Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

గో సంరక్షణకు మనం ఏం చేయొచ్చు - these ways to protect cow

గో సంరక్షణకు మనం ఏంచేయొచ్చు: ఆవు ప్రాముఖ్యత తెలియచేసే సాహిత్యాన్ని మనం చదవాలి. ప్రధానంగా ఇంట్లోని యువతరం చేత చదివించాలి. గోమ...

గో సంరక్షణకు మనం ఏంచేయొచ్చు: ఆవు ప్రాముఖ్యత తెలియచేసే సాహిత్యాన్ని మనం చదవాలి. ప్రధానంగా ఇంట్లోని యువతరం చేత చదివించాలి. గోమాత పట్ల భక్తిని పిల్లలలో కల్గించాలి.

రోజువారీ జీవితంలో, గోఉత్పత్తులు - పాలు, నెయ్యి, సబ్బులు, షాంపూ పండ్లపొడి, అగరువత్తులు... ఇలాంటి వినియోగ వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించాలి. గోమూత్రం ద్వారా తయారయ్యే మందులను - ఇంట్లోని సభ్యులందరూ వాడేటట్లు ప్రోత్సహించాలి.

దేవాలయం, ధర్మకర్తలు, భక్తులు - ప్రతి దేవాలయం ఒకటి రెండు ఆవులను పోషించేట్లు చూడాలి. గోశాలలను కుటుంబసమేతంగా సందర్శించడం, వారికి ఆర్థికంగా సహకరించడం చేయాలి. గోశాల నిర్వహణలో సమయమిచ్చి కార్యకర్తగా పనిచేయవచ్చు.

సంవత్సరంలో ఒకసారి కృష్ణాష్టమి సందర్భంగా లేదా మరేదైనా పండుగ సందర్భంగా పాఠశాల, దేవాలయం, కేంద్రంగా సామూహికంగా గోపూజను నిర్వహించి, గోసంరక్షణ ప్రాముఖ్యతను తెలియజేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో గోవులను పెంచే గోప్రేమీ కుటుంబాల సంఖ్యను ప్రోత్సహించాలి. వ్యక్తిగత స్థాయిలో గోపాలనను ప్రోత్సహించాలి.

ఆపైగా గోప్రేమీ కుటుంబాలు గల గ్రామం "అభయ గ్రామం" అవుతుంది. ఇటువంటి అభయగ్రామాల సంఖ్యను పెంచాలి. ప్రతి గ్రామంలో పశువుల పెంపకం కొరకు అవసరమగు గోచర భూమి (“పశువుల బీడు”) వ్యవస్థను తిరిగి ఏర్పరచాలి. రసాయనిక ఎరువుల వాడకాన్ని మాని సేంద్రియ వ్యవసాయ విధానాలను, గోఆధారిత వ్యవసాయ విధానాలను రైతులు చేపట్టేట్లు ప్రోత్సహించాలి.

ప్రతి గ్రామంలో గోవులను పోషిస్తున్న రైతుల నుండి గోమూత్రము, గోపేడలను సేకరించి, వాటి ద్వారా సేంద్రియ ఎరువులు, వివిధ గోఉత్పత్తులను తయారు చేయడానికి యువకుల బృందానికి తర్ఫీదునివ్వాలి. తద్వారా వారికి ఉపాధి లభిస్తుంది. రైతులకు ఆదాయం పెరుగుతుంది. గో ఉత్పత్తుల వినియోగదారులకు వస్తువులు లభ్యమవుతాయి.

చట్టానికి వ్యతిరేకంగా, ఆవులను వధశాలలకు తరలిస్తున్న సంఘటనలు ఎదురైనప్పుడు ఆవుల తరలింపును ఆపి, పోలీసులకు ఫిర్యాదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. గోమాంసం తినడం వల్ల వచ్చే నష్టాలను తెలియచేసి, గోమాంస భక్షణను ఆపి వేయించాలి. గో సంరక్షణకు జరిగే వివిధ కార్యక్రమాల్లో, ఉద్యమాల్లో పాల్గొనాలి. లక్షలాది ఆవుల మరణానికి కారణమవుతున్న, పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని మానివేయాలి.

ఇంకా ఎన్నో రకాలుగా ‌మనం గోవును రక్షించవచ్చు, అది మన బాధ్యత అని తెలిసిన రోజున భారతదేశం ఉన్నత దేశం గా మరల వైభవం సాధిస్తుంది.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments