ధనంకోసం నేను బ్రిటీష్ వాడి ముందు వాదించను అన్న లాయరు ఎవరో తెలుసా? - megamind - short stories in telugu

0

1924వ సంవత్సరం. డిసెంబర్ నెల స్వరాజ్య సంపాదనకోసం కాంగ్రెస్ సంస్థ ఏర్పడింది. ఆ సంస్థ తన మహాసభను ఆ సంవత్సరం 'బెల్గాం'లో జరుపుకొంటున్నది. ఆ సభకు ప్రముఖ నాయకులు చాలామంది వచ్చారు. వారితోపాటు ఆనాడు పేరు పొందిన ఒక ప్రముఖ న్యాయవాది కూడా వచ్చాడు. సభ ఇంకా ప్రారంభం కాలేదు.

అంతలో ఇండోర్ మహారాజు అక్కడకు వచ్చాడు. అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఆయన సరాసరి ఆ ప్రముఖ న్యాయవాది దగ్గరకు వెళ్లాడు. అయ్యా! నేనొక చిక్కులో పడ్డాను. నా తరపున మీరు వాదించాలి. ఇదిగో 25 లక్షల రూపాయలు. కేసు గెలిచిన తరువాత ఇంకో 25 లక్షలు ఇస్తాను, అని ప్రాధేయపడ్డా డు. ఆ కాలంలో 50 లక్షల రూపాయలంటే ఎంతో విలువ రాజు గారి మీద హత్య చేయించి నాట్లు ఆరోపణ వచ్చింది. సంస్థానాధీశుల కేసులను మామూలు కోర్టులో విచారించేవారు కారు.

బ్రిటీష్ రాజప్రతినిధి అయిన వైస్రాయి ఎదుటనే విచారణ జరిగేది. అటువంటి వైస్రాయి ఎదుట వాదించగల ప్రతిభావంతుడు. ఆ ప్రముఖ న్యాయవాది. అందుకే ఇండోరు మహారాజు ఆయనను అర్థించాడు. ఇంకొకళ్లు అయితే అంత మొత్తం వస్తుందని ఎగిరి గంతువేసేవారు. కేసు వాదించటానికి ఒప్పుకొనేవారు. కానీ ఆ న్యాయవాది తొణకలేదు. బెణకలేదు. నిబ్బరంగా.. నిష్కర్షగా ఇలా అన్నాడు.

అయ్యా! క్షమించండి. స్వరాజ్యం వచ్చేవరకు. అంగ్ల న్యాయస్థానాల గడపతొక్కకూడదని ప్రతిజ్ఞ చేశాను. ఇప్పుడు మీ తరపున వాదించటానికి ఒప్పుకుంటే నా ప్రతిజ్ఞకు భంగం కలుగుతుంది. మీ డబ్బుకు ఆశపడి నేను వాదించలేను మహారాజు నిరుత్తరుడయ్యాడు. చేసేది ఏమీ లేక ఇంకొక న్యాయవాదిని చూచుకున్నాడు. అంత డబ్బు వస్తున్నా తృణంలా వదులుకున్నాడు ఆ న్యాయవాది. ఆయన దేశ బంధు చిత్తరంజన్ దాస్.

ఇలాంటి చిన్న కథల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top