Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ఆర్ ఎస్ ఎస్ జ్వేష్ట కార్యకర్త శ్రీ మాదవ్ గోవింద్ వైద్యాజి స్వర్గస్తులయ్యారు - About Madav Govind Vaidya ji

నిత్య సాధకుడు.... నిరంతర ప్రేరకుడు..... స్వర్గీయ గోవింద వైద్య. ఆర్ ఎస్ ఎస్ జ్వేష్ట కార్యకర్త శ్రీ మాదవ్ గోవింద్ వైద్యా‌జీ ఈ రోజు...

నిత్య సాధకుడు.... నిరంతర ప్రేరకుడు..... స్వర్గీయ గోవింద వైద్య.

ఆర్ ఎస్ ఎస్ జ్వేష్ట కార్యకర్త శ్రీ మాదవ్ గోవింద్ వైద్యా‌జీ ఈ రోజు మధ్యాహ్నం 3:30 ని లకు స్వర్గస్తులయ్యారు. వారి మరణం సంఘానికి తీరని లోటు. ఆర్. ఎస్. ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రచార విభాగం వారి మృతికి శ్రద్ధాంజలి ప్రకటిస్తున్నది. వారి గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు .......

శ్రీ మాదవ్ గోవింద్ వైద్య 11 మార్చ్ 1923 మహారాష్ట్రలోని తరోడాలో జన్మించారు. చిన్నప్పటి నుండి సంఘ  స్వయంసేవక్. సంఘ స్థాపకులైన డాక్టర్ హెడ్గేవర్ గారితో పాటే నాగపూర్ అంతా తిరిగేవారు. వీరిని సంఘంలో అందరూ బాబూరావ్ జీ అని పిలిచేవారు. దేశంలో ఆర్ ఎస్ ఎస్ తృతీయ వర్ష చేసిన ప్రతి స్వయంసేవక్ కి వీరు సుపరిచితులే. జరిగిన ప్రతి తృతీయవర్ష సంఘ శిక్షా వర్గలోనూ వారు ఉండేవారు. ఆర్ ఎస్ ఎస్ ఆరంభం నుంచి ఇప్పటి వరకూ సర్ సంఘచాలక్ లుగా ఉన్న ఆరుగురితోనూ శ్రీ గోవింద వైద్య కలసి పనిచేశారు. వీరు సంఘ‌ మూల సిద్దాంత కర్త. తొంబై ఐదేళ్ళ సంఘ ప్రస్థానంలో జరిగిన ప్రతి ఒక్క విషయానికీ సాక్షి. వీరు మంచి వక్త. సరళమైన భాషలో అర్దవంతంగా, సూటిగా మాట్లాడేవారు. ‘తరుణ్ భారత్’ అనే పత్రికకు సంపాదకునిగా పని చేశారు. రచయిత, పాత్రికేయుడు. ఎన్నో‌ పుస్తకాలు వ్రాశారు. హిందుత్వ భాష్యకారులు.

గృహస్తుగా ఉంటూ సంఘంలో అనేక బాధ్యతలు నిర్వర్తించారు.కుమార్తెలు, కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులలో ఒకరు ప్రస్తుత సహ సర్ కార్యవాహ్ శ్రీ‌మన్మోహన్ వైద్యాజి, ఇంకొకరు శ్రీ శ్రీరామ్ వైద్యా జి.  శ్రీ శ్రీరామ్ వైద్య విశ్వ విభాగ్ లో పనిచేస్తున్నారు. వీరిరువురూ సంఘ ప్రచారకులు. (పూర్తి సమయం దేశం కోసం బ్రహ్మచారిగా) పనిచేస్తున్నారు.

స్వర్గీయ గోవింద వైద్య జీవన ప్రస్థానం.....

• హిల్సాప్ కాలేజీ‌ నాగపూర్ లో 1949 నుండి 1966 వరకు ప్రొఫెసర్ గా పనిచేశారు.
•  నాగపూర్ లో నడిచే ‘తరుణ్ భారత్’ పత్రికకు సంపాదకునిగా 1966 నుండి 1983 వరకు పనిచేశారు.
• నాగపూర్ విశ్వ విద్యాలయం ఎక్సిక్యుటివ్ కౌన్సిల్ ‌మెంబర్ గా 1969 నుండి 1974 మరియు 1976 నుండి 1979 ప్రాంతాలలో పని చేశారు.
• మహారాష్ట్ర శాసన‌ మండలిలో 1978 నుండి 1984 వరకూ పనిచేశారు.
• 1990 లో ‘నర్కేసరి లిమిటెడ్’ కు మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేశారు.
• ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ బౌద్ధిక్ ప్రముఖ్ గా 1990 - 1992 మధ్యలో పనిచేశారు.
• ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ ప్రచార విభాగానికి మొదటి ప్రచార ప్రముఖ్ గా 1994 నుండి పనిచేశారు.

బిరుదులు, సత్కారాలు......
• మహారాష్ట్ర ప్రభుత్వం మహాకవి కాళిదాస్ సంస్కృత సాధన పురస్కార్ అనే బిరుదుతో సత్కరించింది.
• నాగపూర్ విశ్వవిద్యాలయం రాష్ట్ర సంత్ తుక్డోజీ జీవన్ గౌరవ్ పురస్కార్ తో సత్కరించింది.
• శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఫౌండేషన్ న్యూడిల్లీ వారు ‘బౌద్ధిక్ యోధ సమ్మాన్’ బిరుదుతో సత్కరించింది.
• గ్వాలియర్ వారు రాజమాత విజయరాజే సింథియా ‘పత్రకారితా సమ్మాన్’ తో సత్కరించారు.
• ‘జీవన్ గౌరవ్ ఏవమ్ రాష్ట్ర సేవా పురస్కార్’ బిరుదుతో శ్యామ్ రావ్ బాబు కాప్గాటే స్మృతి ప్రతిష్ఠాన్ వారు సత్కరించారు. 

స్వర్గీయ వైద్య అనేక పుస్తకాలు వ్రాశారు. “హిందుత్వ” అనే పుస్తకం బహుళ ప్రాచుర్యం పొందింది. దేశంలో అనేకమంది సంఘ స్వయంసేవకులు వీరితో సత్సంబంధాలు కలిగి ఉండేవారు. ఎంతోమంది స్వయంసేవకులకు మార్గదర్శి. ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుని పలుకరించేవారు. తృతీయవర్ష సంఘ శిక్షావర్గలో అందరితో ఆప్యాయంగా మాట్లాడుతూ ఉండేవారు. ఆ సమయంలో “మీరు ప్రచారకులా?” అని స్వయంసేవకులెవరైనా అడిగితే నేను ప్రచారకుల తండ్రిని అనేవారు. ఎందుకంటే వారిద్దరి కుమారులను సంఘానికి ఇచ్చేశారు. ప్రచారకులుగా దేశ సేవలో వారిద్దరి కుమారులు భారతమాతకు సమర్పితమయ్యారు.

గత కొన్ని రోజులుగా అనారోగ్యం తో ఉంటూ 19 డిసెంబరు 2020 (శనివారం) న మధ్యాహ్నం 3:30ని లకి వారు స్వర్గస్తులయ్యారు. సంఘానికి మార్గదర్శిగా ఉండే బాబూరావ్ జీ లేని లోటు తీర్చలేనిది అంటూ ఆర్ ఎస్ ఎస్ సర్ కార్యవాహ్ శ్రీ బయ్యాజీ జోషీ  శ్రద్దాంజలి ఘటించారు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.


No comments