Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

బెంగాల్లో హిందువులపై దాడులు - మమతే బాధ్యత వహించాలి - విశ్వ హిందూ పరిషత్ - MegaMinds

బెంగాల్ లో హిందువుల మాన ప్రాణాలకు హాని మరియు వేలాదిగా గృహ దహనాలు: దీనంతటికీ బాధ్యులు మమత బెనర్జీ మరియు ఆమె సర్కార్. పశ్చిమ బెంగా...

బెంగాల్ లో హిందువుల మాన ప్రాణాలకు హాని మరియు వేలాదిగా గృహ దహనాలు: దీనంతటికీ బాధ్యులు మమత బెనర్జీ మరియు ఆమె సర్కార్.

పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించి, ఫలితాలు వచ్చిన వెంటనే రాష్ట్రంలో అరాచకత పెరిగిపోయింది. ముస్లిం జిహాదీతత్వ మతోన్మాద శక్తులు లూటీలు చేయడం ఇళ్లకు నిప్పు పెట్టడం అనేక మందిని హత్య చేయడం పదుల సంఖ్యలో మహిళల్ని బలాత్కరించడం జరుగుతుంటే ఈ దుండగులకు సహకరిస్తున్న వారెవరు.., దీని వెనుక ఉన్న బలమైన శక్తి ఎవరని పరిశీలిస్తే స్పష్టంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కనిపిస్తున్నది.

గతంలో ఒక సభలో తమ పార్టీని వ్యతిరేకిస్తూ మరో పార్టీని సమర్ధించిన వారిని ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ సమర్థకులను బహిరంగంగా హెచ్చరిస్తూ ఎన్నికల అనంతరం కేంద్ర సాయుధ బలగాలు వైదొలిగిన తరువాత  మీ అంతు చూస్తాను, మీ సంగతి తేలుస్తాను, కార్యకర్తలారా మీరు ఎవరు ఊరుకునేది లేదు  అంటూ అరాచక తత్వాలను ప్రోత్సహిస్తూ సామాన్యులను బెదిరించడం చేసింది.

మమతా బెనర్జీ అటువంటి బెదిరింపులకు పాల్పడిన పరిణామమే వేలాది సంఖ్యలో హిందువుల యొక్క ఇళ్లను విధ్వంసం చేయడం, గృహ దహనాలకు పాల్పడటం. వందలాది బంగ్లాదేశీ చొరబాటుదారులు మరియు బర్మా నుంచి వచ్చిన రోహింగ్యా ముస్లింలు గుంపులు గుంపులుగా ఆయుధాలు చేతబూని హిందువుల గ్రామాలపై ఇళ్ల పై బడి యువకులు పిల్లలు వృద్దులు మహిళలు అని చూడకుండా కనిపించిన వారందరినీ భయంకరంగా కొడుతూ రక్తాలు ప్రవహింప జేస్తున్నారు. అనేక మంది మహిళలను బలాత్కరించి హత్యలు చేశారు ఇంకా అనేక గ్రామాలలో ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడుతూనే  ఉన్నారు.
ఈ సంఘటనలన్నీ ప్రభుత్వము మరియు పోలీసుల సంరక్షణలోనే జరుగుతున్నాయి కొన్నిచోట్ల దుండగులు పోలీసు వాహనాలలోనే రావడం గమనార్హం.

మమతా బెనర్జీ గత ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత వెంటనే ప్రజాస్వామ్య హక్కులు అంతరించిపోయాయి చట్టబద్ధమైన పోలీసు రక్షణ వ్యవస్థ అంతరించిపోయింది. బెంగాల్ లోని హిందువులు తమ మాన ప్రాణ రక్షణకోసం తమ సొంత దేశంలోనే శరణార్థులై పక్క రాష్ట్రాలైన అస్సాం బీహార్ జార్కండ్ రాష్ట్రలలోకి వలస వస్తున్నారు.

మమత సూచనల మేరకు  అనేకమంది తృణమూల్ కాంగ్రెస్ నాయకుల నాయకత్వంలో అనేక మంది గూండాలు పెట్రేగి పోయి సాక్షాత్తు భారత గృహ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి యొక్క వాహనశ్రేణిపై దాడులు చేసి మంత్రి యొక్క వాహనాన్ని నడిపే డ్రైవర్ తల పగల గొట్టారు. ఇంతటి విచ్చలవిడి గుండాయిజాన్ని అరాచకత్వాన్ని భారతజాతి వ్యతిరేకిస్తున్నది.

ఇంతటి విషమ పరిస్థితిలో ప్రతిరోజు అక్కడి అనేక మంది కార్యకర్తల ద్వారా బాధితులను రక్షించమంటూ వార్తలొస్తున్నాయి ఇది అక్కడి  భయంకరమైన పరిస్థితులకు నిలువుటద్దం.

ప్రజాస్వామ్య భారతదేశంలోని ఒక ముఖ్యమంత్రి ఇటువంటి నరసంహారాన్ని ప్రత్యక్షంగా ప్రోత్సహించి హిందువుల మరణాలకు  లూటీలకు, బలత్కారాలకు కారణం కావడం, గవర్నర్ గారు కేవలం హెచ్చరించి వదిలిపెట్టడం  ఏమిటి అని ప్రశ్నిస్తున్నాం.

మమతా బెనర్జీ వంటి అపరాధి అయిన ముఖ్యమంత్రిని దోషులైన పోలీసులు మరియు అధికారులను దర్యాప్తు జరిపి గుర్తించి తగిన శిక్షను విధించ వలసిందిగా బెంగాల్ రాష్ట్రం యొక్క హైకోర్టు న్యాయమూర్తి మరియు సుప్రీంకోర్ట్ ప్రత్యక్షంగా జోక్యం కల్పించుకుని అక్కడ జరిగిన ప్రతి సంఘటనను "సుమోటోగా" స్వీకరించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాము.

బెంగాల్ లో జరుగుతున్న ఈ హింస పట్ల మౌనంగా ఉండలేకపోతున్నాం.  విశ్వహిందూ పరిషత్ గొంతెత్తి నిరసన తెలియజేస్తున్నాం.

రాబోయే రెండు రోజులలో బీహార్ మరియు ఝార్ఖండ్ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాం.

జార్ఖండ్ మరియు బీహార్ రాష్ట్రాలను ఆనుకొని ఉన్న బెంగాల్ రాష్ట్ర జిల్లాల నుండి భయంతో పారిపోయి వస్తున్న వారికి ప్రభుత్వమే తగిన ఏర్పాట్లు కూడా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

            భవదీయ,
   ~ఆకారపు కేశవరాజు, విశ్వహిందూ పరిషత్ - పట్నా క్షేత్ర సంఘటన మంత్రి.( బీహార్ జార్ఖండ్ రాష్ట్రాలు.)

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments