Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ప్రధాన మంత్రి జన ఔషది కేంద్రం ఎలా అప్లై చేసుకోవాలి

మోదీ ప్రభుత్వం జన్ ఔషధి కేంద్రాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. వీటి సంఖ్యను రానున్న రోజుల్లో పెంచాలని భావిస్తోంది. 10,000 జన్ ఔషధి...

మోదీ ప్రభుత్వం జన్ ఔషధి కేంద్రాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. వీటి సంఖ్యను రానున్న రోజుల్లో పెంచాలని భావిస్తోంది. 10,000 జన్ ఔషధి కేంద్రాలు లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. మోదీ సర్కార్ తక్కువ ధరకు జన్ ఔషధి కేంద్రాల ద్వారా ప్రజలకు మెడిషన్స్ అందిస్తోంది.

జన్ ఔషధి కేంద్రాలను ప్రారంభించే వారికి మోదీ సర్కార్ రాయితీలు కూడా అందిస్తోంది. దాదాపు రూ.7 లక్షల వరకు రాయితీని సొంతం చేసుకోవచ్చు. కొత్తగా జన్ ఔషధి కేంద్రాన్ని ప్రారంభిస్తే రూ.5 లక్షల వరకు రాయితీ వస్తుంది. అదే మీరు కేంద్ర ప్రభుత్వం సూచించిన జిల్లాలో తెరిస్తే మరో రూ.2 లక్షలు ఎక్కువ రాయితీ పొందొచ్చు.

అంటే మొత్తంగా దాదాపు రూ.7 లక్షల వరకు రాయితీని సొంతం చేసుకోవచ్చు. అలాగే మహిళలు, వికలాంగులు, ఎస్సీ, ఎస్టీ వారు జన్ ఔషధి కేంద్రాన్ని తెరిస్తే.. వారికి కూడా రూ.7 లక్షల వరకు రాయితీ వస్తుంది. జన్ ఔషధి కేంద్రాన్ని తెరిస్తే.. ఫర్నీచర్ సహా ఇతర ఖర్చుల కోసం కేంద్రం రూ.1.5 లక్షల వరకు అందిస్తుంది.

కంప్యూటర్లు, ప్రింటర్లు వంటి వాటి కోసం రూ.50 వేలు ఇస్తుంది. ఇక జన్ ఔషధి కేంద్రాల ద్వారా విక్రయించే మెడిసిన్స్‌పై 20 శాతం వరకు కమిషన్ వస్తుంది. ఇది కాకుండా ప్రతి నెలా అమ్మకాలపై 15 శాతం ప్రోత్సాహకం లభిస్తుంది. కాగా జన్ ఔషధి కేంద్రాల్లో మెడిసిన్స్ బయటి కన్నా 90 శాతం వరకు తక్కువ ధరకే లభిస్తాయి. మీరు రూ.5 వేలు ఫీజు చెల్లించి జన్ ఔషధి కేంద్రాన్ని ఓపెన్ చేయొచ్చు.

ఫార్మసిస్ట్‌లు, డాక్టర్లు, ప్రైవేట్ హాస్పిటల్స్, స్వయం సహాయక గ్రూపులు, ఎన్‌జీఓలు, ట్రస్ట్‌లు ఇలా ఎవరైనా ఈ మెడికల్ స్టోర్లను ఓపెన్ చేయొచ్చు. ఇందులో 900 రకాల మెడిసన్స్ అందుబాటులో ఉంటాయి. 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ షాపులను ఏర్పాటు చేయాలి

జన్ ఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటే లైసెన్స్ ఉండాలి. దీని కోసం అప్లై చేసుకోవాలి. http://janaushadhi.gov.in/ ఈ వెబ్‌సైట్‌లోకి వెల్లి ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, అప్లికేషన్ ఫిల్ చేసి, జనరల్ మేనేజర్ (ఏఅండ్ఎఫ్) ఆఫ్ బ్యూరో ఆఫ్ ఫార్మా పబ్లిక్ సెక్టార్ అండర్‌టెకింగ్ ఆఫ్ ఇండియాకు దీన్ని పంపించాలి. వెబ్‌సైట్‌లోనే అడ్రస్ ఉంటుంది.

జన్ ఔషధి కేంద్రాల్లో మార్చిలో రూ.42 కోట్లు, ఏప్రిల్‌లో రూ.52 కోట్ల వ్యాపారం జరిగింది. ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి యోజన పథకంలో భాగంగా ఈ మెడికల్ షాపులు ఏర్పాటవుతున్నాయి.
జనఔషధి కేంద్రాలు మూడు రకాలుగా ఉంటాయి. మొదటి కేటగిరీలో ఎవరైనా వ్యక్తిగతంగా లేదా ఫార్మాసిస్ట్, డాక్టర్, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ జనఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేయొచ్చు.
రెండో కేటగిరీలో ట్రస్టులు, ఎన్‌జీఓలు, ప్రైవేట్ ఆస్పత్రులు, సొసైటీలు, స్వయం సహాయక గ్రూపులు జనఔషధి కేంద్రాన్ని తెరవచ్చు.
మూడో కేటగిరీలో రాష్ట్ర ప్రభుత్వాలు నామినేట్ చేసిన ఏజెన్సీలు ఏర్పాటు చేయొచ్చు.
ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తప్పనిసరి. 
ఆంధ్రప్రదేశ్ లో 400 పైన కేంద్రాలు అప్లై చేసుకోవచ్చు అలాగే తెలంగాణ లో కూడా 350 కేంద్రాలు అప్లై చేసుకోవచ్చు..
వినియోగ భారతి అనే సంస్థ మీకు సహాయపడగలదు... 
For English

PM Jan Aushadhi Kendra Documents List :

  1. At first for the person
  • Aadhar Card
  • PAN Card
  • SC/ST Certificate (if any)
  • Physical Disability Certificate (if any)
  • Pharmacist Registration Certification

2. Then, For Firm/ Institutions/ NGO/ Hospitals etc.

  • Aadhar Card
  • PAN Card
  • Pharmacist Certification
  • Registration Certificate of Organization
  1. At last, for Government Nominated Agency :
  • Registration Certificate
  • Aadhar Card
  • Pharmacist Registration Certification
  • PAN Card

PM Jan Aushadhi Kendra Form online

Process of PM Jan Aushadhi Kendra Registration 2022 :

  • Firstly, the applicant should go through the Official Website for the Pradhan Mantri JanAushadhi Kendra Campaign.
Apply for PMBJK
Apply for PMBJK
  • Then on the home page click on the link available in the main menu for Registration.
  • After that click on the Janaushadhi Kendra Online Registration.
PM Jan Aushadhi Application Form
PM Jan Aushadhi Application Form
  • Before this make your login id and password by registering yourself as a new user on the official page.
  • After that go for the option available Get Application Form
  • You need to select the type of applicant also.
  • Then fill in the details asked in the given field. After that click on Go to Next Step.
  • A new page appears on your system. Here you need to click on Show All Requested Form.
  • So you need to fill in the details asked in the application form
  • Also, upload the document scanned copy required for completing the registration.
  • At last click on the submit button.

One reference number has been generated for your application. Save it or take the printout for further use.

Official PortalClick here
MPNRC HomeClick here

No comments