Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

దేశ భవిష్యత్తుని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే - About Teachers Day in Telugu

దేశ భవిష్యత్తుని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే: “మాతృ దేవో భవ,పితృ దేవో భవ, ఆచార్యదేవో భవ “ అని తైత్తరీయ ఉపనిషత్తు తల్లి, తండ్...

దేశ భవిష్యత్తుని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే: “మాతృ దేవో భవ,పితృ దేవో భవ, ఆచార్యదేవో భవ “ అని తైత్తరీయ ఉపనిషత్తు తల్లి, తండ్రి తరువాత ఆచార్యునికి ఉన్నతమైన గౌరవ స్థానమును ఇచ్చింది. ఆచార్యుడు అంటే తమ ఆచరణ ద్వారా ఎవరైతే నేర్పిస్తారో వారు అని అర్ధం. ఇక్కడ ఆచార్యుడ్ని ఉపాధ్యాయునిగా అనుకుని ఆలోచిద్దాం! పాఠశాల సమాజానికి  ఓ చిన్న రూపం. పాఠశాల అనే చిన్న సమాజాన్ని తీర్చిదిద్ది,తద్వారా దేశాభివృద్దిలో ఒక ప్రత్యేకమైన పాత్రను పోషిస్తున్న వారు ఉపాధ్యాయులు. విద్యార్థుల శ్రేయస్సే ఆశయంగా అహర్నిశలు శ్రమిస్తూ, అంకిత భావం కల ఉపాధ్యాయులు ఎందరో నేటికీ దేశ శ్రేయస్సుకి తోడ్పడుతున్నారు. వ్యక్తి అభివృద్ధియే దేశాభివృద్ధి అవుతుంది. అలాంటి మంచి వ్యక్తుల నిర్మాణం తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది.

ఉపాధ్యాయ వృత్తి ప్రాధాన్యత: "స్వాతంత్ర్యమే నా జన్మ హక్కు" అనే నినాదంతో స్వతంత్ర పోరాటములో పాల్గొన్న బాల గంగాధర తిలక్ ని ఒక పత్రికా విలేఖరి ఇలా అడిగాడు. “దేశానికి స్వతంత్రము వచ్చి, ప్రభుత్వమును ఏర్పాటు చేస్తే మీరు ఏ శాఖకు మంత్రి గా పనిచేస్తారు?'' అప్పుడు బాల గంగాధర్ తిలక్ ఇలా అన్నాడు. “ ఈ దేశానికి స్వతంత్రం వచ్చాక  నేను మంత్రిని అయితే ఆ శాఖకు మాత్రమే వన్నె తెస్తాను. కాని నేను ఉపాధ్యాయునిగా తిరిగి పునాకు వెళ్లి,ఇలాంటి  వన్నె తెచ్చే ఎంతో మంది మంత్రులను తయారు చేస్తాను"అని ఉపాధ్యాయవృత్తి యొక్క ప్రాధాన్యతను తెలియ చేసాడు.   
డా,,అబ్దుల్ కలాం గారు తమిళ పత్రికలో ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో ఓ చిన్నారి "చిన్నతనంలో మీరు చాలా కష్టాలు పడి ఓ పెద్ద శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు, రాష్ట్రపతి అయ్యారు కదా!మీ విజయానికి కారణం అదృష్టమా?" అని అడిగితే "అవును చిన్నతనంలో నాకు మంచి దారి చూపించే ఉపాధ్యాయులు దొరికిన అదృష్టం" అని బదులిచ్చారు. కలాం గారి గారి మాటల్లో ఇంకా చెప్పాలంటే “ ఒక విద్యార్థి యొక్క వ్యక్తిత్వాన్ని, సామర్ధ్యాన్ని , భవిష్యత్తును రూపుదిద్దే  మహోన్నత వ్యక్తే ఉపాధ్యాయుడు. వీలు దొరికినప్పుడల్లా ఏదైనా కళాశాలకు గాని,  విశ్వవిద్యాలయానికి గాని వెళ్లి వివిధ అంశాలపై కలాం గారు ఉపన్యసించేవారు.తన అనుభవాలను విద్యార్థులతో పంచుకొనేవారు.

‘ఒకరోజు నేను దేశ పూర్వాధ్యక్షుడిని అవుతాను. కానీ ఎప్పటికి మాజీ విద్యావేత్తను కాను’ (One day I will become former president but I will never become ex academician) అన్నారు సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు. చదవడమన్నా, చదువు చెప్పడమన్నా అంత ఇష్టం. ఉపరాష్ట్రపతిగా రెండుసార్లు, రాష్ట్రపతిగా ఒకసారి రాజ్యాంగ పదవుల నిర్వహణకు ముందు సుదీర్ఘకాలం అధ్యాపక వృత్తిలో కొనసాగారు. దేశంలోని అనేక ప్రతిష్ఠాత్మక కళాశాలల్లో, విశ్వవిద్యాలయాలలో పాఠాలు చెప్పారు. వివిధ విశ్వవిద్యాలయాలకు ఉపకులపతిగా సేవలు అందించారు. ప్రతి చోట విద్యార్థుల మనసులపై చెరగని ముద్రవేశారు.

నైపుణ్యాలను వెలికితీయుటలో: వజ్రం ఎంత గొప్పదైనా దానికి సానపట్టడం ద్వారా దాని వెలుగు బయటపడుతుంది. అదే విధంగా చిన్నారులలో సహజ సిద్దంగా దాగిఉన్న సామర్థ్యాలను వెలికి తీసి, సానబట్టి, వజ్రాల్లా తయారు చేయుటలో నిమగ్నమై పోయేవారు ఉపాధ్యాయులే. మట్టిలోని మాణిక్యాలను వెలికి తీయటంలో ప్రధాన పాత్ర పోషించేవారు ఉపాధ్యాయులే. అత్యున్నత పురస్కారాలు పొందిన వారి దగ్గర నుండి సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరు తమ ప్రగతికి  చిన్న నాటి ఉపాధ్యాయులే కారణమని, ప్రేరణ అని  చెప్పుకోవడం సహజంగా గమనిస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్న వారు కూడా ఒక ఉపాధ్యాయుని దగ్గర శిక్షణ పొందినవారే కావడం ఒక విశేషం. ఆ విధంగా సమాజ వికాసానికి, సమాజ నిర్మాణానికి అహర్నిశలు పనిచేసే ఉపాధ్యాయులను స్మరించుకోవడం మన కనీస బాధ్యత. అంతే కాదు వారిని సముచితమైన రీతిలో గౌరవించుకోవటం కూడా ఎంతైనా అవసరం. ఉపాధ్యాయ దినోత్సవం నాడు మనం అందరం మనల్ని తీర్చిదిద్దిన, మనకు స్ఫూర్తినిచ్చిన లేదా మన జీవితంలో మార్పుకి కారణం అయిన ఉపాధ్యాయునికి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు చెప్పుదాం. వారి యోగక్షేమాలు తెలుసుకుందాం. వారిని ఆనందింపజేద్దాం.
(సెప్టెంబర్ 5, ఉపాధ్యాయ దినోత్సవ ప్రత్యేక వ్యాసం)

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

2 comments

  1. Yes, really correct First mother, second father,Third teacher and last priority is God

    ReplyDelete
  2. Happy teacher's day to all my teachers

    ReplyDelete