Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

జాతీయ వాదం అంటే ఏమిటి - What is Nationalism in Telugu - megaminds

జాతీయ వాదం అంటే ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత దేశానికి ఎంతో విశిష్టత ఉంది. వివిధ దేశాల చరిత్ర లను మనం గమనిస్తే వాటి సరిహద్దులు దురాక...



జాతీయ వాదం అంటే ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత దేశానికి ఎంతో విశిష్టత ఉంది. వివిధ దేశాల చరిత్ర లను మనం గమనిస్తే వాటి సరిహద్దులు దురాక్రమణల ద్వారా ఏర్పడ్డవే. ఆ దేశాల నిర్మాణం వెనుక ఎవరో ఒక మూల పురుషుడు కనిపిస్తాడు ప్రపంచ దేశాలను గమనిస్తే వీటిలో చాలా వరకు 500-1500 సంవత్సరాల చరిత్ర కలవే కనిపిస్తాయి. నేడు ప్రపంచాన్ని శాసించాలని చూస్తున్న దేశాలేవీ అప్పటికి ఉనికిలో లేవు. చాలా దేశాల్లో నాగరికత పూర్తి స్థాయిలో వికసించనేలేదు. 16వ శతాబ్దం తర్వాతే ఐరోపాలో జాతి రాజ్యాల భావన పురుడు పోసుకుంది. కానీ భారత దేశ చరిత్ర ఇందుకు పూర్తిగా భిన్నం.

ప్రపంచంలోని అతి ప్రాచీన సంస్కతి, వారసత్వం ఉన్న దేశాల్లో భారత దేశం అగ్రస్థానంలో నిలుస్తుంది. ప్రాచీన కాలంలో భారతీయ సాంస్కతిక వైభవం ప్రపంచంలోని పలు ప్రాంతాలకు విస్తరించింది. కానీ ఇది దురాక్రమణల ద్వారా కాదు. ప్రపంచానికి ఆధ్యాత్మికం, వైద్యం, జ్యోతిషం, ఖగోళం, గణితం, సాహిత్యం, కళలు, జ్ఞాన సంపద లను అందించిన దేశం మనది. ఎందరో ఆధ్యాత్మిక గురువులు, వీరులు ఇక్కడ జన్మించారు. దేశ విదేశాల నుండి వచ్చిన విద్యార్థులు ఇక్కడి విద్యాలయాల్లో చదువుకునేందుకు వచ్చేవారు. ఓడ రేవుల ద్వారా వర్తక వాణిజ్యాలు ఎన్నో దూర దేశాలకు వ్యాపించాయి. ఈ వైభవాన్ని చూసి కన్నుకుట్టిన విదేశీ శక్తులు మన దేశంపై దండయాత్రకు దిగాయి. మన రాజుల అనైక్యత కారణంగా వందలాది సంవత్సరాల పాటు మనం పరాధీనం పాలయ్యాం.

కాల పరీక్షలో నిలబడిన జాతి మనది. గ్రీకులు, శకులు, కుషానులు, హూణులు, అరబ్బులు, మొగలాయీలు, ఐరోపా దేశాల వారు భారత దేశంపై దండెత్తారు. కర్కశంగా మత మార్పిడులకు పాల్పడ్డారు. వారు ఎంత క్రూరంగా పాలించినా మన జాతి సాంస్కతిక మూలాలను మాత్రం చెరపలేకపోయారు. విదేశీ దండయాత్రలు, పరాయి పాలనకు వ్యతిరేకంగా ఎందరో వీరులు పోరాటం సాగించారు. వీరి త్యాగాల పుణ్యమా అని మన దేశం ఆధ్యాత్మిక మూలాలను కోల్పోకుండా స్థిరంగా నిలబడింది. ప్రపంచంలో దండయాత్రలు, మతయుద్ధాల కారణంగా ఎన్నో జాతులు కాలగర్భంలో కలిసిపోయాయి.

కానీ వేలాది సంవత్సరాలుగా మన సాంస్కతిక వైభవం అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే వచ్చింది. విశాలమైన భారత దేశంలో విభిన్న మతాలు భాషలు, ఆచార వ్యవహారాలు వేరుగా ఉండవచ్చు. కానీ సంస్కతి సాంప్రదాయాల పరంగా ఉన్న భావ సమైక్యతే ఈ దేశానికి శ్రీరామ రక్షగా నిలిచింది. ఈ దేశ ప్రజల్లో కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకూ, అటక్‌ నుండి కటక్‌ వరకూ మనమంతా ఒకే జాతి, ఒకే దేశం అనే భావన తరతరాలుగా కొనసాగుతూనే వస్తోంది. భారత జాతీయవాదానికి ఈ భావనే మూలం.

జాతీయవాదాన్ని కాపాడుకోవం ఎలా? మొక్కై వంగనిది మానై వంగునా అంటారు. అందుకే చిన్నప్పటి నుండే విద్యార్థుల్లో జాతీయ భావాలను పెంపొందించాలి. మన దేశ చరిత్రను, సాంస్కతిక వైభవ విశిష్టతను వారికి అర్థమయ్యేలా చెప్పాలి. మన ధర్మాన్ని కాపాడిన మహనీయులు, స్వాతంత్య్రం కోసం పోరాడిన వీరులు, మహనీయుల చరిత్రను బోధించాలి. మన ధర్మం, ఆధ్యాత్మిక మూలాలను భావితరాలకు అందేలా కాపాడుకోవాలి. ధార్మిక చింతన పెంపొందించాలి. ముఖ్యంగా పెద్దలను గౌరవించడం, కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవశ్యకతను మన చిన్నారులకు బోధించాలి. మన జాతి పట్ల స్వాభి మానాన్ని పెంపొందించే విద్యా విధానాన్ని రూపొందించాలి. దేశభక్తి, జాతీయ భావం అంటే కేవలం భూభాగాలను కాపాడుకోవడం మాత్రమే కాదు.. మన సాంస్కతిక, ఆధ్యాత్మిక వారసత్వ సంపదను భావి తరాలకు అందించడం కూడా ముఖ్యం.

భారతదేశంలో విభిన్న మతాలు ఉండవచ్చు. కానీ ఇక్కడ ఎవరి మతాన్ని వారు స్వేచ్ఛగా అవలంబించవచ్చు. జాతీయతకు ఇది అవరోధం కాదు. మతం, జాతీయతలకు మధ్య తేడా ఉంది. దేశ సమగ్రత విషయంలో ఏదైనా సమస్య ఉత్పన్నమైన సమయంలో మతం కన్నా దేశమే ముఖ్యం అనే భావన అందరిలోనూ కలగాలి. ఈ భావనే జాతీయతను ప్రతిబింబిస్తుంది. జై హింద్.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments