Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

రెండు అణాల మామిడి పళ్ళకు ఆరు అణాలు ఇచ్చిన ఆ దేశభక్తుడెవరో తెలుసా? - megaminds - short stories in telugu

అది వేసవికాలం, ఎండ మాడిపోతున్నది. వార్ధా దగ్గరలో ఒక ఆశ్రమం ఉన్నది. ఆ ఆశ్రమ వాసి ఒకరు మామిడి పళ్ల కోసం బజారుకు వచ్చారు. ఒక అవ్వ మామిడి ...


అది వేసవికాలం, ఎండ మాడిపోతున్నది. వార్ధా దగ్గరలో ఒక ఆశ్రమం ఉన్నది. ఆ ఆశ్రమ వాసి ఒకరు మామిడి పళ్ల కోసం బజారుకు వచ్చారు. ఒక అవ్వ మామిడి పళ్లు అమ్ముతున్నది. రెండు రోజుల క్రితం ఆవ్యక్తి ఆఅవ్వ దగ్గరే మామిడి పళ్లు కొన్నాడు. అందుకని ఆ అవ్వదగ్గరే మామిడి పళ్లు బేరం చేశాడు.

ఆ అవ్వ ఒక గంప మామిడి పళ్లు రెండు అణాలు అని చెప్పింది. ఆ మాటలు విన్న ఆయన ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి అవ్వా! రెండు రోజుల క్రితం ఇటువంటి పళ్లు గంప ఆరు అణాలకు ఇచ్చావు, ఇవాళ ఇంత తగ్గించి చెబుతున్నావు ఏమి? అని అడిగాడు. ఏం చేసేది నాయనా! నిన్న వచ్చిన గాలికి పండ్లన్నీ రాలిపోయాయి. ఎక్కడంటే అక్కడ మామిడి పళ్లున్నాయి. కొనేవాళ్లు ఎంతమంది ఉంటారు. అందుకని తగ్గించి అమ్ముతున్నాను అని జవాబు ఇచ్చింది ఆ అవ్వ.

ఆయన మాట్లాడకుండా మామిడి పళ్ల గంప తీసుకున్నాడు. అవ్వ అడిగిన రెండు అణాలకు బదులు ఆరు అణాలు ఆమె చేత బెట్టాడు. ఈసారి ఆశ్చర్యపోవటం అవ్వవంతు అయింది. ఆమె ఆశ్చర్యంగా ఇదేమిటి నాయనా? అని అన్నది.

ఒక్క గంప మామిడి పళ్లకోసం మొన్న ఎంత శ్రమపడ్డావో ఈ రోజు కూడా ఆ గంప కోసం అంతే శ్రమపడ్డావు గదానీవు? అని అడిగాడు ఆయన. అవును అన్నది అవ్వ మరి నీకు ఇన్ని పండ్లకు తక్కువ ఎందుకు ఇవ్వాలి మొన్న ఇచ్చినంతే ఇవ్వాలి కదా? అని ఆయన మామిడి పండ్లుతో సాగిపోయాడు. ఉదారత్వాన్ని చూపించి శ్రమకు తగ్గ ఫలం ఉండాలని తెలియజెప్పిన ఆ వ్యక్తి సర్వోదయ ఋషి గా పేరుపొందిన వినోభా భావే. భూదాన ఉద్యమాన్ని ఒక యజ్ఞంగా సాగించాడు.

ఇలాంటి చిన్న కథల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments