Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మేము బతికితే, స్వేచ్ఛా జీవులుగానే బతుకుతాము రాణి చెన్నమ్మ - About Rani Chennamma in Telugu - megaminds

1857 తిరుగుబాటుకు చాలా ముందు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో అనేక యుద్ధాలు జరిగాయి. ఎంతో మంది వీరనారీమణులు ఈ యుద్ధాలకు నాయకత్వం వహించి, బ్రి...

1857 తిరుగుబాటుకు చాలా ముందు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో అనేక యుద్ధాలు జరిగాయి. ఎంతో మంది వీరనారీమణులు ఈ యుద్ధాలకు నాయకత్వం వహించి, బ్రిటీష్ సైన్యాలను గడగడలాడించి, వారికి ఓటమి రుచి చూపించారు. భారత స్వరాజ్య ఉద్యమంలో చెరగని ముద్ర వేసిన మహిళా యోధురాలు కిట్టూర్ రాణి చెన్నమ్మ. ఆమె భర్త శ్రీ మల్లసరాజ పాలనలో నాటి కర్నాటక రాష్ట్రంలోని ఇప్పటి బెల్గాం కు దగ్గరలో ఉన్న కిట్టూర్ బాగా అభివృద్ధి చెందడమే గాక, వ్యాపార కేంద్రంగా విరాజిల్లింది. అన్ని బాగానే ఉన్నాయి అనుకుంటున్న తరుణంలో ఆమె భర్తను కోల్పోయింది. కొంతకాలానికి కుమారుడు కూడా మరణించడం ఆమెను ఒంటరిని చేసింది. సరిగ్గా అదే అదునుగా ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవచ్చని బ్రిటీష్ వారు భావించారు. అప్పుడే శివలింగప్ప అనే బాలుణ్ని రాణి చెన్నమ్మ దత్తత తీసుకుని వారసుడిగా ప్రకటించింది.

అయినా సరే ఆర్థికంగా అభివృద్ధి చెందే రాజ్యాన్ని కబళించాలనే కుట్రతో బ్రిటీష్ ప్రతినిధి జాన్ ఠాక్రే ఆమె రాజ్యం మీద దాడికి యత్నించాడు. మేము బతికితే, స్వేచ్ఛా జీవులుగానే బతుకుతాము బ్రిటీష్ ప్రతినిధి జాన్ ఠాక్రేకు లేఖ పంపింది. లేఖలో ఆమె సందేశాన్ని చెవిన పెట్టుకుండా, వారికి అలవాటైన పాత పద్ధతిలోనే తన సైన్యంతో జాన్ ఠాక్రే కిట్టూర్ కోటను చుట్టుముట్టి, రాణి చెన్నమ్మను లోంగిపోవాలని కోరాడు. ఆ సమయంలో రాణి చెన్నమ్మ ఓ యోధుని వేషధారణలో తన సైన్యంతో బయటకు వచ్చింది. భీకర యుద్ధం మొదలై బ్రిటీష్ సైన్యం పరాజయాన్ని చవిచూడడమే కాదు, రాణి చెన్నమ్మ లేఖను చెవిన పెట్టని జాన్ ఠాక్రే మరణాన్ని బహుమతిగా పొందాడు. రాణి చెన్నమ్మ ఆ దాడిని సమర్థంవంతంగా తిప్పికొట్టింది.

ఇది బ్రిటీషర్లకు పెద్ద దెబ్బ, ఈ ఓటమితో బ్రిటీష్ వారిలో భయం మొదలైంది. తమ ఆధీనంలో ఉన్న మిగిలిన రాజ్యాలు కూడా కోల్పోవలసి వస్తుందేమోనని శంక పెరిగింది. మరో దాడి బలంగా చేయాలని నిర్ణయించుకుని పెద్ద సంఖ్యలో సైనిక బలగంతో చెన్నూర్ కోటను ముట్టడించారు బ్రిటీష్ వాళ్ళు. అంతే కాదు కుయుక్తులతో ఇద్దరు సైనికుల్ని తమ వైపు తిప్పుకుని వారి ద్వారా గన్ పౌడర్ స్థానంలో మట్టిని పెట్టించి మోసం చేశారు.

“కన్నడ రాజ్యలక్ష్మి బిడ్డలారా... ప్రాణాలను పణంగా పెట్టి, మరణాన్ని ముద్దాడేందుకు కూడా భయపడకుండా, మన మాతృభూమిని కాపాడుకోవాలి” అంటూ తన ఉత్తేజకరమైన ప్రసంగంతో బ్రిటీష్ సెన్యాలను ఎదుర్కొనే విధంగా తన ప్రజల్లో రాణి చెన్నమ్మ స్ఫూర్తిని నింపారు. కిట్టూర్ యోధులు తమ శక్తి మేర పోరాడినప్పటికీ, బ్రిటీష్ సైన్యం ఇప్పుడు మరింత ఎక్కువగా మోహరించడం, సైనికుల మోసం కారణంగా రాణి చెన్నమ్మ సైన్యం యుద్ధంలో ఓడిపోవలసి వచ్చింది. రాణి చెన్నమ్మకు నచ్చజెప్పి తమ దారికి తెచ్చుకునేందుకు బ్రిటీష్ వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఆమె అంగీకరించలేదు. ఫలితంగా జీవితాంతం ఖైదు కావలసి వచ్చింది.

అనంతరం 1829లో ఆ వీరయోధురాలు పరమపదించారు. ఇది బ్రిటీష్ వారి దృష్టిలో ఆమె ఓటమే కావచ్చు. కానీ మిగతా రాజ్యాల ప్రజల దృష్టిలో మాత్రం స్ఫూర్తి దాయక పోరాటం. రాణి చెన్నమ్మ ధైర్యం, బ్రిటీష్ వారిని ఓడించితీరాలనే సంకల్పం మిగతా రాజ్యాల్లోనూ స్ఫూర్తిని నింపాయి. బానిస శృంఖలాలు తెంచుకుని, బ్రిటీష్ దురాగతాలకు వ్యతిరేకంగా ముందుకు సాగేదిశగా వారిని ప్రేరేపించాయి. ప్రజల హృదయాల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిలించిన రాణి చెన్నమ్మ చిరస్థాయిగా వారి గుండెల్లో నిలిచిపోయింది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

1 comment