Type Here to Get Search Results !

హిందూ సమాజం పై సాంస్కృతిక దాడి ఎవరు చేస్తున్నారు? - MegaMinds

హిందూ సమాజం పై సాంస్కృతిక దాడి (మొదటి భాగం):
ఒక మనిషి శరీరం లో ఎలా అయితే ఆత్మ ఉంటుందో అలా ప్రతి దేశానికి కి ఒక ఆత్మ ఉంటుంది శరీరం లో నుండి ఆత్మ వెళ్ళిపోతే ఆ శరీరం ను శవం అంటారు మరి దేశం యొక్క ఆత్మ ఏమిటి అంటే ఆ దేశపు యొక్క సంస్కృతిని ఆ దేశం యొక్క ఆత్మగా మనం చెప్పుకోవచ్చు, అంటే ఒక వ్యక్తి శరీరంలో ఎన్నైనా మార్పులు జరగవచ్చు , శరీరంలో ఉన్న అవయవాలు రకరకాలుగా ఉండవచ్చు రంగుల్లో తేడా ఉండవచ్చు పని విధానంలో తేడా ఉండవచ్చు కానీ ఆ శరీరాన్ని కలిపి ఉంచి నడిపించేది ఆత్మ మాత్రం ఒకటే.

ఆదేవిధంగా ఈ దేశం అనే దేహంలో అనేక రకాలు అయిన వర్ణాలు, కులాలు, ప్రాంతాలు, పంథాలు, మతాలు ఉండవచ్చు కానీ మన దేశపు యొక్క ఆత్మ సంస్కృతి మాత్రం ఒక్కటే అదే హిందూ సంస్కృతి. ఈ హిందూ సంస్కృతి జీవన మూల్యాలు ఒక ఆరాధన పద్దతి, కులవృత్తులు, ఆహారపు అలవాట్లు, ఆరాధన పద్దతి ప్రకృతి అనుకూల జీవనం మరియు ఏకత్వంలో బిన్నత్వం ఇవన్నీ  ఇక్కడి సంస్కృతికి ఆధార బూతాలు అవుతాయి. ఆరాధనపద్దతులలో మన చుట్టూ వుండే రాయి రప్ప ప్రతీ జీవి నిర్జీవి అన్నింటిలో మన ఆ భగవంతుణ్ణి చూస్తాము ఈ భూమి  లో ఉన్న ప్రతి కణకణంకు ఇక్కడా సంస్కృతికి వారసులయిన రాముడు, కృష్ణుడు, పుణ్య తీర్థాలు, పుణ్య క్షేత్రాలతో అనుబంధం ఉన్నది. కాశ్మీర్ లో ఉన్న ఒక వ్యక్తి పేరు రాంసింగ్ అయితే తెలంగాణ లో ఉన్న వ్యక్తి   రాముడు అని పెరుపెట్టుకుంటారు, ఉత్తర భారతం లో ఉన్న ఒక మహిళ పేరు రాధ అని పెట్టుకుంటే దక్షిణ భారత దేశంలో ఉన్న మహిళ రాధిక, రాధమ్మ అని పేరు పెట్టుకుంటుంది. దేశ అఖండత్వంను సూచించే చతుర్ధామాలు ఇవి అన్ని ఈ దేశం లో ఉన్న అన్ని ప్రాంతాలను అంతర్లీనంగా ఒకే సంస్కృతి తో ముడి వేయబడి ఉన్నది అంటే ఈ దేశ అఖండతకు ఆధారం మన సంస్కృతి.

ఈ దేశం పై విదేశీయులు ఆక్రమణ చేసిన ప్రతిసారి మన దేశం యొక్క సంస్కృతిని బౌతికంగా, మానసికంగా నాశనం చెయ్యడం కొరకు ప్రయత్నం చేశారు. సంస్కృతికి మూలం అయిన గుడి, బడి, తల్లి ఒడిని నాశనం చేసే ప్రయత్నం చేశారు. మన దేశంలో  ఆధ్యాత్మికతను, వైజ్ఞానికతకు నిలయంగా అయిన కొన్ని వేల సంఖ్యలో ఉన్న దేవాలయాలను, ప్రపంచ మానవాళికి విద్యను అందించిన నలంద, తక్షశిలా వంటి మహా విద్యాలయాలను ధ్వంసం చేసి అనేకమంది మాతృమూర్తులను  చేరబట్టి మన సంస్కృతిని నాశనము చేసే ప్రయత్నం చేశారు.

అయితే ఈ రకమైన దాడి మనకు స్వతంత్రం వచ్చిన తరువాత కూడా మన సంస్కృతిపై  కొనసాగుతుంది 
మన సంస్కృతిపై దాడి చెయ్యడం కోసం మన చేతితోనే మన కంటిని పొడిచే విధంగా కుటిల ప్రయత్నాలు చెయ్యడం జరుగుతుంది. మొదటి దశలో మన సంస్కృతి లో ఉన్న వాటి పై తప్పుడు పుస్తకాలను ప్రచురిస్తారు,  RELIGEOUS ఫ్రీడమ్ అనే సంస్థ పుస్తకాలను ప్రింట్ చేసి ప్రచురించి మన దేశంలో ఉన్న కుహనా లౌకిక వాదులతో వాటిని అంగీకరింపచేసి వాటిని మన సమాజంలోకి ప్రవేశపెట్టిస్తారు ఉదాహరణకు రంగనాయకమ్మ  రామాయణం యెక్క పవిత్రతను దెబ్బతీసే విధంగా   రామాయణ విష వృక్షం అనే పుస్తకాన్ని రాయడం జరిగింది 
SOCIETY AGAINST GENASIDE అనే సంస్థ రిలీజియస్ లో చిన్న విషయాలను బూతద్దంలో వెతికి వాటిని తప్పుడు విషయాలుగా చూపించే ప్రయత్నం  చేస్తారు. వీళ్ళు అందరూ అమెరికా గూడాచారి సంస్థ  అయిన CIA కు రిపోర్ట్ చేస్తారు, ఇందులో కేవలం, CHRITIANITY వ్యక్తులనే తీసుకున్నారు. ఆ తరువాత  ఇస్లాం లో ఉన్న వ్యక్తుల ఒత్తిడి మేరకు కొద్దిమంది ముస్లిం SCHOLORS ను కూడా తీసుకున్నారు కానీ హిందువులకు మాత్రం ఈ సంస్థ లో కి చోటు కల్పించలేదు   భారతదేశంలో ని మత స్వేచ్ఛ, మత ఆచార వ్యవహారాలపై తప్పుడు కథనాలతో పుస్తకాలను రాసి వాటిని పబ్లిష్ చేసి పాఠ్యపుస్తకాలు గా పెడతారు. ఉదాహరణకు: వినాయకుడి  పై తప్పుగా పుస్తకం రాశారు దానికి రోమిల్లా తాపర్ అనే కమ్యూనిస్ట్ చరిత్రకారునితో  దాన్ని AUTHENTIC చెయ్యిమని అడిగారు. సహజంగా రోమిల్ల తాపర్ విదేశీ భావజాలంతో ప్రేరేపితం అయిన వ్యక్తి కాబటీ ఆ తప్పుడు పుస్తకాన్ని అంగీకరించింది ఆ తరువాత ఆ పుస్తకం ఇప్పుడు అనేక చోట్ల పబ్లిష్ చెయ్యబడింది.

GENERAL LORD WILIAM BENTINCK అనే బ్రిటిష్  గవర్నరు సతి సహగమునంపై నిషేధం విధించారు దీని పై దేశము లోని బ్రిటిష్  ప్రెసిడెన్సీ GOVERNER లే ఒప్పుకోలేదు ఎందుకంటే దేశం లో ఈ ఆచారం అప్పటికి  ఎక్కువగా లేదు. కేవలం కొన్ని రాజ వంశాలలో కొన్ని సంఘటనలకు ప్రతిక్రియాత్మకంగా మాత్రమే సతి సహగమనం జరిగింది అని చెప్పారు. PRESIDENCY GOVERNAR లు  5 సంవత్సరాల తరువాత కూడా సతి సహగమనం పై సంఘటన నమోదు కాలేదు అని వాళ్ళు ఉత్తరాలు రాయడం జరిగింది. సంధ్య జైన్ అనే ప్రముఖ రచయిత  2012 లో సతి సహగమనంపై ఒక పుస్తకం రాసింది ఇందులో సతి సహగమనం అనే ఆచారం దేశం లో ఎక్కడ లేదు అని చెప్పడం జరిగింది ఇప్పటివరకు ఈ పుస్తకాన్ని ఎవరు కూడా కౌంటర్ చెయ్యలేదు కూడా... దేశములో ఎక్కడో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకొని ఇక్కడి వ్యవస్థలోనే  ఉందని ఇక్కడి సమాజం అనాగరికమయినది అని చెప్పే ప్రయత్నం బ్రిటిష్ వాళ్ళు చేశారు. ఈ దేశం లో మహిళలకు స్వేచ్ఛ లేదని చదవనివ్వలేదని అభూత కల్పనలు ప్రచారం చేశారు కొన్ని దేశాలలో ఇప్పటికి కొన్ని దేశాలలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు కానీ మన దేశం లో మహిళలు రాజ్యాలు ఎలారు. నేటికి మన స్వతంత్ర భారతం లో కూడా మహిళను వాణిజ్య ప్రకటన లలో అసబ్యాంగా చూపిస్తూ మహిళల పట్ల పవిత్ర భావం పోయి చులకన భావం కలిగే విధంగా ప్రయత్నం చేస్తున్నారు.. వాలంటైన్స్ డే లాంటి రోజులను  ప్రోత్సహిస్తూ  సమాజం లో  విశృంఖలత్వాన్ని పెంచే ప్రయత్నం విదేశీ శక్తులు దేశం లో చేస్తున్నారు.  
పాఠశాలలో సర్వమత  సమానం  అనే పేరుతో క్రైస్తవ, ఇస్లాం పండుగలప్పుడు హిందూ విద్యార్థులకు ఫ్యాషన్ షో పేరుతో ఆయా మతాల వేషధారణాలను వేయించడం ఆ రోజు పాఠశాలలో పండుగలను నిర్వహించి చిన్నప్పుడే  సెమిటిక్ మతాల పట్ల ఆకర్షన పెరిగేవిదంగా ప్రయత్నం కొనసాగుతుంది. అదే సమయం లో హిందూ పండుగలప్పుడు ఇస్లాం, క్రైస్తవం కు  చెందిన విద్యార్థుల ను వాటిలో భాగస్వామ్యం చెందిచే విధంగా ఫ్యాషన్ షో లు నిర్వహించరు  కేవలం హిందు విద్యార్థులకు మాత్రమే సర్వమత సమానం అనే పేరుతో పరాయి మతాల ఆచారాలను చిన్నప్పుడునుండే హిందూ విద్యార్థులు దాడి కి గురి అవుతున్నారు. -రాజగోపాల్ కట్ట, 9490791726.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
  1. నిజమే బయటి వ్యక్తులతో పాటు విదేశీ భావజాల స్వదేశీ ముసుగు మేదావులు దేశ సాంస్కృతిక సాంప్రదాయలపై ఎక్కువ దాడి చేస్తున్నారు!

    వాక్ స్వాతంత్ర్యం, మత స్వేచ్చ, మానవ హక్కుల పేరు మీద ఈ దాడులు జరగడం గమనార్హం!!

    ReplyDelete

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..