వేరుశనగకాయలు నేను తినలేదు నన్ను కొట్టొద్దు అన్నదెవరో తెలుసా? - megamind - short stories in telugu

0

మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో చిఖలే అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయుడు తరగతి గదికి వచ్చాడు. వచ్చీ రాగానే తివాచీ మీదనున్న వేరు శనగ తొక్కలు ఆయన కంటబడ్డాయి. అంతే ఉగ్రుడైపోయాడు. పిల్లల వంక తిరిగి వేరుశెనగకాయలు ఎవరు తిన్నారు? అని గద్దించి అడిగాడు. పిల్లలు భయం తో కుక్కిన పేనుల్లా అయిపోయారు. ఉపాధ్యాయునికి కోపం కట్టలు త్రెంచుకున్నది. ఊ! చేతులు చాచండి! అన్నాడు. 

పిల్లలంతా భయపడుతూ ఏడ్పు మొఖాలతో చేతులు ముందుకు చాచారు. చాచిన చేతులపై బెత్తంతో రెండు దెబ్బలు వడ్డిస్తూ వస్తున్నాడు ఉపాధ్యాయుడు. వారిలోని ఒక అబ్బాయి దగ్గరకు వచ్చాడు. ఆ అబ్బాయి అందరిలాగా చేతులు చాచలేదు. ఎం? ఎందుకు చాచలేదు? ఉపాధ్యాయుడు గద్దించి అడిగాడు. 

వేరుశనగకాయలు నేను తినలేదు. అందుకని దెబ్బలు కూడా తినను  అన్నాడు. ఆ బాలుడు. అయితే! మరెవరు తిన్నారు? మళ్లీ అడిగాడు ఉపాధ్యాయుడు. ఆ బాలుడికి చాడీలు చెప్పే అలవాటు లేదు. నాకు తెలియదు అని ఖండితంగా చెప్పాడు. అలాగే! అంటూ ఉపాధ్యాయుడు ఆ బాలుడిని బడినుండి గెంటివేశాడు. అయినా ఆ బాలుడు తన పట్టువదల లేదు. నేను చేయని తప్పుకు శిక్ష ఎందుకు అనుభవించాలి? అనే ధీమా కనబరిచాడు.

సత్యం అన్నిటికంటే ఉత్తమమైన నతి, సత్యాన్నిపాలించటం అగ్నిపరీక్ష లాంటిది. బంగారానికి వన్నె రావాలంటే అగ్నిలో కాల్చాలి. సత్యపరీక్ష కూడా అట్టిదే! అని పెద్దవాడు అయిన తరువాత చాటి చెప్పాడు. ఆ బాలుడే లోకమాన్య బాల గంగాధర తిలక్. స్వాతంత్ర్య సమరంలో స్వరాజ్యం నా జన్మహక్కు అనే నినాదాన్ని అందించాడు.

ఇలాంటి చిన్న కథల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top