Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

సమర జ్వాల ప్రీతిలతా వడ్డేదార్ - About Preetilatha Vaddedar in Telugu - MegaMinds

1932వ సంవత్సరం తూర్పు బెంగాల్ లో స్వాతంత్ర్య  ఉద్యమం తారాస్థాయిని చేరుకుంది. అప్పటికే ఆంగ్లపాలకులు వందేమాతరం దెబ్బతగిలి ఉన్నారు,...

1932వ సంవత్సరం తూర్పు బెంగాల్ లో స్వాతంత్ర్య  ఉద్యమం తారాస్థాయిని చేరుకుంది. అప్పటికే ఆంగ్లపాలకులు వందేమాతరం దెబ్బతగిలి ఉన్నారు, విప్లవవీరులు సింహ గర్జన చేశారు. మాష్టర్ డా గా పిలువబడే సూర్యసేన్ నేతృత్వంలో 50 మంది యువ కిషోరాలు మాతృభూమి విముక్తి కోసం ‌నూనూగు మీసాల యవ్వనాన్ని‌ దేశం కోసం అర్పించడానికి సిద్దం అయ్యారు వారు చేసిన సాహసాలను దేశ ప్రజలు అప్పట్లో చిట్టాగాంగ్ వీర కిషోరాలుగా పిలిచేవారు. అలాంటి వారిలో 21 సంవత్సరాల బగబగమండే జ్వాల ప్రీతిలతా వడ్డేదార్.

చిట్టగాంగ్ దగ్గర పాటియా, దల్గాట్ లో ఓ మధ్యతరగతి కుటుంబంలో 5 మే,1911 నాడు ప్రతిభ, జగ్ బంధు వడ్డేదార్ దంపతులకు ప్రీతిలతా వడ్డేదార్ జన్మించింది. తల్లిదండ్రులు ఆమెకు మంచి విద్యను అందించారు. అలా చదువుకునే సమయంలో దేశం పరాయిపాలనలో మనం ఉన్నామని తెలుసుకుంది మరియు బ్రిటిష్ పాలకుల ఆగడాలు ఆమెను స్వతంత్ర స్వరాజ్య సంగ్రామం వైపు అడుగుల వేయించింది. విద్యార్థి దశలోనే ఆమెకు ఔత్సాహిక విప్లవాత్మక కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్న కొంత మంది మహిళలతో పరిచయం ఏర్పడింది. అలాంటి వారిలో లీలానాగ్ కూడా ఒకరు. ఢాకా విశ్వ విద్యాలయంలో ఆమె విద్యార్థిని. అంతేకాదు సుభాష్ చంద్రబోస్ కు సహచరురాలు కూడా. ఆమె దీపాలి సంఘం అనే విప్లవ సమూహాన్ని స్థాపించారు. ఈ సంస్థ మహిళలకు పోరాటాల్లో శిక్షణనిచ్చేది. తర్వాత ప్రీతిలత ఈ సంస్థలోనే క్రీయాశీలక సభ్యులయ్యింది. 

ఉన్నత విద్య కోసం కలకత్తాలోని బెతున్ కాలేజీకి వెళ్లిన సమయంలో ‘మాస్టర్ డా’గా ప్రసిద్ది చెందిన ప్రముఖ విప్లవ నాయకుడు సూర్య సేన్ నుంచి ఆమె ప్రేరణ పొందింది. మాస్టర్ డా నేతృత్వంలోని తిరుగుబాటు బృందంలో తనను చేర్చుకోవాలని ఆమె కోరింది. ప్రారంభంలో ఆమెను బృందంలోకి తీసుకునేందుకు సూర్యసేన్ సంకోచించాడు. బ్రిటీష్ పాలన నుంచి భారతదేశాన్ని విడిపించాలన్న ఆమె అచంచలమైన దృఢ నిశ్చయాన్ని గమనించిన ఆయన తర్వాత అంగీకరించాడు. 

కలకత్తాలోని రహస్యంగా ఓ బాంబులు తయారు చేసే కర్మాగారం నుంచి బాంబు కేసింగ్ లను సేకరించే అత్యంత కష్టమైన పనిని ప్రీతిలతాకు తమ నియామక ప్రారంభంలో అప్పగించాడు. ఆ తర్వాత ఆమె బెంగాల్ లోని వివిధ రహస్య సంఘాలకు చెందిన మహిళలు హాజరైన మహిళా సమావేశాలను నిర్వహించడం ప్రారంభించింది. జైళ్ళ పాలైన విప్లవ యోధులకు బంధువుగా నటిస్తూ, వారిని కలిసి, రహస్య సమాచారం సేకరించడం ప్రారంభించింది. ఆమె ప్రతి పనిని అంకితభావంతో నేర్పుగా చేసేది. 

పహర్తలి లో‌ బ్రిటిష్ పాలకుల ఒక గెస్ట్ హౌస్ (club house) తాగి తందనాలు ఆడే ఒక భవనాన్ని‌‌ నిర్మించారు. ఆ భవనం దగ్గర గోడమీద ఇలా వ్రాశారు కుక్కలు మరియు భారతీయులకు ఇటువైపు ప్రవేశం లేదు అని అది తెలిసిన మాష్టర్ డా వీరకిషోరాలకు నెత్తురు మరిగింది పగ తీర్చుకోవాలనుకున్నారు. 1930లో సూర్యసేన్ తమ ప్రఖ్యాత చిట్టగాంగ్ ఆయుధ దాడులకు ప్రణాళికలను రచించాడు ప్రీతిలత తమ తోటి విప్లవకారులతో కలిసి, ఈ సాహసోపేతమైన మిషన్ లో చురుగ్గా పాల్గొంది. ఈ సంఘటన తర్వాత బ్రిటీష్ వాళ్ళు ఆమె బృందం మీద పూర్తి బలగాలతో దాడి చేశారు. చాలా మందిని అరెస్టు చేయగా, ప్రీతిలతతో పాటు మరికొందరు సభ్యులు తప్పించుకోగలిగారు. 1932లో మరలా భారతీయుల పట్ల వివక్షాపూరిత వ్యవహారశైలికి చిహ్నమైన చిట్టగాంగ్ లోని పహర్తాలి యూరోపియన్ క్లబ్ హౌస్ మీద దాడి చేయాలని వారు నిర్ణయించుకున్నారు. ప్రీతిలత నిబద్ధత గల విప్లవయోధుల బృందాన్ని ఏర్పాటు చేసి, వారికి ఆయుధ శిక్షణ ఇచ్చి, దాడికి సన్నాహాలు ప్రారంభించింది.

1932, సెప్టెంబర్ 23న, ఆమె తన తోటి విప్లవకారులతో కలిసి బ్రిటీష్ ఆధిపత్యానికి చిహ్నమైన ఆ క్లబ్ హౌస్ మీద ధైర్యంగా దాడి చేసింది. భీకరంగా తుపాకీలతో గుళ్ళ వర్షం మొదలైంది. ఆ బుల్లెట్ల దాడికి తెల్లోళ్ళు పిచ్చెక్కిపోయారు, ఒక్కసారిగా బెంబేలెత్తారు అనేకమంది అక్కడిక్కడే కుక్కచావు చచ్చారు కానీ దురదృష్టవశాత్తు మన సమర జ్వాలామణి అయిన ప్రీతిలత కాళ్ళలోకి బుల్లెట్లు దూసుకెళ్ళాయి. వెంటనే పోలీసు బలగాలు ఆమెను చుట్టుముట్టాయి. శతృవులు తనను చుట్టు ముడుతున్నారని గ్రహించి, వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలతో దొరకకూడదనే అచంచల ధైర్యంతో, ఆ భారతమాత వీరపుత్రిక ఆత్మార్పణ గావించింది. తన జేబులోంచి ఓ సైనైడ్ గుళిక తీసి, నోట్లో వేసుకుంది దేశం కోసం బలిదానం అయ్యింది. అంతిమంగా మాతృభూమి రక్షణకోసం తమ జీవితాన్ని త్యాగం చేసింది. 

ప్రీతిల‌త‌కు కోల్‌క‌తాలో ఆ తరువాత ఓ పార్కులో విగ్రహాన్ని ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. అయితే ప్రీతిల‌త గురించి దాదాపుగా బెంగాలీలు, చిట్ట‌గాంగ్ వాసుల‌కు త‌ప్ప చాలా మందికి తెలియ‌దు. ఇలాంటి మనదేశ సమర జ్వాలామణుల‌ గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మనపై వుంది. జై‌హింద్.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments