అదే "మాధవ్‌పూర్ జాతర" గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో సముద్రానికి సమీపంలోని మాధవపూర్ గ్రామంలో జరుగుతుంది. ప్రతి సంవత్సరం రామ నవమి నాడు ప్రారంభమయ్యి సాంస్కృతిక ఉత్సవం జరుగుతుంది. కృష్ణుడి విగ్రహాన్ని మోసే రంగురంగుల రథం గ్రామాన్ని ప్రదక్షిణ చేస్తుంది. ఒక వారం పాటు జాతర జరుగుతుంది. వారం రోజుల పాటు జరిగే మాధవపూర్ జాతరకు ఈశాన్య రాష్ట్రాల నుండి అనేకమంది కళాకారులు, హస్తకళకు సంబంధించిన కళాకారులు కూడా వస్తారు. అదేంటి గుజరాత్ లో జరిగే ఈ జాతర కు ఈశాన్య రాష్ట్రాల నుండి రావడమేంది అనుకుంటున్నారా. దీని వెనుక ఒక పురాణకథ వుంది అది చరిత్ర కూడా అందుకే వేల సంవత్సరాల నుండి ఈ జాతర జరుగుతుంది.
ఈ జాతరలో ఈశాన్య ప్రాంతాల నుండి ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ మరియు మణిపూర్ నుండి వచ్చిన కళాకారులు అద్భుతమైన జానపద సాంస్కృతిక ప్రదర్శనలను చేస్తారు. మణిపూర్ నుండి వచ్చిన సంగీత బృందం ఖుల్లాంగ్ ఇషే మరియు నాట్ జెనెలో రుక్మిణికి సంబంధించిన పాటలను పాడుతారు. అరుణాచల్ మరియు మణిపూర్ నుండి రుక్మిణి-కృష్ణ పురాణాల ఆధారంగా నృత్య-నాటకాలు మరియు అరుణాచల్ నుండి మిష్మి తెగకు చెందిన జానపద నృత్యాలు విభిన్న కచేరీలలో భాగంగా ఉంటాయి.
తూర్పు, పడమరల మధ్య ఉన్న ఈ లోతైన సంబంధం మన వారసత్వం. కాలంతో పాటు ఇప్పుడు ప్రజల కృషితో మాధవపూర్ జాతరకు కొత్తదనం కూడా తోడవుతోంది. వధువు వైపు వారిని ఘరాతీ అని పిలుస్తారు. ఈశాన్య ప్రాంతాల నుండి చాలా మంది ఘరాతీలు ఈ జాతరకు రావడం జరుగుతుంది. నలుగురు చంద్రుల వెన్నెలలాగా ఈ జాతర అందాలు పొందుతుంది. ఒక వారం పాటు భారతదేశ తూర్పు, పశ్చిమ సంస్కృతుల సమ్మేళనమైన ఈ మాధవపూర్ జాతర ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్‌కు చాలా అందమైన ఉదాహరణ. మనం కూడా ఎప్పుడైనా ఒక శ్రీ రామనవమి కి ఈ జాతరలో పాల్గొందాం ఏకత్వాన్ని చాటుదాం. జై హింద్. రాజశేఖర్ నన్నపనేని.
By Train Porbandar has a railway station which has connecting trains to places like Rajkot, Ahmedabad and Mumbai.
By Air Porbandar has a domestic Airport which has connecting flights to places like Ahmedabad and major cities of India.