Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

గంగానది స్వచ్చంగా మారిందా? - river ganga in telugu - megaminds

హిందువులు పవిత్రంగా భావించే, భారత దేశపు జీవ నది అయినా గంగానది కాలుష్యం చాలాకాలంగా భారతీయులను ఎంతగానే వేధిస్తున్నది. కాలుష్య కారక పరిశ్...


హిందువులు పవిత్రంగా భావించే, భారత దేశపు జీవ నది అయినా గంగానది కాలుష్యం చాలాకాలంగా భారతీయులను ఎంతగానే వేధిస్తున్నది. కాలుష్య కారక పరిశ్రమలు వ్యర్థాలన్నీంటిని గంగా నదిలోకి మళ్లించడం దీంతో పాటు మానవ, జంతువుల మృతదేహాలను ఇష్టానుసారం నదిలో విసిరేయడం వంటి చర్యలతో గంగా తీవ్ర కాలుష్యానికి గురైంది.

గంగా నదీ ప్రక్షాళన కోరుతూ పలువురు సాధువులు ఆత్మబలిదానం చేసుకున్నారు. గంగానది ప్రక్షాళన కోసం మోదీ ప్రభుత్వం నమామి గంగే కార్యక్రమాన్ని చేపట్టింది. ఏ చర్యలైనా ఆశించిన ఫలితాన్ని మాత్రం ఇవ్వలేకపోయాయి. కాగా కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ మాత్రం ఈ ఫలితాన్ని చూపించింది. ఐఐటీ-బీహెచ్‌యూ, వారణాసికి చెందిన ప్రొఫెసర్‌ డా.పీకే మిశ్రా జరిపిన పరిశోధనలో గంగా నదీ నీటి నాణ్యత పెరిగినట్లుగా వెల్లడైంది. కన్పూర్‌ వద్ద గంగానది నీటి నాణ్యత పరిమాణం మెరుగుపడిందని తెలిపారు. 40 నుంచి 50 శాతం మేర గంగా నదీ నీటి నాణ్యత మెరుగుపడిందని ఆయన తెలిపారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత మీద జాగ్రత్తలు తీసుకోవటం ప్రారంభమైంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పరిశ్రమలు మూతబడటంతో కాలుష్య కారకాల ప్రవాహం ఆగిపోయింది. కాలుష్యం విపరీతంగా తగ్గిపోవడంతో ప్రకృతి పునరుత్తేజం అవుతోంది.

ఎప్పుడూ పరిశ్రమలు, వాహన కాలుష్యంతో నిండిపోయే ఆకాశం ఇప్పుడు తేటతెల్లంగా కనిపిస్తుంది. దీంతో కొన్ని అరుదైన దృశ్యాలు ప్రజలను ఆనందభరితుల్ని చేస్తున్నాయి. ఇటువంటి ఘటనే పంజాబ్‌లోని జలంధర్‌లో చోటుచేసుకుంది. జలంధర్‌ నుంచి  200 కిమీ కు పైగా దూరంలో ఉన్న హిమాలయ పర్వత శ్రేణుల్లోని దౌలాదార్‌ పర్వతాలు దర్శనమిస్తున్నాయి. గాలిలో కాలుష్య కారకాలు తగ్గిపోవడంతో... సుదూరంలో ఉన్న పర్వతాలు మంచుతో సహా చూపరులకు కనువిందు చేస్తున్నాయి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments