Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

నన్ను సన్యాసిగా చేయండి అని అడిగిన బాలుడెవరో తెలుసా? - megamind - short stories in telugu

గుల్బర్గా జిల్లా లో సింద్గీ అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామం ప్రక్కనే భీమానది ప్రవహిస్తున్నది. ఆ గ్రామంలో ఒక చిన్నపిల్లవాడికి సాయంత్రం వేళ ...


గుల్బర్గా జిల్లా లో సింద్గీ అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామం ప్రక్కనే భీమానది ప్రవహిస్తున్నది. ఆ గ్రామంలో ఒక చిన్నపిల్లవాడికి సాయంత్రం వేళ షికారుకు పోవటం అలవాటు చుట్టూ ఉన్న చెట్లు పంట చేలు తోటలు కొండలు చూస్తూ నది ఒడ్డునే గంటల తరబడి కూర్చొని ఉండేవాడు.

ఒక రోజు మామూలుగా నది ఒడ్డున తిరుగుతున్నాడు. అతని దృష్టిని ఒక చెట్టు క్రింద దృశ్యం ఆ కట్టుకున్నది. అక్కడ ఒక సాధువు కనులు మూసుకొని ధ్యాననిమగ్నుడై ఉన్నాడు. ఆ బాలుడు ఆ సాధువు ముందుకు వెళ్లి నిశ్చలంగా నిలుచున్నాడు. కొంత సేపటికి ఆ సాధువు కళ్లు తెరచి ఆ బాలుడిని చూశాడు. సాధువు సాదరంగా నీవు ఎవరివి నాయనా? నీకు ఏమి కావాలి? అని అడిగాడు.

సాధువు అట్లా అడిగేటప్పటికి ఆ బాలుడు ఆశ్చర్యపోయాడు. ఆ ఆశ్చర్యం నుండి తేరుకొని. కంటతడి పెట్టి, నన్ను సన్యాసిగా చేయండి అంటూ అడిగాడు. ఆ సన్యాసి అట్లాగే జరుగుతుంది లే! అని దీవించి అక్కడి నుండి నిష్క్రమించాడు. తప్పకుండా సన్యాసి కావాలని ఆ బాలుడు ఆనాడే నిర్ణయించుకున్నాడు. ఆ బాలుడి పేరు వెంకట్రావు భేషీకర్. చిన్ననాటి నిర్ణయం పెద్దయిన తరువాత అమలుపరిచాడు. పెద్ద అయి బాగా విద్యాధికుడు అయ్యాడు. పాఠశాలలు ఏర్పాటు చేసి ప్రసిద్ధుడయ్యాడు.

తన ముప్ఫై సంవత్సరాల వయస్సులో స్వామి నారాయణ గారి దగ్గర సన్యాస దీక్ష తీసుకున్నాడు. ఆనాటికి అతడి చిన్ననాటి నిర్ణయం నెరవేరింది. సన్యాసి అయిన తరువాత అతని పేరు స్వామి రామానంద తీర్థ గా మారింది. ఆయన భారత జాతీయ ఉద్యమాలలో ప్రముఖ పాత్ర వహించాడు. నిజాంపరిపాలన నుండి హైదరాబాదు సంస్థానాన్ని విముక్తం చేయటానికి సాగిన స్వాతంత్ర్యరాటంలో ప్రముఖుడనిపించుకున్నాడు.

ఇలాంటి చిన్న కథల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments