వంలోని తిరుగుబాటుదారులు దివాన్ను అంతం చేశారు. ఈ ఓటమిని సహించలేకపోయిన హైస్ దీన్ని ఒక సవాలుగా మార్చడంతో గిరిజన తెగల ఇళ్లకు నిప్పు పెట్టడానికి బ్రిటిష్ పాలకులు ఉత్తర్వులు ఇవ్వగా, దాన్ని అమలుపరిచాడు.

దీంతోపాటు "మీరంతా వెంటనే లొంగిపొండి.. లేదా అందర్నీ చంపేస్తాం " అంటూ హైస్ ఒక బెదిరింపు ప్రకటన జారీ చేశారు. కానీ, తిరుగుబాటుదారులు దీన్ని పట్టించుకోకపోగా, చాయ్ బసా- కియోంఝర్ సంధాన రహదారిని తెగ్గొట్టారు. ఈ ఉదంతంతో ఛోటా నాగ్ పూర్ నుంచి కమిషనర్ కల్నల్ ఇ.టి.డాల్టన్ ను బ్రిటిష్ ప్రభుత్వం కియోంఝర్ పంపింది. కానీ, కొండ ప్రాంతం కావడంతోపాటు అక్కడి ఉష్ణోగ్రతను భరించలేక ఆయన అక్కడికి చేరలేకపోయాడు. దీంతో పొరుగు రాజ్యాం రాజు సహకారంతోపాటు భారీ సైన్యంతో బ్రిటిష్ పాలకులు తిరుగుబాటు అణచివేతకు సిద్ధమయ్యారు. ఈ మేరకు జనయ్, మయూర్ భంజ్, పల్లాడా, ఢెంకణాల్ రాజ్యాల సైన్యాలు అక్కడికి వెళ్లాయి. మరోవైపు కటక్ కమిషనర్ టి.ఇ.రెబన్సా ను బ్రిటిష్ ప్రభుత్వం కియోంఝర్ పంపింది. తిరుగుబాటుదారులు లొంగిపోవాలని ఆయన ఆదేశించగా, రత్నానాయక్ తిరస్కరించి తుదిరాకా పోరాటం కొనసాగించారు.

చివరకు భుయాన్ తెగను రక్షించడం కోసం రత్నానాయక్, నందా నాయక్ లొంగిపోయారు. బ్రిటిష్ ప్రభుత్వం వారిద్దరినీ ఉరి తీసింది. అంతేకాకుండా, రాణి విష్ణుప్రియా దేవితోపాటు ఆమెకు మద్దతిచ్చిన తిరుగుబాటుదారులను కారాగారానికి పంపింది. అనంతరం ధరణీధర్ నాయక్ ఈ ఉద్యమానికి సరికొత్త ఉత్తేజమిచ్చిన నేపథ్యంలో దీని ప్రభావం దేశమంతటా విస్తృతంగా వ్యాపించింది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.ఆజాదీ కా అమృత్ మహోత్సవం, భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు, దేశం కోసం పోరాడిన వీరులు, స్వాతంత్ర్య సమరయోధుల గురించి, భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు, స్వాతంత్ర్య సమరయోధులు పేర్లు, త్యాగమూర్తులు మరియు  గొప్ప వ్యక్తిత్వం కలవారి జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి మన వెబ్ సైట్ ని అందరికీ పంపగలరు.

ప్రాణాయామం ఉపయోగాలు, అంతర్జాతీయ యోగా దినోత్సవం, గుండె జబ్బులకు కారణాలు నివారణకు యోగాసనాలు, ఆయుష్షు పెంచే సూర్య నమస్కారలు, సూర్య నమస్కారాలు ఎలా చేయాలి, యోగాసనాలు, ప్రాణాయామం – రెండింటిని కలిపి చేసేవే సూర్యనమస్కారాలు. సూక్ష్మ వ్యాయామం – యోగసనాలకు మధ్యలో సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యనమస్కారాల వలన శరీరంలోని అవయవాలన్నీ బాగా వంగుతాయి. అందువలన నిత్యజీవితంలో, నడకలో, కూర్చోవడంలో, పడుకోవడంలో, శరీరం ఉండాల్సిన స్థితిలో సహజత్వం ఇటువంటి సమాచారం కూడా మన మెగామైండ్స్ వెబ్ సైట్ లో లభిస్తుంది..

No comments